వినమరుగైన

అర్ధశతాబ్దపు ఆంధ్ర కవిత్వం ( శ్రీపాద గోపాల కృష్ణమూర్తి )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ రెండు వ్యాసాలూ ఈనాటి అంటే 1960-2000 మధ్య కవిత్వ చరిత్రలు రాసేవారికి దిక్సూచి అనక తప్పదు.
సమకాలిక కవిత్వమెప్పుడూ వేడిగా వుంటుంది. దానిపై చన్నీళ్ళు చల్లడమే ఉద్యమంగా కొందరెప్పుడూ ఉంటారు. భావకవిత్వం ముమ్మరంగా అల్లుకున్న వేడి రోజుల్లో నేటి కాలపు కవిత్వం అంటూ వెక్కిరింత- విమర్శను ఉమాకాన్తమ్‌గారు రాస్తే కవులంతా నీరుగారిపోయారు. సాహితీ సమితి చిరునామా లేకుండా పోయింది. విమర్శకులెవ్వరూ అప్పటికీ తయారుగా లేరు జవాబు చెప్పేందుకు. కవులకది చేతకాని పని.
సాహిత్య విమర్శ తీరే అలాంటిది. ఈ రంగంలో ఒక పుస్తకం మరో పుస్తకం రావడానికి దారినిస్తుంది. ఇదొక సంఘర్షణ. చర్చ. ఈ చర్చకు సమాధానం శ్రీపాదయే. చాలాకాలం తర్వాత అనితర సాధ్యం నిర్వహించి, ఈ ఆ ఆలో చూపించారు. దోష విమర్శలూ పురోగమనమూ అనే 10వ వ్యాసం ఇందుకోసమే రాశారాయన.
ఉమాకాన్తమ్‌గారి విమర్శలనెలా శ్రీపాద ఎదుర్కొన్నారో ఒక్క ఉదాహరణం మచ్చుతునకగా చూద్దాం. భావికవిత్వ మనడమే అసంగతం. భావం లేనిదే కవిత్వమే లేదు అన్నారు విద్యాశేఖరులు. ఒక వస్తువు దృశ్యము అనుభమును గురించిన భావాల్ని నిశ్రే్శణిగా కూర్చిన రచనలు కీట్సు, షెల్లి, బైరాను వంటి ఆంగ్ల కవుల రచనలలో కొల్లలుగా ఉన్నవి. కథా కావ్యమువల్లగాని, భావకావ్యమువల్లకాని కవి చదువురులలో సద్యఃపర నిర్వుృత్తి కల్గించగలరు. ఉపనిషత్తు ధ్వీధితిలలోని ఊరేగుదేవా ఉర్వి దౌర్జన్యాల కూరకున్నావా అన్నది భావ కావ్యము.. ఆధునికులు ఆంగ్లేయుల పద్ధతిలో లోకానుభవాల్ని భావాల నిశ్రే్శణిగా అమర్చి భావ కావ్యాలుగా తీరుస్తున్నారు. ఇలా... ఇలా జవాబులు.
పరస్పర విరుద్ధ భావాల సంఘర్షణవల్ల సత్యం బైటపడుతుంది. మామూలుగా నడిచిపోతున్న కాలం పరిగెడుతుందప్పుడు. ఉమాకాన్తమ్‌గారు చేసిన విమర్శకు వెంటనే కిక్కిరుమనకపోయినా, నిర్మాణాత్మకంగా ఆలోచించడం మొదలయింది. సాహితీ సమితి తలుపులు మూతపడగానే నవ్య సాహిత్య పరిషత్తు వచ్చేసింది.
*
సశేషం
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

మిరియాల రామకృష్ణ