వినమరుగైన

నగరంలో వాన -కుందుర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎత్తయిన విద్యుద్దీపం మీదికి ఎక్కి ఎక్కి చూసిందొక చినుకు’’
అంటూ సాగి, చినుకు తన చేదు అనుభవాల్ని చెబుతూ-
‘‘ఏ కమ్మని పల్లెటూరి పంట చెరువులోనో పడక
నగరానికెందుకు వచ్చానని నాలిక కొరుక్కుంది’’
పాజిటివ్ అంశాల్ని విస్మరించలేదనుటకు-
‘‘చదువుల తల్లి స్తన్యమంత మధురమైన మరొక బిందువు
విశ్వవిద్యాలయంలో వెలసిన వెలుగులో కల్సిపోయింది’’ అంటారు.
చివరకు ప్రాకృతిపరమైన వానని సైతం రాజ్యాధికారం ప్రజాస్వామ్య రూపంలో శాసిస్తుందనటాన్ని ఈ పంక్తులు ఉన్నతంగా వ్యక్తీకరించాయి.
‘‘శాసన సభా శిఖరంమీద చల్లగా జారిన బిందువు
ఆకసం వంక తలయెత్తి చూసి
బాలిక వర్షమని శాసించింది
అంతటితో వాన వెలిసింది’’
కాని పాఠకునిలో కలిగిన రసాస్వాదన వర్షం అంతటితో ముగియదు. ఆగదు. తెగదు. తెరలు తెరలుగా అతన్ని తడుపుతూనే వుంది. తడుముతూనే వుంటుంది- తలచినంతనే.
తన అసమాన భావుకతతో పాఠకుని ‘సత్య సందర్శనం’ గావిస్తారు మరో కవితలో.
‘‘సమస్త వర్ణ సమామ్నయతం
శాలువగా కప్పుకుంది
తత్వవేత్తల మహాదర్శనం
తలపాగా చుట్టుకుంది
వక్షోజం ఒకటే వుంది
ఒక చేతికి రంగు రంగుల గాజులు
మరో స్తనం పట్టుకుంది’’
అంటూ సత్యదేవత శరీరంలో మహాకావ్యం ఒక భాగం చేయడం ద్వారా కావ్య ధర్మం చెప్పక చెప్పినట్లుంది.
‘‘స్వాభినందన’’ కవితా శీర్షికే చెప్తుందన్నట్లు-
‘‘హృదయాకాశంలో ముందుగా ఉదయాన్ని పసికట్టినందుకు నన్ను నేనభినందించుకుంటాను’’.
అంతా ఇదే రీతిలో ఉంటుంది. అప్పట్లో తనవచన కవితా ఉద్యమస్ఫూర్తికి తనకు తాను స్వయం ప్రేరితడగుటకు అవసరమైనదిగా భావించి వీటిని అర్థం చేసుకోవాలి. ఇదే కవితో సృజనకారులు ఎలా వుండాలో తెల్పుతూ-
‘కాలంలో జీవిస్తూ- గాఢంగా భావిస్తూ’’
అని కవి ఆకాంక్షను వెలిబుచ్చుతున్నారిక్కడ.
ఎంత నిబద్ధకవి అయినా, నగరంలో వాన కవితాఖండికలో లాగే ఇతర కవితల్లోనూ, ప్రాకృతిక వర్ణనలో తనదైన శైలిలో తనకు తానే సాటి అని నిరూపించారు.
‘‘సంక్రాంతి సూర్యుడి’’ని వర్ణిస్తూ-
‘‘అత్తరాంటికి వెళ్ళే కొత్త పెండ్లికొడుకులా
అప్పుడే పొడిచాడు సూర్యుడు
ప్రభాతం వెండి నౌకమీద నీల గగన నీరధిలో
నీటుగా నడిచాడు సూర్యుడు’’
అలాగే శీతల కాలాన్ని వర్ణిస్తూ-
‘‘కురుచైపోయిన పగళ్లు
పెదవులమీద ప్రారంభమైన పగుళ్లు
ఎముకలు కొరికే చలి
అమ్మో! పుష్యమాసం పులి!’’
అని కొనసాగిస్తూ సంక్రాంతి శోభలో తెలుగు నేలంతా పాఠకుని ముందు సాక్షాత్కరింపజేస్తారు.
తెలుగు కవిత్వంలో ఎలిజీలకు (స్మృతిగీతం) ప్రత్యేక స్థానం వుంది. కొన్ని చాలా ప్రసిద్ధమైనాయి. అయినవారు, ఆత్మీయుల మరణంతో దుఃఖాశ్రవులు అక్షరాకారం పొంది పఠితుల హృదయలనార్ద్రం గావిస్తాయి. తాను అపరిమితంగా అభిమానించే భావుకుడు, స్వాప్నికుడు అయిన పండిట్ నెహ్రూ మరణం కుందుర్తిని కలచివేసింది. కంట కన్నీరొలికించింది. తానెంతగ ఆవిచలితుడు గానిదే కాలం ఆగిపోయింది అనగలడు.
‘టెలిఫోన్ తీగల ద్వారా లోకంలో శోకం ప్రవహించింది వాయువేగ మనోవేగాలతో’ అంటూ సాగిన ఈ కవితలో అక్షరాక్షరం కన్నీటిలో ముంచి రాసినట్లుంటుంది.
‘‘కనిపించిన ఒక ఆశ
ఒక తళుకు ఒక మెరుపు
ఒక దీపం ఆరిపోయింది
ఒక యుగం మారిపోయింది.
......
.......
ఒక తార నేల రాలింది
ఒక సూర్యని తేజోరేఖ పచ్చిమాద్రిపై వాలింది
నెహ్రూ మరణించాడో
నేనే మరణించానో’’
అనడం అతనిలో కవి కుందుర్తి ఎంతగా ఐక్యమైనదీ తెల్పుతుంది.
సాహిత్యంలో కవి- కవిత్వం గురించి అటు ప్రాచీనులు-ఇటు ఆధునికుల్లో అనేకులు పలు విధాలుగా ప్రస్తావించారు. ప్రస్తుతించారు. ఆ పరంపరలో శ్రీ కుందర్తి కూడా ఆశీస్సు కవితలో-
‘నిజమైన జన ధర్మం పలికే నోరు
లోకంలో కవిది ఒక్కటే’ అంటూనే
‘జన ధర్మం లోకంలో ఏనాడూ నెగ్గింది
జన ధర్మం వైపు ఏనాడో మొగ్గింది’
అంటారు నిజమైన ప్రజాస్వామ్యవాదిలా.
కొన్ని కవితా వస్తువులపై కవులకు మమకారం ఎక్కువ. వాటిలో ‘కాలం’ ఒకటి. కుందర్తిగారు కూడా కాలం గురించి రాసిన కవితలు మరో రెండు. ఒకటి కాలం తీర్పు. మరొకటి ఆరిపోతున్న కుంపటి. వీటిలో తాను విశ్వసించని వాటి ప్రస్తావనలూ ఉన్నవి.

-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-బి.లలితానంద్