వినమరుగైన

అక్షర తూణీరం కె. వి. రమణారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంఘ శుచీ, మనో వికాసమూ, సంఘాభ్యుదయమూ వివాదాస్పద విషయాలైతే రమణారెడ్డి వివాదాలకు ఎగువగా, దూరంగా, నిలుచోడు. వాటిమధ్య అతని ఉనికి. చారిత్రక, సాంఘిక, భావజాలాల సంఘర్షణల్లో రమణారెడ్డి పాక్షికుడు’’. విమర్శకుడి వైఖరి పట్ల ఎంతో స్పష్టత, నిబద్ధత వుంటే తప్ప ఇలా చెప్పటం సాధ్యంకాదు.
సాహిత్యం తీరుతెన్నులు, సాహిత్య సమీక్షలూ- విమర్శలూ, నగరం కధా కమామీషూ, తెలుగు సాహితీవేత్తలు, జాతీయ సాహిత్యం, అంతర్జాతీయ సాహిత్యం, రాజకీయాలు, సంస్కృతి మొదలైన అంశాలమీద సాగిన అక్షర తూణీరం వ్యాస పరంపరలో సాహిత్య విమర్శ గురించిన అనేక వౌలికాంశాల్ని కెవిఆర్ చర్చించటం జరిగింది. తెలుగులో మార్క్సిస్టు సాహిత్య విమర్శకులలో ఎక్కువమంది వాళ్లవాళ్ల విమర్శని ప్రధానంగా ఆధునిక సాహిత్యంమీదనే కేంద్రీకరించారు.
కెవిఆర్ లాంటివాళ్ళు కొంతమంది మాత్రమే ఈ పరిమితిని అధిగమించి ప్రాచీన సాహిత్యం గురించి కూడా ఎంతో కొంత వౌలిక ప్రతిపాదనలు చేయగలిగారు. యువ భావజాలానికి అనుగుణంగా విమర్శ మారుతూ వుంటుందని, అది జడపదార్థం కాదని నమ్మిన కెవిఆర్ తన సాహితీ ఆచరణలో కూడా అదే విషయాన్ని రుజువు చేశారు. అభ్యుదయ రచయితల సంఘంలో సభ్యుడుగా వున్నప్పటికి కెవిఆర్‌కి విరసం సభ్యుడుగా వున్న కెవిఆర్‌కి ఆలోచనలో వచ్చిన మార్పును కొంత లోతుగా పరిశీలించగలిగితే ఒక విమర్శకుడిగా కెవిఆర్ తత్వం ఎలా మారుతూ వచ్చిందో స్పష్టమవుతుంది.
ఉదాహరణకి 1961లో సాహిత్య విమర్శలపై విమర్శ అని రాసిన వ్యాసంలో ‘‘కవి ఉద్దేశాలను బట్టి విమర్శ సాగాలి గాని విమర్శకుని ఇష్టానిష్టాలను బట్టి కాదు’’ అని ప్రకటించిన కెవిఆర్‌కి మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనా విధానం తమ ప్రపంచ దృక్పథంగా ప్రకటించుకున్న విరసం సభ్యుడుగా వున్న కెవిఆర్‌కి వౌలిక వ్యత్యాసం వుందనేది స్పుష్టం. 1970 తర్వాత కెవిఆర్ విమర్శలో మార్క్సిజం మరింత దృఢరూపాన్ని తీసుకోవటం జరిగింది. దీని ఫలితంగా అంతకుముందు కెవిఆర్ విమర్శలో కనిపించిన ప్రజాస్వామిక లక్షణం ఆ తరువాత కొంతవరకైనా అంతర్థానమయిందనిపిస్తుంది.
అందువల్లే 1970లకి ముందు రాసిన అక్షరతూణీరంకి ఆ తరువాత వచ్చిన ‘జగన్నాధ రథచక్రాలు, నిశీధిని, ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర లాంటి విమర్శ పుస్తకాలకి వ్యత్యాసాలు చాలా స్పష్టంగానే తెలుస్తుంది.
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

సశేషం

బి. తిరుపతిరావు