వినమరుగైన

అక్షర తూణీరం (కె. వి. రమణారెడ్డి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరికొంచెం ముందుకెళ్లి శ్రీశ్రీకంటే ఎక్కువగా కవిత్వ భాషను విప్లవీకరించిన ఘనత ఆరుద్రది అని కూడా ప్రకటించారు కెవిఆర్. నిజానికి ఈ వ్యాసపరంరలో ఆరుద్రమీద చాలా వ్యాసాలున్నాయి. కవిత్వంలో ఆరుద్ర బహుళ రూపాల్ని విశే్లషించే ప్రయత్నం కెవిఆర్ ఈ వ్యాసాలలో చేశారు.
నగరానికి సాహిత్యానికి, ముఖ్యంగా కవిత్వానికి వున్న సంబంధాన్ని లేక నగర జీవితం సాంగత్య ప్రతిఫలం పొందిన విధానాన్ని నాలుగు వ్యాసాల్లో కెవిఆర్ చర్చించారు. ఈ క్రమంలో రాసిన నగరం ఫిడేలు పాటలో రోగాల రాగాలు అనే శీర్షికతో రాసిన వ్యాసంలో పట్ట్భా ఫిడేలు రాగాల డజన్ గురించి వ్యాసం కూడా వుంది. ఆరుద్ర కంటే గొప్ప కవిగా, గడసు కవిగా పఠాభి గురించిన అభిప్రాయం వ్యక్తంచేసిన కెవిఆర్ గడుసుదనమొక్కటే కవిత్వమవుతుందా? అని ప్రశ్నిస్తారు. మరింత ఆశ్చర్యకరంగా పట్ట్భాలోనూ, ఆరుద్రలోనూ మనోవిలసనమే గానీ హృదయపు చలనం లుప్తమని కూడా ప్రకటిస్తారు.
అడపాదడపా శ్రీశ్రీని విమర్శించినా కెవిఆర్ శ్రీశ్రీ పక్షపాతి. అయితే ఈ పక్షపాతం శ్రీశ్రీ దగ్గర ఆగకుండా శ్రీరంగం నారాయణబాబు వ్యతిరేకంగా పరిణమించటంచాలామంది విషయంలో రుజువయినట్లుగానే కెవిర్ విషయంలో కూడా రుజువవుతుంది. కీ.శే. శ్రీరంగం నారాయణబాబు అనే శీర్షికతో రాసిన వ్యాసంలో నారాయణబాబు కవిత్వంలో ‘మత విహిత కర్మలనూ సమన్వయించాడు’ అని అభిప్రాయపడిన కెవిఆర్ ఎందుకోగాని శ్రీశ్రీలో కూడా ఈ సమస్య చాలా ఎక్కువగానే వుందనే విషయం మర్చిపోయారు. అయితే నవీన సృష్టికర్తలలో నారాయణబాబు స్థానం శ్రీశ్రీకి దిగువ అనలేను. శ్రీశ్రీ వరుసలో అనవచ్చు అని ప్రకటించిన కెవిఆర్ తన సహృదయతను చాటుకున్నారు. నారాయణబాబు గురించి స్పష్టమయిన ప్రకటన మార్క్సిస్టులతో చేయగలిగింది ఒక కెవిఆర్ మాత్రమే.
రవీంద్రనాథ్ ఠాగోర్, కేరళ మహాకవి శంకర్ కురూప్, హిందీ మహాకవి ‘నిరాలా’ ఎర్నెస్ట్ హెవింగ్వే, ఇవో యాండ్రిచ్, లాటిన్ మహాకవి వీర్జిల్, అల్బర్టో మొరోవియా లాంటి దేశీయ, అంతర్జాతీయ రచయితల సాహిత్య తత్త్వాల్ని, వాచకాల్ని విశే్లషించిన కెవిఆర్ వ్యాసాలు చదువుతూ వుంటే ఆయన విస్తృత అధ్యయనం మనకి అవగతమవుతుంది.
అలాగే సంస్కృతి, రాజకీయాల గురించి రాసిన వ్యాసాల్లో కెవిఆర్ శాస్ర్తియ విషయాల సాధికారతని రుజువుచేయటం జరిగింది.
సాహిత్య, రాజకీయ, సాంస్కృతిక అంశాల సమీక్షలుగా నడిచిన కెవిఆర్ వ్యాసపరంపర అనేక వౌలిక భావనల్ని వ్యక్తపరుస్తాయి. శైలీపరంగా ఒకానొక ఇన్‌ఫార్మల్ లక్షణంతో నడిచే కెవిఆర్ వ్యాసాలు ఒక రచనని నిర్దిష్ట చారిత్రక నేపథ్యంలోంచి ఎలా అవగతం చేసుకోవచ్చో చూపిస్తాయి. ఆధునిక సాహిత్యం గురించి మాత్రమే కాక ప్రాచీన సాహిత్యం గురించి కూడా అక్కడ కెవిఆర్ వ్యక్తపర్చిన అభిప్రాయాలూ, విమర్శలూ ఆయన చూడగలిగిన నిగూఢ అంశాల్ని బహిర్గతం చేస్తాయి. మార్క్సిస్టు విమర్శ పడికట్టు పదాలకి అతీతంగా, వస్తు వైవిధ్యాన్ని అంగీకరిస్తూ, మొదట వర్గీకరణ దూరంగా వుండవచ్చుననే విషయాన్ని కెవిఆర్ అక్షరతూణీరం వ్యాసాలు రుజువు చేస్తాయి. ‘ఏ పరిశీలకుడయినా సంబరపడేంత సామగ్రి ఆరుద్రలో వుందని ప్రకటిచారు కెవిఆర్. ఆయన అక్షరతూణీరం చదువుతూ వుంటే మనక్కూడా ఏ విమర్శకుడయినా సంబరపడేంత సామగ్రి ఆయన విమర్శలో వుంది అనాలనిపిస్తుంది. అయితే ఈ విశాల దృక్పథాన్ని, సాహిత్యాన్ని మరి ఇరుకు ఆలోచనలకు అతీతంగా విశే్లషించగలిగిన శక్తిని ప్రదర్శించిన కెవిఆర్ 1970ల తరువాత ఎందుకు కొనసాగించలేకపోయారు? అనే ప్రశ్న మనల్ని వెంటాడుతుంది. 70ల తరువాత కెవిఆర్ విమర్శలో కొంత కరుకుదనం, మరికొంత జడాత్మకత చోటుచేసుకోవడానికి, మారిన ఆయన రాజకీయ వైఖరికి ఏమైనా సంబంధం వుందేమో ఆలోచించాల్సి వుంటుంది. ఈ విషయాల్ని ప్రక్కనబెట్టి చూస్తే ఆయన అక్షర తూణీరం ఆధునిక తెలుగు సాహిత్య విమర్శలో ఒక కీలకమైన రచన అనటానికి సందేహం అవసరంలేదు.
*
అయిపోయింది
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

బి. తిరుపతిరావు