వినమరుగైన

కందుకూరి స్వీయ చరిత్రము (కందుకూరి వీరేశలింగం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్యశూరుడు వీరేశలింగం, కదంపట్టి పోరాడిన సింగం, దురాచారాల దురాగతాలను తుదముట్టించిన అగ్నితరంగం22 అని మహాకవి శ్రీశ్రీ ఆయనను అభివర్ణించారు. 34కొట్టుకొనిపోయే కొన్ని కోటిలింగాలు, వీరేశలింగమొకడు మిగిలెను చాలు22 అని ఆరుద్ర ఆయనకు నివాళులర్పించారు. 34ఆధునిక కాలంలో అగ్రగణ్యుడైన ఆంధ్రుడు22 అని కట్టమంచి రామలింగారెడ్డి అంటే 3ప్రముఖ భారతీయులలో ఒకడు. లోతైన వివేచన, అంతులేని సాహసము, అమితమైన శక్తి కలవాడు. అసత్యాన్ని చెండాడి ప్రగతి మార్గం కోసం పోరాడాడు22 అని రాజాజీ ప్రస్తుతించారు. 34ఆదర్శ దృక్పథంగల కార్యవాది22 అని నార్ల వెంకటేశ్వరరావు అన్నారు. 34ఆంధ్రలో జీవిత ప్రవాహాన్ని వీరేశలింగం కొత్తదారి పట్టించారు. ఈ కృషిలో ఆయనకు మార్గదర్శకులు లేరు. ఆయనతో పోల్చదగినవారు లేరు22 అని కందుకూరి ఈశ్వరదత్తు కీర్తించారు.
ఇలాంటి వర్ణనలెన్నయినా నవ్యాంధ్ర వైతాళికుడు వీరేశలింగం విరాట్ స్వరూపాన్ని సంపూర్ణంగా చిత్రించలేవు. రాజారామమోహనరాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వంటి మహా సంస్కర్తల కోవలోనివారు వీరేశలింగం. ఆయన సంస్కరణాభిలాష కేవలం ప్రబోధమాత్రమైంది కాదు, ఆచరణ శీలమైంది. సామాజిక సంస్కరణతోపాటుగా శతాధిక గ్రంథాలు రాసి సాహిత్యరంగంలోనూ వరవడి పెట్టిన ప్రతిభా పాటవాలు ఆయన స్వంతం. అందుకే ఆయన ఆధునికాంధ్ర సంస్కార వికాసానికి అక్షరాలా ఆద్యుడు. మార్గదర్శకుడు. అనుభవాలగని.
భారతదేశంలో సాంస్కృతిక పునర్వికాసం పందొమ్మిదో శతాబ్ది ద్వితీయార్థంలో వూపందుకొన్నది.

- ఇంకా ఉంది

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన -
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

తెలకపల్లి రవి