వినమరుగైన

నగరంలో వాన -కుందుర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘క్షణ క్షణ వైవిధ్య సూచికంగా
విధి వ్రాతలో దాగిన అర్థాల కనుగుణంగా
విహరిస్తుంది కాలం’’’
అంటారు కాలం తీరులో.
అట్లాగే ఆరిపోతున్న కుంపటిలో కాలంకు సంబంధించిన తాత్విక ప్రశ్నలెన్నో రేకెత్తిస్తారు పాఠకునిలో.
‘‘అలా అనుకుంటామేగాని, అది ఎక్కడ? అంతమెక్కడ. కాలచక్ర పరిధిమీద ఏది మొదలు? ఏది చివర?’’ అంటూనే రుతుచక్రాలన్నీ వర్ణిస్తారు.
అనేకాలకు ఆద్యులైన శ్రీకుందర్తి పర్యాటక వచనకవితా రచనలోనూ ఆద్యులనుకోవాలి. ఆ సంప్రదాయం ఇప్పటికీ పాదుకొనకపోవడం దాని ప్రత్యేకతకు నిదర్శనం. ఇందులో వారి నాగార్జునసాగర్ యాత్రలో అనుభూతుల్ని కవితాత్మకంగా వర్ణిస్తారు. పాఠకుల్ని కూడా సాగర్ యాత్ర చేయించి దర్శింపజేస్తారు. కవితకు ఇంతకన్నా సార్థకత ఏమి కావాలి?
ఈ సంపుటి చివర అముద్రిత కావ్యం అనే దీర్ఘ కవిత ఉంది. ఇందులో మనిషి జీవితంలో ముఖ్యమైన నాలుగు దశల్ని వర్ణిస్తారు. వివిధ కోణాల్లో, ముఖ్యంగా ద్వంద్వాల్ని ఆయా దశల్లో ప్రస్ఫుటం జేస్తూ సర్వకాలీన, సార్వజనీనమైన అజ్ఞాత శైశవం, ఆరంభవనం, అసవర్థ కౌమారం, అవసాన వార్థక్యాలివి.
ఈ కవిత ఆసాంతం సరళంగా, స్పష్టంగా, సహజంగా, స్వచ్ఛంగా, సూటిగా కొనసాగుతుంది. ఒకోచోట పఠితుల హృదయాల్ని పట్టివేస్తుంది. నిశే్చష్టుల గావిస్తుంది. ఉన్నత తాత్వికతతో ఇందులో కథానాయకుడి యవ్వనోదయపు ఊహలన్నీ అత్యంత రమణీయంగా చెప్తారు. అలాగే మిగతా దశలూ, అయితే కథాకావ్యం గావడంతో అంతా చెప్పి పాఠకునికి ఒక షాక్ ట్రీట్‌మెంట్‌లా ఇదంతా పుట్టగానే గిట్టిన చిన్నారి జీవించి వుంటే సంగతని తేల్చేశారు. బహుశా వారికే ఇది అసమంజసమన్పించిందేమో పాఠకుల్ని క్షమాపణలడుగుతారు.
‘ఎడ్గార్ ఎలన్ పో’ అన్నట్లు లాంగ్- పోయం రెండూ పరస్పర విరుద్ధం అనేది వీరి కవితలకు అన్వయించదు. అయితే కొన్ని మరీ ప్లాట్‌గా వున్నవీ లేకపోలేదు. వాటిని పరిహరింపవచ్చు. నిడివి తగ్గించి సాంద్రతా పెంచవచ్చు. ఇలాంటివి ఒకటీ, అరా ఎలా వున్నా నగరంలో వాన ఒక సమగ్ర కావ్యంగా, మనిషి వస్త్వాశ్ర అంతర్లీనంగా లయాత్మక భావనాశిల్పంతో సంపూర్ణానుభూతిని పాఠకునిలో మిగులుస్తుంది. తెలుగు కవితాలోకంలో నిలుస్తుంది ఎప్పటికీ.
కుందుర్తిగారి కవిత్వంపై పార్శ్వాల్నీ పరిశీలించి సమగ్రంగా విశే్లషించి విస్తృతంగా (దాదాపు అచ్చులో 300 పేజీలు) రాసిన అద్దేపల్లి రామమోహనరావు గారి వ్యాసాల్లో నగరంలో వాన కావ్యానికి వర్తించే ముఖ్యాంశాల వ్యాఖ్యలివి క్లుప్తగం.
1.శ్రీశ్రీ, తిలక్ మొదలగువారు అభ్యుదయ ప్రజాకవిత్వానికీ ఎక్కువగా మార్గరీతి నాశ్రయిస్తే, కుందుర్తి ‘దేశి’ రీతి నవలంభించారు. ఈ విషయంలో కుందుర్తిని వచన కవిత్వపు తిక్కనగా అనడానికి ఏమీ సందేహం లేదు. తిక్కనలాగే వీరిదీ జవద్భాష, దేశీయం’’.
2.‘‘ఆంగ్లంలో వాల్ట్ విట్మన్‌కి కుందుర్తికి చాలా అభిప్రాయాల్లో దగ్గర పోలికలు కనిపిసె్తై, ఇరువురికీ ధ్యేయం- సామాన్యుడు. ప్రజాకవితా వికాసనలో ఈ యిద్దరు వచన కవుల సామ్యాలు స్ఫుటంగా ఉంటాయి. కావున ‘తెలుగు విట్మన్’గా అనవచ్చును కుందుర్తిని’’.
3. అట్లాగే అముద్రిత కావ్యం ఒకేసారి రెండు దశల్లో నడుస్తుంది. ఒక వంక లౌకికమైన సామాజిక ధోరణి, రెండోవైపు జీవితం గురించి సమాజానికి సంబంధం లేని తాత్విక ధోరణి..’’
‘‘ఇందులో సామాజిక ధోరణికంటే తాత్వికధఓరణే ఎక్కువ ముద్ర వేస్తుంది. ఈ ధోరణి కుందుర్తి వాదించే విధానానికి విరుద్ధం కాదా అన్నది ప్రశ్న’’ అంటూ వైరుధ్యాల్ని వెల్లడిజేశారు శ్రీ అద్దేపల్లి.
మరో ప్రఖ్యాత విమర్శకులు ‘చేరా’ దృష్టిలో కుందుర్తి ‘‘నుడికారం, సంభాషణారీతులు, ఉక్తివైచిత్రి, ఆర్ద్రస్పష్టత, అంత్యప్రాసలు, అలంకారాలు- ఇవి కుందుర్తి వచన కవిత్వంలో సామాగ్రి. ఇప్పటి (1987 మే 3) కవుల దృష్టిలో చూస్తే నవ్వుల్లో ప్రాచీనుడుగా కనిపిస్తాడు. అతి నవ్య వచన కవిత్వానికి రంగం సిద్ధం చేసిన వచన కవిగా కుందుర్తి స్థానం ఎప్పటికీ స్థిరమైనదే. ఈ మాటలు 3 మే 1987 చేరాతల్లోవి. అవి ఇప్పటికీ, ఎప్పటికీ యథాతథంగా వర్తించటమే కుందుర్తిగారి విశిష్టత. అందుకే ‘చేరా’ అన్నది ‘వచన కవిత్వానికి ఇంకో పేరు కుందుర్తి’ అని.
శీలా వీర్రాజుగారు చెప్పినట్లు కవిత్వం కుందుర్తి ఊపిరి (ఇది నా జెండాలో జెండా ఎగరేశా అనే ఉపోద్ఘాతం నుండి. స.ఆ.సా. 13 సంపుటం -364వ పుట)
తన షష్టిపూర్తి వరకన్నా ఉంటానని మాట ఇచ్చి ముందుగానే (1982) వెళ్లిపోయిన కుందుర్తిగారు నగరంలో వాన లాంటి కవిత్వపు ఊపిరిలో చిరంజీవులై వుంటారు. పాఠకుల్ని పలకరిస్తూనే వుంటారు పదే పదే-
వారి మాటల్లోనే వారికి నా మనస్సులు
‘‘దయ కాంతి ఉయ్యాలలతో
ఊహ ఊడిగం చేసిన నీకు
నమస్సులు నా కవితాశక్తి
పురా రూపమెత్తిన కవికి
ఆప్యాయంగా ప్రాచ్యలోకం
ఆకాశానికెత్తిన రవికి (కుందుర్తి కవికి)
నమస్సులు నా కవితా శక్తి
పురారూపమెత్తిన కవికి’’

-అయపోయంది
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-బి.లలితానంద్