వినమరుగైన

కందుకూరి స్వీయ చరిత్రము (కందుకూరి వీరేశలింగం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయితే ఆనాటికి జాతీయోద్యమం ఇంకా విస్తరించలేదు. రాజ్యాంగ స్వాతంత్య్రం కోసం పోరాటం కంటే సంఘ సంస్కరణ, సంస్కారాలు ముఖ్యమని ఆయన తలపోశారు. ఈ దృష్టి ఇంకా చాలామంది సంస్కర్తలలో కనిపిస్తుంది. అన్ని విషయాలలో అభివృద్ధి రావాలిగాని కేవలం రాజ్యాంగ సంస్కారం చాలదని ఆయన నొక్కి చెబుతారు. ఇంగ్లీషు వారి ప్రభావంవల్ల కలిగిన చైతన్యాన్ని సత్ఫలితాలను వివరిస్తారు. అయితే సంఘ సంస్కరణ లేని స్వాతంత్య్రం నిష్ప్రయోజనమనేది ఆయన ప్రధాన దృష్టి. ‘‘సాంఘిక సంస్కారములందు మనవారికి మాటలలో గల శూరత్వము కార్యములలో నింకను నేనభిలషించినంత కనబడుటలేదు. మన సంఘ స్థితి బాగుపడిన గానిప్రభుత్వము వారనుగ్రహించు స్వాతంత్య్ర ఫలములను మనము నిర్విచారముగా ననుభవింపజాలము’’ అని ఆయన స్వీయ చరిత్ర చివర విన్నపము పేర రాశారు. కులమతతత్త్వాలు, ఛాందసాలు, జ్యోతిషశాస్త్రం తదితర శాస్త్రాల పేరిట సాగు అంధ విశ్వాసాలు గమనిస్తే ఆయన ఆవేదనలోని వాస్తవికత ఎవరైనా అర్థం చేసుకోగలుగుతారు. భూతవైద్యుణ్ణి సవాలుచేసి రాత్రి స్మశానంలో కాపు వేసి దెయ్యాలు లేవని నిరూపించిన వీరేశలింగం పుట్టిన గడ్డమీదనే ఆ తర్వాత వందేళ్లకు క్షుద్రశక్తుల గురించి ప్రచారం పొందడం ఎంత దురదృష్టకరం. మూఢ నమ్మకాలతో ఇంట్లో అరటిచెట్లు నరికివేయమంటే నిరాకరించి ఎదురునిలిచిన ఆయన పుట్టిన చోటనే వాస్తు పేరిట అనేకమంది అనవసరమైన పనులు చేయించడం ఎంత విచారకరం? మహిళా వికాసం కోసం ఆయన జీవితమే ధారపోస్తే ఈనాడు సతీసహగమనాలు పునరావృతం కావడం, వరకట్నంకోసం భార్యలను సజీవ దహనాలు చేయడం మరింత భయంకరం.
అందుకే వీరేశలింగం జీవితానుభవాలు నేటి పరిస్థితులలో మరింత ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. ఆ యుగకర్త జ్ఞాపకాలు మరోసారి కర్తవ్యోద్దీపకాలయితే అంతకన్నా కావలసింది ఏముంటుంది!

అయిపోయింది

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన -
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

తెలకపల్లి రవి