వినమరుగైన

నా జీవితయాత్ర(టంగుటూరి ప్రకాశం పంతులు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ పుస్తకం చదివితే మనం దేశ స్వాతంత్య్ర పోరాట వీధుల్లో ప్రయాణం చేసినట్లుంటుంది. ఉప్పు సత్యాగ్రహ సమరంలో పాల్గొన్నట్లుంటుంది. గోబాక్ సైమన్ అని గొంతెత్తి అరచినట్లుంటుంది. కారాగారాల్లో కాశీనాథుని నాగేశ్వరరావుగారితోనూ, బులుసు సాంబమూర్తితోనూ, పట్ట్భాతోనూ, రాజగోపాలాచారితోనూ, అయ్యదేవర కాళేశ్వరరావుతోనూ ప్రకాశంగారు కలిసి చర్చించినట్లుంటుంది. ప్రకాశంగారు ప్రపంచ ఆర్థిక విధానమూ, భారతీయ ఆర్థికవిధానము అనే గ్రంథాలు జైలు ఆరుబయట కూర్చొని రాస్తుంటే ఎదురుగా కూచొని చూసినట్లుంటుంది.
ఈ పేజీల్లో పరీక్ష ఫీజు కట్టడానికి అమ్మ పట్టుచీర తాకట్టు పెట్టిన ఉదంతాన్ని చదివి ద్రవించిపోతాము. ఒంగోలు పోకిరీ పిల్లల సావాసంతో చిన్న దొంగతనాలు చేసి ధైర్యంతో నిజం చెప్పిన బాల ప్రకాశాన్ని చూసి ముచ్చటపడతాం.
రాజమండ్రిలో నాటకాలాడే సందర్భాన రసాభాసలో చిక్కుకున్న నటులను చూసి నవ్వుకుంటాం. కార్యసాధకుడైన శ్రమజీవి ప్లీడర్‌ను చూసి ప్రభావితులవౌతాము. దేశ దాస్యచ్ఛేద దీక్షా నిబద్ధమై మాతృసేవకు, నెత్తురు మడుగులకు సిద్ధమైన ఆంధ్రకేసరులు సయ్యాటలాడిన స్థలాలను ప్రత్యక్షంగా వీక్షించి పరవశులవౌతాము. ఒక్క గుక్కలో చదివించుకుపోయే రచనా శైలిలో ఓలలాడి ఉత్సాహపడతాము. ఉద్వేగ పడతాము. ఉత్తేజం పొందుతాము. ఆంధ్రకేసరి జీవితమనగానే ఆంధ్రులందరికీ జ్ఞప్తిపథంలో తగిలేది తుపాకీకి గుండెలు ఎదురొడ్డే సంఘటన. దాన్ని యిలా వర్ణిస్తారు ప్రకాశంగారు.
శాంతిభద్రతలు కాపాడటం కోసం పోలీసు బందోబస్తు, మిలటరీ సహకారపు ఏర్పాట్లూ ముమ్మరంగా జరిగాయి. సుమారు11 గంటలవేళ నేను కారులో బయలుదేరాను. బీచికి వెళ్ళేసరికి సెనేట్ హౌస్‌వద్ద ఉంచబడిన పోలీసువారు దారిని అడ్డగించారు. వెనక్కి తిరిగి వౌంట్‌రోడ్ దారిని వెళదామని తలిస్తే ఆ రాస్తా కూడా మూసివేశారు. ఎగ్మూరుమీదుగా కలప అడితీలవరకు వెళ్లి, అక్కడినుంచి జార్జిటౌన్ వెళదామని తలచాను. ఫ్లవర్ బజార్ వీధికి వచ్చేసరికి నా కారును ఆపుజేశారు. కారు వదలి కాలినడకన హైకోర్టువరకు బయలుదేరాను.
పారిస్ కార్నర్ దగ్గర మాత్రం రోడ్డుకు మధ్యగా ఒక స్థూలకాయుడు చచ్చిపడిపోయాడు. అప్పుడు గుంపులన్నీ చెదిరిపోయాయి. దారులన్నీ పోలీసు కార్టన్‌తో బందయిపోయాయి. నేను ఒక కార్టన్ దగ్గరకు వెళ్లి, అక్కడ వున్న సిపాయిని ఆ చనిపోయిన వ్యక్తిని చూడటానికి దారి ఇవ్వండని కోరాను. దారి ఇవ్వడానికి వీలులేదన్నాడు.
ఒక సిపాయి నా గుండెకు తుపాకీ బారుచేసి పట్టుకున్నాడు. నాకు దారి ఇవ్వవలసిందని వారిని కోరాను.

ఇంకాఉంది

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

నాగభైరవ కోటేశ్వర రావు