వినమరుగైన

మగువ మాంచాల -ఏటుకూరి వేంకట నరసయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునికాంధ్ర సాహిత్యంలో పేరెన్నిక కెక్కిన వీరరస కావ్యాలు స్వల్ప సంఖ్యలోనే ఉన్నాయి. అందొకటి మగువ మాంచాల. ఏ తత్కర్త ‘కవిబ్రహ్మ’ ఏటుకూరి వేంకట నరసయ్య.
తెలుగు నుడికారం- తెలుగు పలుకుబడులు- తెలుగు జాతీయలను సముచిత సుందరంగా పోషించిన తెలుగు కవులు వ్రేళ్ళపై లెక్కింపదగినవారు ఏటుకూరువారు.
తెలుగు పౌరుష జ్వాలలను దశదిశలా ప్రజ్వలింపజేసిన వీరరస కావ్యమిది. పలనాటి పోతుగడ్డ మీద 11వ శతాబ్దంలో జరిగిన మరో భారతం పల్నాటి వీరచరితం. మహాభారత కథ కిది ముమూర్తులా ప్రతిబింబం.
ఒక కావ్యానికి పేరు పెట్టడంలోనే కవి ప్రతిభ గోచరిస్తుంది. ఈ కావ్యం పేరు మగువ మాంచాల. ‘మగువ’ అంటే స్ర్తి. స్ర్తియైన మాంచాల అని నామకరణం చేయటమేమిటి? మాంచాల పేరు వినగానే స్ర్తి అనే విషయం తెలియదా? అని కొందరు విమర్శకులు నిరసించారు. ‘మగడు’ అనే మహద్వాచకానికి ‘మగువ’ శబ్దం మహతీ వాచకం. ‘మగడు’ అంటే భర్త అనే అర్థమున్నా ‘వీరుడు’ అనేదే ప్రధానార్థం. ‘పోటుమగడు’, ‘దండిమగడు’ వంటి పదబంధాలలో మగడు శబ్దానికి వీరుడనే అర్థం. మగడు కలిగింది మగువ. అంటే మగనాలు. కాని ఈ యర్థంలో కవి ఈ శబ్దాన్ని వాడలేదు. వీర వనిత మాంచాల అనే అర్థంలో ప్రయోగించారు.
భారతంలో మహావీరుడైన అభిమన్యుని కన్నివిధాల ధీటైన వీరుడు బాలచంద్రుడు. అభిమన్యుని భార్య ఉత్తర కేవల గృహిణి. కాని మాంచాల యుద్ధ రంగంలో భర్తతోపాటు పాల్గొని వీరోచిత మరణం పొందిన వీరనారి. మాంచాల సౌందర్య వ్యామోహంతో యుద్ధరంగానికి వెళ్లటానికి విముఖుడైన భర్తను యుద్ధోన్ముఖుని కావించటానికి ఎలా ప్రబోధిస్తోందో చూడండి.
‘‘శీలమవారి వంశమున ఛీ యిటువంటి నికృష్టుడైన రా
చూలి జనించెనే? వెనుకచూపును వెన్నువ తూపు జన్మజ
న్మాల కెఱంగురట్టి పలనాటి మహాత్ముల రక్త్ధారలో
గాలిక ముప్పుతిల్లినది గట్టిది నా మెడ తాళి యింతకున్
చివరి మాట విన్న శీలము సింహంబు
దుమికె బయటి కొక్కదూ కదేమొ!
శీలమవంశం వీరవంశం. శత్రువును వెనుకగా వధించటం సంగర రంగంలో వైరికి వెన్ను చూపటం ఆ వంశానికి తెలియని అంశాలు. అలాంటి వంశంలో నీ వంటి నికృష్టుడైన ఱాచూలి జన్మించాడా! ఛీ రాచూలియంటే రాకుమారుడని ఒక అర్థం. హృదయం లేని రాతిబండ అని మరో అర్థం. నా మాంగల్యం గట్టిది. కదనానికి వెళితే నీవు మరణిస్తే నా తాళి తెగుతుంది. పిరికివాడనై యింట్లో ఉంటే దానికి ఢోకా లేదు. శీలమ వారి రక్తంలో తేలికతనం పుట్టుకొచ్చింది.
ఒక్కొక్క మాట ఒక్కొక్క బల్లెపు పోటు. గుండెలలో గునపాలు దిగినట్లయింది. ఆ మాటతో ఆ శీలమవంశ సింహం రణోన్ముఖంగా ముందుకు దూకింది. భారతంలో పాండవులను సంగరోన్ముఖులను చేసిన ద్రౌపది మాంచాల మాటలలో ప్రతిబింబిస్తుంది. ప్రతిధ్వనిస్తుంది.
పల్లెలలోని ఆచార వ్యవహారాలు - కట్టుబాట్లు- పలుకుబడుల తీరుతెన్నులు బాగా ఒంటపట్టించుకొన్న కవితల్లజుడీయన. పల్లెలో నేటికీ పిల్లలాడుకొంటుంటే చాలామంది స్ర్తి పురుషులు చుట్టూ చేరి చూస్తూ వారిని ఉత్సాహపరుస్తుంటారు. క్రీడాకారులకు ఒళ్లు తెలియని ఉత్సాహం ఉరకలు వేస్తుంది.
బాలచంద్రుడు సంగడికాండ్రతో బొంగరాలాడుతున్నాడు. ‘వేషమాంబ’ తోడికోడండ్రతో నీటికి వచ్చి కుండ రొండి యందుంచుకొని నిలిచి ఆటను చూస్తున్నది. బాలుడు సాచి బొంగరం వేశాడు. అది వేషమాంబ కాలి చీలమండను తాకింది. నెత్తురు చిమ్మింది. చుట్టుగల వారు లబోదిబోమన్నారు. ఆమె ప్రాణం కడబట్టింది. కొంతసేపటికి లబ్దసంజ్ఞయై-
‘‘తల్లియు తండ్రి పెంచినవిధమ్మున తోపదు గాలి బిడ్డవై
యల్లరిసేయ పాల్పడితివా? తల్లిదండ్రులె అచ్చువోసి రుూ
పల్లెకు త్రోలిరేమి? పరభామను. నందొకరింటి కోడలిన్
జెల్లెలి వంటిదాన. నిటు సేయగ నీకెటు చేతులాడెరా?
అంటుంది. ఇందులో అచ్చువోసి పల్లెకు త్రోలు అంటే పల్లెలో ఆబోతుల నచ్చువోసి విడుస్తారు. అవి అద్దూ అయిపూ లేకుండా, ఏ చేలోనైనా పడి మేస్తూ ఉంటాయి. కాని వాటినెవరూ కొట్టరు. అలా అడ్డమాకలేక ఊరిమీద పడి తిరుగుతున్నావని ధ్వనింపచేశారు. ఇదే అల్పాక్షరాలలో అనల్పార్ధ రచన. ‘గాలిబిడ్డవై’ ‘చెల్లెలు వంటిదాన’ ‘అందొకరింటి కోడలిని’ ‘నీకెటు చేతులాడెరా’ వంటి తెలుగు పలుకుబళ్లు పఠితకు రసానంద పారవశ్యాన్ని కల్గిస్తాయి.
పల్లెలలో స్ర్తిలు కలహించుకొంటుంటారు. అప్పుడు వారెలా తిట్టుకొంటారు. ఎంత స్వభావసిద్ధంగా సన్నివేశాన్ని మలిచారో చూడండి. వేషమాంబ బాలుని నిందిస్తున్నది.

-మొవ్వ వృషాద్రిపతి