వినమరుగైన

నేనూ- నా దేశం (దరిశి చెంచయ్య)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత శతాబ్ది సగభాగం దాకా భారతదేశం వలస పాలనలో ఉండిపోయింది. జాతీయ విముక్తి ఉద్యమం దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి సాధించింది. 1850 లగాయతు, ఆంధ్రదేశంలో 1947 దాకా దాదాపు నూరు సంవత్సరాలు ఆంధ్రదేశం పలు వుద్యమాలతో అట్టుడికిపోయింది. సంఘ సంస్కరణతో ప్రారంభించి, జాతీయోద్యమం, వామపక్ష నావాలతో ప్రేరణ చెందిన కార్మిక, కర్షక, స్ర్తి, యువజన, విద్యారిథ, సాంస్కృతికోద్యమాలు ఒకవైపు తెలుగు జాతిని పునరుజ్జీవింపజేస్తూ ఇంకొకవైపు జాతీయ విముక్తి కోసం పోరాడాయి.
ఈ చారిత్రక సన్నివేశంలో దాదాపు యాభై మందికిపైగా తెలుగువారు తమ స్వీయ చరిత్ర రాసుకొన్నారు. ఇవి కేవలం వారి జీవితానికి సంబంధించిన వివరాల పట్టీలు కావు. జీవిత ఘటనలతో, ఉద్యమ వివరాలను రంగరించినుద్యమ చరిత్రలు. 19వ శతాబ్దపు రెండో భాగంలో కందుకూరి వీరేశలింగంచే ఆరంభింపబడిన రుూ సాహిత్య ప్రక్రయ- స్వీ చరిత్ర- ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర రచనకు చక్కని ముడిసరుకు.
ఈ జీవిత చరిత్రలన్నీ ముఖ్యమైనవి కాగా, వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గ వాటిలో దరిశి చెంచయ్య, నేనూ-నాదేశం ఒకటి.ఆయన జననం 1890లో. అప్పటినుండి 1948దాకా, వేరే విధంగా చెప్పుకోవాలంటే, అఖిలభారత జాతీయ కాంగ్రెస్ కాలం నుండి, దేశ స్వాతంత్య్రం దాకా రుూ గ్రంథం ఆంధ్ర దేశ చరిత్రను స్థూలంగా తెలియజేస్తుంది. చెంచయ్యగారి స్వీయ చరిత్ర యింకా అనేక విధాలా మఖ్యమైన గ్రంథంగా పరిగణించాల్సి వుంది. జాతీయ సంస్కరణ, వామపక్ష ఉద్యమాల్లో నాయకత్వాల స్థాయిలో అంటే పై స్థాయిలో వున్నమహనీయులు రాసుకున్న జీవిత చరిత్రల ద్వారానే మనం అప్పటి చరిత్రను గ్రహించగలిగాం. పై స్థాయి కాకుండా, మధ్యమ లేక కింది స్థాయిలో అంటే పై స్థాయిలో- వున్న మహనీయులు రాసుకున్న జీవిత చరిత్రల ద్వారానే మనం అప్పటి చరిత్రను గ్రహించగలిగాం. పై స్థాయి కాకుండా, మధ్యమ లేక కిందిస్థాయిలో వున్న నాయకుల లేదా కార్యకర్తల జీవితాల్ని పఠించి, విమర్శించి, విశే్లషించిన సమయాలు అరుదు. అదేకాదు, ఈ స్థాయికి చెందిన కార్యకర్తల జీవితాల్లో చరిత్ర ఉపశ్రేణికి చెందిన అనేకానేక అంశాలు మన దృష్టికి వస్తాయి. పైగా రుూ స్థాయి నాయకులు, అప్పటి ఘటనలను చూసిన తీరు కూడా భిన్నంగా ఉండవచ్చు.

ఇంకాఉంది

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన -
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

వకుళాభరణం రామకృష్ణ