వినమరుగైన

నేనూ- నా దేశం (దరిశి చెంచయ్య)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక దరిశి చెంచయ్యగారి జీవిత చరిత్ర, అప్పటి మూడు ప్రధాన ఉద్యమాలనూ చర్చిస్తుంది. వాటిపై వెలుగును ప్రసరిస్తుంది. ఇక్కడ చెంచయ్య, ఒక ప్రేక్షకుడుగా ప్రక్కన నిలబడి ఘటనల గూర్చి చెప్పడంలేదు. ఆయన రుూ మూడు ఉద్యమాల్లో క్రియాశీలక పాత్రను నిర్వహించాడు. అందువల్లే, ఈ గ్రంథానికి అంత ప్రాముఖ్యత.
1890 సంవత్సరంలో అప్పటి నెల్లూరు జిల్లా (ప్రస్తుతం ప్రకాశం జిల్లా) కనిగిరిలో, పేద, వైశ్య కులంలో జన్మించాడు దరిశి చెంచయ్య. కనిగిరి ప్రాంతం పూర్తిగా మెట్ట ప్రాంతం. వర్షాధారం తక్కువ. జీవనం దుర్భరంగా వుండేది. మెట్రిక్యులేషన్ దాకా చదివిన చెంచయ్య చిన్ననాడే సంస్కరణలవైపు ఆకర్షింపబడ్డాడు. ముఖ్యంగా తన కులానికి చెందిన ఆత్మన్యూనతాభావాన్ని (ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్) గమనించి ఆందోళనకు గురయ్యాడు. కులాన్ని నిరసించడం అప్పుడే ఆయనలో ప్రారంభమైంది. అప్పట్లో విదేశీవిద్యపైమోజు వుండేది. తనకులానికి చెందినవారి సాయంతో, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కాలిఫోర్నియాలో పైచదువులూ, జీవితానికి ఉపయోగపడే విద్యావృత్తులను నేర్చుకొని రావాలని బయలుదేరి వెళ్ళాడు. ఈ ఘటన ఆయన జీవితంలో పెనుమార్పుకు దారితీసింది. 1912లో బర్కిలీపట్టణంలో అప్పటికే అనేకమంది భారతీయులు, ముఖ్యంగా ఉత్తర భారతానికి చెందిన పంజాబీలు చదువుకొంటూనో, ఉద్యోగాలు చేసుకుంటూనో వున్నారు. వారిలో దేశభక్తి, జాతీయ విముక్తి భావాలు చోటుచేసుకున్నాయి. సాయుధ సైనిక తిరుగుబాటు ద్వారా భారతదేశ విముక్తి సాధించాలన్నది వారు స్థాపించిన గదర్ పార్టీ ఆశయం. లాల్‌హరదయాళ్, జితేంద్రనాధ్ లాహిరీలు గదర్ పార్టీ నాయకులు. ఉత్తేజపూరిత ఉపన్యాసాలు, విప్లవ శిక్షణ భారతీయులు ఇస్తున్నారు. చెంచయ్యగారు ఆ ఉద్యమంలో చేరారు. దేశవిముక్తి తన తక్షణ కర్తవ్యంగా భావించి, చదువు సంధ్యలు వదిలేసి గదర్ పార్టీలో ముఖ్య కార్యకర్తగా ఎదిగారు.
మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులవి. ఇంగ్లండ్ ఇరకాటంలో పడింది. ఆ అవకాశాన్ని వినియోగించుకొని, 1925కల్లా దేశ విముక్తి జరిగి రిపబ్లిక్‌ను ఏర్పర్చాలని గదర్ వీరుల ఆశయం. అమెరికా సంయుక్త రాష్ట్రాలనుండి బయలుదేరిన గదర్ వీరులు, దారిలో చిక్కుకొనిపోయి దూరప్రాచ్యం, తూర్పుఆసియా ప్రాంతాల్లో నిలబడిపోయారు.

ఇంకాఉంది

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన -
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

వకుళాభరణం రామకృష్ణ