వినమరుగైన

నేనూ- నా దేశం (దరిశి చెంచయ్య)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్‌లో భారత సైనికుల తిరుగుబాటు జరిగితే, అందులో చెంచయ్యగారు పాల్గొన్నారు. బందీగా దొరికిపోయి, అక్కడి కారాగారాల్లో పడిన బాధలను గూర్చి గ్రంథంలో రాశారు. అక్కడినుండి తప్పించుకొని భారతదేశం చేరడంతో గదర్ పార్టీ ఘట్టం ముగుస్తుంది. గదర్ తిరుగుబాటు మన స్వాతంత్రోద్యమంలో మరపురాని ఒక త్యాగపూరిత, సాహసోపేత ఘటన. ఎందరో తమ ప్రాణాలను పణంగా పెట్టి, దేశం కోసం అమరులయ్యారు.
జాతీయోద్యమ స్ఫూర్తి నేపథ్యంలో భారతదేశానికొచ్చిన చెంచయ్య జాతీయోద్యమంలో పాల్గొని అనేక జైలుశిక్షలు- లాహోర్, కన్ననూర్, కోయంబత్తూర్ జైళ్లలో ఎనిమిది సంవత్సరాలు గడిపాడు.
జాతీయోద్యమంలో ఒకవైపు కొనసాగుతూనే, రాజకీయ సంస్కరణలు సక్రమంగా ఫలవంతం కావాలంటే సామాజిక మార్పుకు, సంఘ సంస్కరణలకూ కృషిచేయాలనుకొన్నాడు. మతం, కులం, అనేక సంఘ దురాచారాలు- భారతీయ సమాజపు మూల్గులను పీల్చేస్తున్నాయి. వాటి నిర్మూలనకు నడుం కట్టాడు. ఇది ఆయన జీవితంలో సంస్కరణ దశకు దారితీసింది. స్వకుల సంస్కరణతోపాటు, ఆయన కార్యరంగం కళావంతుల సంస్కరణకు విస్తరించింది. వితంతు వివాహాలు, అనాధ శిశు సంరక్షణ శాలలు, పతిత యువతీ జనోద్ధరణ, హరిజనోద్యమం, వయోజనోద్యమాల్లో చరుగ్గా కృషిచేశాడు. నేనూ- నా దేశం గ్రంథంలో సంస్కరణ కృషిని తెలిపే భాగాలు చదువుతున్నపుడు వళ్లు గగుర్పాటు చెందుతుంది. ఈ కృషిలో ఆయనకు చేదోడు వాదోడుగా నిల్చిన యామినీ పూర్ణతిలకం గురించిన విలువైన సమాచారం ఈ గ్రంథంలో చోటుచేసుకుంది. వీరేశలింగం గారు నాటిన విత్తనం యాభై ఏండ్లకు పెద్దవృక్షమై ఆంధ్రదేశంలో అనాధ స్ర్తిలకు ఆశ్రయమిచ్చింది (పుట 346). ఆంధ్రదేశంలో సంఘ సంస్కరణోద్యమం 1920ల తర్వాత కూడా కొనసాగిందనీ, దానికి ఎందరో కృషి చేశారన్న వాస్తవం దరిశి చెంచయ్య గారి గ్రంథం రుజువు చేసింది.
సంస్కరణ దశ నుంచి చెంచయ్య తన చివరి పోరాటదశకు - సామ్యవాద దశ- 1935 నుండి చేరుకొన్నారు. అప్పటికి ఆంధ్రదేశంలో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ కార్యకలాపాలు, కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం రూపుదిద్దుకొంది.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
ఇంకాఉంది

వకుళాభరణం రామకృష్ణ