వినమరుగైన

మగువ మాంచాల -ఏటుకూరి వేంకట నరసయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అజపజదక్కి అల్లాడు నా యేడుపు/ కొట్టి నీ వంశంబు కూలిపోను
సంగడీలందరు చదునుగాను/ అన్యకాంతల నిట్టులలయించు నీకు నీ
యువిదకింతైన కాకుండ బోను/ పొలత్రిరక్తమ్ముకుప్పొంగు నీ కండలు
పదునైన యలుగుల పాలుగాను/ పట్టుమని యగ్గిబుగ్గియై పల్లెనాడు
కలతపడి నాగులేటిలో కలిసిపోను’’ అంటుంది. పల్లెలో వాడుకొనే ఆడవారి తిట్లు నిసర్గ సుందరంగా వాడారు. పద్యాన్ని అంతవరకే తీసికొంటే కవి హృదయమర్థం కాదు. అవి శాపలైనాయి. పలనాటి యుద్ధంలో శీలమవారి వంశం కూలిపోయింది. బాలచంద్రుని స్నేహితులందరు ఆనపోతుతో సహా రణరంగంలో మరణించారు. పర స్ర్తిలను బాధించే నీకు నీ భార్యకు సంబంధం లేకుండా పోవుగాక అంటే- మాంచాలకు బాలచంద్రునకు వైవాహిక బంధమే తప్ప శారీరక సంబంధం లేదు. కాని బాలచంద్రుని శరీరం మాంచాల పొందునకై తహతహలాడుతున్న మాట వాస్తవం. అటువంటి బాలుని దేహం ఆయుధాలపాలైంది.
ఇది భవిష్యార్థ సూచన. ఇది మహాకవులు తప్ప అన్యులు చేయదగింది కాదు. ఇలాంటి పద్యాలు ఆపాతమధురాలేకాక, ఆలోచనామృతాలు.
వేషమాంబ నాయకురాలి సాహస విక్రమాదులను ప్రశంసిస్తూ బ్రహ్మనాయుడాదిగాకల వారిని తిరస్కరిస్తూ
‘‘ఆబిడగాన ప్రాణములకైన తెగించి సవాలొనర్చె నీ
బాబుల మాత్రమామె పరిపాలన సేయ సమర్థురాలు కా
దా? బదులాడవేమి? అసమర్థులనిట్లలయింత్రుగాని, మీ
గూబలు పిండువారి దెసకున్ జననోడెదరేల? బాలుడా!
అన్నది. ఇందులో గూబలు పిండువారి దెసకున్ అని తెలుగు నుడికారానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. అంటే మిమ్ములను జయింపగలవారు, బాధింపగలవారు ఇత్యాదిగా ఎన్నైనా అర్థాలు చెప్పుకోవచ్చు. వారివంక చూడనైనా చూడరనటం చక్కని తెలుగు పలుకుబడి. అంటే వారిని ఎదిరించలేరని ధ్వనింపచేశారు.
‘‘గాలికి వచ్చి నట్టిదదిగాని వృధా ముడి వెట్టుకొన్న మాం
చాలయుగాని సైచినను సైపగవచ్చు’’
అని కూడా అంటుంది. వేశ్యను గూర్చి గాలికివచ్చి నట్టిదనటం- తెలుగు నుడికారం. ఒక నియమం, ఒక నిష్ఠ లేకుండా విచ్చలవిడిగా తిరిగేవాడిని గాలికి తిరిగే వాడంటాం. వృధా ముడివెట్టుకొన్న మాంచాల అనటంలో, కేవలం పెళ్లి మాత్రమే తప్ప తత్ఫలమైన గృహస్థ సుఖం తెలియదనే భావం ధ్వనింపజేశారు.
ఈ చిన్న కావ్యంలో కవి జాతికెన్నో సందేశాలందించారు. హిందూ సమాజం విభిన్న కులాలుగా విభజింపబడింది. ఇందులో తారతమ్యాలున్నాయి. అందుకే వీరిలో వీరికి ఐకమత్యం లోపించింది. పరదాస్యానికి హేతభూతమైంది. బ్రహ్మన్న కుల, మత రహిత సమాజాన్ని ఆకాంక్షించారు. తన పుత్రుడైన బాలచంద్రునితో పాటు ఆరు కులములందు జన్మించిన ఆరుగురు బిడ్డలను సొంత బిడ్డలుగా పెంచుకొంటున్నాడు. వారందరికి సహపంక్తి భోజనాలు పెట్టించాడు. దీనినే చాపకూడు అంటారు.
బాలచంద్రుడు సంగర రంగానికి పోవటానికి మిత్రులతో సిద్ధమైనాడు. ఆ సమయంలో శీలమ్మ బాలచంద్రునితో పాటు అభిమానపుత్రులందరికి కమ్మని పాయసం ఒకే పాత్రలో ఉంచి, వివిధ పదార్థములు మరొక పాత్రలో ఉంచి వారి కందించింది. ఆనపోతు జన్మతః బ్రాహ్మణుడు. అతడు ఆ పదార్థాలనంటుకోలేదు. మిగిలినవారంతా స్వీకరిస్తున్నారు. అది చూచి
‘‘చిరునవ్వి శీలమ్ము చెన్నకేశవు ప్రసా
దమ్మునకంటు దోషమ్ముకల కదె?
పలనాటి దేవుడు బ్రహ్మనాయుడిందు
జక్కొల్పెనే వృధా చాపకూడు?
ఆత్మలేని వారి కాచారములు మెండు
అల్పులకును సంశయములు మెండు
మిము గోసిన పాలటరా?
మముగోసిన నెత్తురటర! మనుబోతూ!!
అని ప్రశ్నిస్తుంది. ఆత్మ ప్రధానంగాని ఆచారాలు కాదు, మానవులంతా ఒక్కటే.

-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-మొవ్వ వృషాద్రిపతి