వినమరుగైన

నా స్మృతి పథంలో ( ఆచంట జానకీరామ్ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్ రివర్స్ చేయడం రాదని చెప్పేందుకు వెనుకకు నడపడం ధీర లక్షణం కాదని సమర్థించడం నవ్వు తెప్పిస్తుంది. జానకిరాం రచనలు నోరి వారు పారేస్తే, మునిమాణిక్యం స్వదస్తూరితో వాటిని కాపీ చేసిపెట్టారట. నా కాశీయాత్ర వ్రాస్తున్న చెళ్లపిళ్ల వెంకటశాస్ర్తీగారి దర్శనం పక్షులను వేటాడే స్నేహితుడిలో లోపమున్నదని తెలిసి- లోపాన్ని సహించగలగడం జానకిరాం ఆత్మకథలో కొన్ని ఉజ్జ్వల ఘట్టాలు. కొంపెల్ల నీవు- మీరు, మధ్యగా న్మీరని-జానకిరాంను సంబోధించేవారట. ఉదయిని పత్రిక కొంపెల్లకే తన రచనలు జానకిరాం సమర్పించారు.
ఆకలి గురించి కృష్ణశాస్ర్తీ వ్రాసిన పంక్తుల్లో- ఆకలి వుంటే చచ్చిపోము. మన దేశంలో ఆకలి లేదు. మనం శిలలం. మన మన్ను, మన మృత్యువు. కనకండ్ల అసత్యప్రచారాలు అసంబద్ధాచారాలు. అసంబద్ధ వైరాగ్యాలు మనకు ఆకలి లేకుండా చేశాయి. మనకు ఆకలి లేదు. లేదని తెలియదు.
ప్రేమ సంబంధాలు మానసిక వ్యభిచారం కాదా. మానసిక పూజకు కట్టుబాట్లేమిటి. మనలోని మృగత్వాన్ని నశింపజేసి దివ్యత్వం ప్రసారించేది. నిజమైన ప్రేమ, ఏమితీద్వయమూ అదృష్టవంతులైన దంపతులకు సాటిరావు.
ఆమె నవనీత హృదయ, నా అంతరంగ
శాంతిదేవత. ఆశా కథాంతరాళ
పారిజాతమ్ము. ప్రేమ జీవన విభాత
కైశికీ గీతి నా తపః కల్పవల్లి
ఆమె జగదీశ మకుటాగ్ర సీమ నుండి
ఉర్విపై జారిన సధా మయూఖ రేఖ
అన్న వేదుల కవితలో
ఆమె కనులలో అనంతాంబరపు
నీలి నీడవు కలవు
అనే కృష్ణశాస్ర్తీ కవితలో
ఆమె భావం జానకిరామ్ జీవితమంతా పరచుకుంది. దశరథుని దేవేరిని జనకుడు నా ప్రియసఖి కౌసల్య అంటే జానకిరాం సంబరపడతాడు. పాపరాజు సీత దుఃఖాన్ని జానకిరాం తట్టుకోలేడు. నాకంటే ఎక్కువ సుఖాన్ని గోపీచంద్, గోపీచంద్ కంటే ఎక్కువ మనశ్శాంతి నేను పొందానని జానకిరాం ప్రకటిస్తాడు.
నా కుటీరంలో ఎటువంటి బొమ్మ అవసరంలేదు. ఆ కిటికీలోంచి కనపడే అవకాశం కంటే గొప్ప చిత్తరువుండదు గదా అని విస్తుపోతాడు. లక్ష కెరటాల మీద తేలిపోతున్న చంద్రబింబంకేసి మాఘ పౌర్ణమి చంద్రబింబం చూసే కళ్లకి జానకిరామ్‌కి తన తల్లే కనబడుతుంది. అమ్మ వడ్డాణాన్ని మెళ్లోవేసుకున్న బాల్యం మళ్లీ మళ్లీ గుర్తుకు వస్తుంది.
భోగరాజు, తెనే్నటి సంభాషణా వైచిత్రం- బాపిరాజు నమూనాతో తయారైన 16కాసుల సింహతలాటం- శ్రీ వేదాంతం లక్ష్మీనారాయణ శాస్ర్తీగారి మణికట్టుకు రాజమన్నారు అలంకరిస్తున్న అపూర్వ దృశ్యం- జానకిరాం ఆత్మకథలో వెలుగు చూసి పరమార్ద్ర నందనోద్యాన విహారంగా మార్చుతాయి.
సత్యానే్వషణ, సౌందర్యానే్వషణ, సౌభాగ్యానే్వషణతో హృదయం ఉండవలసిన చోటు గుచ్చుకుపోయిన బాణాలే ఉన్నాయంటారు జానకిరాం. ఈ వైవిధ్యానికి, వైచిత్రికి ఉమ్రాజియా బేగమ్ మేరే సలామ్ లే పాటే మన్నన.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
అయపోయంది

కొమ్మన రాధాకృష్ణారావు