వినమరుగైన

శారద లేఖలు( కనుపర్తి వరలక్ష్మమ్మ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె ప్రప్రథమ గృహలక్ష్మీ స్వర్ణకంకణ గ్రహీత. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్న ప్రథమాంధ్ర రచయిత్రి- ప్రపంచ తెలుగు మహాసభల్లో తామ్రఫలక పురస్కారం లభించిన విశిష్ట రచయిత్రి. ఎన్నో అవార్డులు, సన్మానాలు అందుకున్న ప్రథమశ్రేణి సాహితీమూర్తి కనుపర్తి వరలక్ష్మమ్మ. పాలపర్తి వారి ఆడబడుచు. కనుపర్తి వారి కోడలు. డాక్టర్ కేసరి గారి గృహలక్ష్మిలో శారద. 1928-1966 మధ్య 38 సంవత్సరాల పాటు ఆంధ్రదేశంలో మహిళలను సౌభాగ్యవతి కల్పలతా అంటూ భావపురి నుండి యావదాంధ్రను, యావద్భారాన్ని లేఖా కాహళ ద్వారా జాగృతం చేసిన విశారద. ఆంధ్ర శారద. నా జీవం ధర్మం, నా మతం నీతి, నా లక్ష్యం సతీశ్రేయం. త్రివేణీ సంగమం అయి విదుషీమణి వరలక్ష్మిగా, శారదగా రూపాంతరం చెంది - లేఖా సాహిత్యాన్ని సంపన్నం చేసింది, అక్షరంగా నిలిపింది. విషయ విస్తృతి అపారం. శైలి జలపాత సదృశం. నిర్భయంగా, త్రికరణశుద్ధితో చెప్పడంలోని విశ్వాసం ఆమెను వేదకాలపు వెలది ముత్తయిదువుగ చేశాయి. అభినవ తిక్కన పలుకుల్లో విషయ చలనంలో సాక్షివ్యాసాల పానుగంటి- సంస్కరణాయుధంగా సాహిత్యాన్ని మలచుకున్న సాహసి కందుకూరి వీరేశలింగం పంతులు- సంయుక్తంగా వరలక్షమ్మగారిలో కనబడతారు.శారదలేఖలు మూడు భాగాలు, రెండు సంపుటాలుగా వెలువడ్డాయి. మొదటి రెండు భాగాలు ఒక సంపుటంగా 34 ఫిబ్రవరిలో వెలువడింది. 1928 మార్చి మొదలు 31 మార్చి మధ్య 20 లేఖలు, 31-34 మధ్య 11 లేఖల మొత్తం 31 లేఖలు ఒక సంపుటంగా వెలువడింది. ‘67లో వరలక్ష్మమ్మగారు ప్రచురించిన సంపుటిలో 49 లేఖలున్నాయి. మొత్తం 80 లేఖలు- 32వ ఏట మొదటి లేఖ, 70వ ఏట 80వ లేఖ. ఈ లేఖల్లో నాలుగు దశాబ్దాల చరిత్ర ఉంది. ‘మునుముందు చారిత్రకముగ, సాంఘికముగ, దేశ వ్యవహారికముగ, మహిళాభ్యుదయ విషయకముగ నప్పటి విషయములను తెలిసికొనుటకు తోడ్పడి ప్రయోజనకరముగ నుండగలదని నా అభిప్రాయం’ అని ఆమె జనవరి 67లో అన్నమాటలు మూడున్నర దశాబ్దాలనంతర అక్షర సత్యాలని గ్రహిస్తాం.
భాషలో, సమాజంలో, కుల మత వ్యవస్థలో, మహిళాభ్యుదయంలో, వివిధ ప్రాతాలలో, వివిధ రంగాల్లో ఏర్పడిన పరిణామాలను అంచనా వేసేందుకు మనం భౌతికంగా 75ఏళ్ళు పయనించినా మానసికంగా, సాంస్కృతికంగా ఏ మేరకు ఏమిటేమిటి సాధించామని బేరీజు వేసుకునేందుకు శారదలేఖలు గొప్ప కొలమానం. శారదా చట్టం మొదలు వరకట్నాలు - వరకట్న నిషేధాలవరకు, గుంటూరు శారదా నికేతనం మొదలు ప్రస్తుత విద్యావిధానం వరకు, మైకుల రణగొణధ్వనుల మొదలు- అందుబాటులో లేని అల్లోపతి వైద్యం వరకు, గురుపీఠాలు, పుష్కరాలు, సంక్రాంతి గొబ్బెమ్మలు మొదలు పర్యటనల వరకు విద్యావంతులైన స్ర్తిలు మొదలు - స్ర్తిలనాటక రంగ ప్రవేశం గౌరవ బిరుదులవరకు అస్పృశ్యత మొదలు కుల సభల వరకు, స్ర్తిల గృహపరిశ్రమల మొదలు, హాస్యరసానికి స్ర్తిలు కేంద్రం కావడం వరకు, లాభాపేక్షతో నగల నమ్మడం మొదలు- మూఢ నమ్మకాల వరకు ఎనె్నన్నో లేఖాముఖంగా ప్రస్తావించారు.గాంధీజీ, పండిట్‌జీ, ప్రకాశం, కొండా వెంకటప్పయ్య పంతులు, దుర్గాబాయ్, ఇందిర మొదలైన ప్రముఖుల వ్యక్తిత్వ విశేషాలున్నాయి. ఎన్నో సామెతలున్నాయి. రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

ఇంకా ఉంది

కొమ్మన రాధాకృష్ణారావు