వినమరుగైన

లోవెలుగులు (ముట్నూరి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిత్యజీవితంలో ఎదురయ్యే సుఖదుఃఖాల్ని ఎదుర్కోవడానికి పాశ్చాత్యులు కఠిన శిలాసదృశ విముఖత (స్టాయిసిజమ్) వహిస్తారు. భారతీయులు విశేషంగా, దుఃఖం వాటిల్లితే కర్మ సిద్ధాంతం వల్లించుకొని సమబెట్టుకొంటారు. ముట్నూరి వారొక లేఖలో ఈ రెండు విధానాలను ఖండించి, ఉన్నతి చేకూర్చే ఇంకో విధానం వివరిస్తారు. ‘‘నీలో రెండంతస్తులున్నాయి. ఒకటి కర్తృత్వం, రెండు సాక్షిత్వం. కర్తగా నీ జీవితాన్ని, నీ ప్రవృత్తుల్ని నడుపుకొంటుంటావు. సాక్షిగా నీ కర్తృత్వంవల్ల కలిగే జయాపజయాల్ని, లాభనష్టాల్ని ఉదాసీనంగా చూస్తుంటావు. కర్తగా నీ జీవితంలో మునిగి ఉంటావు. సాక్షిగా నీ జీవితానికి అతీతంగా ఉంటావు. నీ కర్మకు నీవే అధ్యక్షుడవు. ఈ రెండూ ఏకకాలమందు కుదుర్చుకోగలిగితే నీ జీవితం రసాత్మకంగా ఒక కావ్యంవలె భావ వ్యంజకమవుతుంది’’, ‘‘సాక్షిత్వమంటే - అంతస్సుఖం (ఇన్నర్ ఈజ్), అంతరారామం (ఇన్నర్ రిపోజ్), అంతర్జ్యోతిః (ఇన్నర్ లైట్) విశ్రాంతి- ప్రశాంతి- కాంతి వీనితో కూడిందని వివరిస్తారు.
అస్వతంత్ర జీవనం అసహ్యించుకుంటారు ముట్నూరివారు. తమ స్వాతంత్య్ర సాధనమనే లోవెలుగు లేఖలో, మానవుడు సర్వతంత్ర స్వతంత్రుడుగా మనగల్గాలని ముట్నూరి మహితాశయం. ఆయనట్లాగే జీవించారు. బిపిన్ చంద్రపాల్, గాంధీజీలు ఆహ్వానించినా, వారికనుచరుడు కావాలని ఆకాంక్షించలేదు. బ్రతుకు వట్టి అద్దుడు కాగితమై పోరాదంటారు. బ్రహ్మ సమాజమని, ఆర్య సమాజమని, బాబాలని, పీఠాలని ఎంతో వైవిధ్యంతోకూడిన ధర్మాలున్నాయి. వాటి తత్త్వం గ్రహించు. మంచి నవగతం చేసుకో. నీదైన ప్రవృత్తిలోనికి వాటిని విలీనం చేసుకొని ఆత్మోన్నతి సాధించుకోవాలి కానీ వాటికి దాసాన దాసుడవు కారాదని ఆయన ప్రబోధిస్తారు. ‘మూఢఃపరప్రత్యయనేయ బుద్ధిః’ అన్న కాళిదాసోక్తి శిరోధార్యం ముట్నూరివారికి.
ఏ ధర్మమైనా, ఏ సిద్ధాంతమైనా, పూర్వమే వాటిమీద అనురాగ ద్వేషాలు ఏర్పరచుకోకుండా సమగ్ర దృష్టితో చిత్తశుద్ధితో సమీక్షించాలని ముట్నూరివారి సందేశం. ‘‘వేదాంతులు కల్పించిన శబ్దజాలం నుండి తప్పించుకొని నీ అనుభవాల్ని నీవు సమగ్రం కావించుకొన్నావా, నీకు సామరస్యం సిద్ధిస్తుంది’’ అంటారు. ఉదాసీనత్వమంటే వట్టి స్థాణువుగా ఉండటమనుకొన్నావేమో? కాదు ఉత్+ఆసీనం. ఎటువంటి చిత్తవిక్షేపం పొందకుండా పైనుండి నీ జీవిత సమర రంగాన్ని నీ ఆత్మకాంతి వెలుగులో చూస్తూ ఉండటం, ఎట్టి మహర్దశ అంటావది? అశాంతిలో శాంతి, దౌర్బల్యంలో శక్తి, అజ్ఞానంలో జ్ఞానం, మృత్యువులో అమృతత్వం- నీ ఆత్మ స్వరూపంలో ప్రకాశిస్తుంటే- ఎందుకు నీవు ధీరుడవుగావు?’’ అని ప్రశ్నిస్తారు- ముట్నూరి దార్శనికుడు. లోకసంబంధమైన దుఃఖాలు ప్రాప్తిస్తుంటే, అటువంటి దుఖాత్మక ఘట్టాలున్న సాహిత్యం చదువుకొని రసప్రపంచంలో విహరించి కరుణ రసాత్మక సన్నివేశాలు, కవిభావనలో పుటం పెట్టబడి సాహిత్యంలో ఆనందించమని సముదాత్తంగా సూచిస్తారు ముట్నూరి దేశికులు.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

ఇంకాఉంది