వినమరుగైన

లోవెలుగులు (ముట్నూరి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకంలో బాధాకరంగా అనుభవమయ్యే కరుణ రసాత్మకమై సహృదయుడికి ఆనందజనకవౌతాయి. కావ్యం చేకూర్చే గొప్ప మేలిది.
జీవిత సమగ్రావగాహన సముజ్వల సముదాత్త సమన్వయ స్వరూపులు, ముట్నూరి వారు అందరికీ అటువంటి అవగాహన అలవడాలనే ఆరాటంతో అనేక దృక్పథాలు సమన్వయిస్తూ తమ లేఖల్లో లోవెలుగులు ప్రసరింపజేశారు. ‘‘జీవితం సత్య శివ సుందరముల ఐక్యత, భక్తి జ్ఞాన కర్మలనే త్రివేణీ సంగమం. వీనిలో ఏది కొరవడ్డా జీవితం సమగ్రం కాదు. పైగా సమరస్థితి ఏర్పడని కారణం చేత అది వక్రగతులు త్రొక్కుతుంది. కావలసింది మతాలకు సంబంధించిన శుష్కవాదాలు కావు. అవి మెట్టవేదాంతాల్లోకి ఈడ్చుకొనిపోయి జీవితాన్ని వ్యర్థపరుస్తాయి.
మతకర్తలు తత్త్వనిరూపణ విషయంలో కొన్ని వాదాలు లేవదీసిన మాట నిజం. కాని వారే తమ వాదాలకంటే అనుష్టానికే ఎక్కువ ప్రాముఖ్యమిచ్చారు. పారమార్థిక సత్తాను అసత్యమన్నాడనే కారణాన గౌతమబుద్ధుణ్ణి శూన్యవాది అని అధిక్షేపిస్తారు. బుద్ధుడు నిరీశ్వరవాదే కానీ ఆయన లోకంలో కరుణా సముద్రుడై వెలసి, అహింసా ధర్మ సంస్థాపనాచార్యుడైనాడు. ఎటువంటి దివ్యజ్యోతి?
అట్లాగే శ్రీశంకరుడు మిధ్యావాది అయినా తన జ్ఞానాన్నంతా బ్రహ్మసత్యమనే సిద్ధాంత ప్రతిష్ఠకు ధారపోశారు. బ్రహ్మతత్త్వ ప్రతిపాదనకు భ్యాషత్రయం రచించారు. రసపిపాసువులకు భక్తిరసభరిత అష్టస్తవాలు గానం చేశారు. సాధకుల్ని ముముక్షువులనుగ చేయటానికి సౌందర్యలహరి విరచించి, అందులో యోగ రహస్యాలు నిక్షేపించారు.
‘శంకరుడు జగత్తు మాయమని చెప్పి లోకాన్ని విడనాడలేదు. లోకసంగ్రహార్దం దేశ సంచారంచేసి, తన స్వల్ప జీవితంలోనే అపూర్వ సంఘటనా పటిమ ప్రదర్శించారు’.
ఇదీ, ముట్నూరివారి సమన్వయ పూర్వక సమగ్ర సముదాత్తవైఖరి. ఇది అలవరచుకొన్న వారి జీవితం సమగ్రం, సరసం కావటం తథ్యం. ఎనభై తొమ్మిది లేఖలే గ్రంథరూపంగా వచ్చాయి. ఇంకా ఎన్నో పుస్తక రూపంలో రావలసి వున్నాయి. శ్రీఅరవిందాశ్రమం వారి తెలుగు మాసపత్రిక ‘ఆర్క’లో తరచుగా కొన్ని లేఖలు పునర్ముద్రితాలు. మిగతా ఆధ్యాత్మిక పత్రికల్లో కూడా ఈ లేఖలు పునర్ముద్రితాలు కావాలని నా ఆకాంక్ష. హిందీ, ఆంగ్ల భాషల్లోకి ఇవి అనూదితమైతే ఎంత బాగుంటుందో! లో వెలుగులు బాగా బహిర్గతం కావాలంటే రోజుకో లేఖ మననం చేసుకోవాలి.
ముట్నూరివారి మూర్తిమత్వ మహిమకు నమోవాకాలు.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

అయపోయంది

కీ.శే. బొడ్డుపల్లి పురుషోత్తం