వినమరుగైన

ఆంధ్రుల సాంఘిక చరిత్ర( సురవరం ప్రతాపరెడ్డి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

20వ శతాబ్దపు శతజయంతి సాహతీమూర్తులలో శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారొకరు. వారు తెలంగాణ జనచైతన్యానికి ఎంతో ప్రోదిచేసిన మహనీయులు. దాశరధిగారన్నట్టు శ్రీ రెడ్డిగారు ‘మూగబడిన తెలంగాణ మూల్గిన తొలినాటి ధ్వని’. అంతేకాదు, నిరంకుశ నిజాములను పిరికిపందలు అనే సంపాదకీయంలో విమర్శించగల సాహసి. గోలకొండ పత్రిక, ప్రజావాణి మొదలగు పత్రికలను నడిపి, కత్తిలోని వాదనను కలంలోనే చూపించిన దిట్ట. సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల, ఉర్దూ, పారశీక భాషలలో పండితుడు. పరిషత్తులు, పాఠశాలలు విజయవంతంగా నిర్వహించిన కార్యదక్షుడు. న్యాయవాది, శాసనసభ్యుడు, అన్నింటికంటె మించి తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి నిరంతరం శ్రమించిన కృషీవలుడు. శ్రీ గడియారం రామకృష్ణ శర్మగారన్నట్లు, ఉర్దూ భాష పెత్తనం చేసే మహాంధకార సమయంలో తెలుగుతల్లిని అందలం ఎక్కించి దివిటీలు పట్టడం మామూలు విషయం కాదు. శ్రీ రెడ్డిగారు 1896లో జన్మించి, 1953లో తన 58వ ఏట కన్నుమూసేంతవరకు అనారోగ్యాన్నికూడా లెక్కచేయని కర్మణ్యుడుగానే ఉన్నారు. శ్రీ మల్లంపల్లి సోమశేఖర్ శర్మగారన్నట్లు శ్రీ రెడ్డిగారు విశాలాంధ్రకే మణిపూస’.
సాహితీపరంగా శ్రీ ప్రతాపరెడ్డి ఒక వ్యక్తికాదు సంస్థ. వారి వ్యాసాలు వందల సంఖ్యలో ఉన్నాయి. డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి గారన్నట్లు ‘‘సాహసమూర్తే గాక సాహిత్యమూర్తి’’ కూడా అయిన శ్రీరెడ్డిగారి రచనలు ముద్రితాలు, అముద్రితాలు అన్నీ కలిసి దాదాపు 30 సంపుటాలుగా ఉంటాయి. వచనం, కల్పితం, వ్యాసం, కథలు, నవలలు, నాటకాలు, చరిత్రలు- ఇలా అన్ని రూపాలనూ వారు స్పృశించారు. వ్యాసం, సంకలనం, రేడియో ప్రసంగం, గ్రంథం- ఇలా అన్ని సాధనాలనూ ఉపయోగించుకొన్నారు. సాంఘిక, రాజకీయ, మత, సాంస్కృతిక- ఇలా అన్ని రంగాలనూ సమీక్షించారు.
ఒక్కసారి వారి రచనల పేర్లు వింటే అవి ఎంత వైవిధ్యంతో కూడుకొని ఉన్నాయో తెలుస్తుంది. హిందువుల పండుగలు, రామాయణ విశేషాలు, కర్నూలు రాజులు, నిజాం రాష్ట్ర పాలన, జాగీర్లు, సంఘోద్ధరణ, మద్యపానం, మామిడిపండు, లిపి సంస్కరణ, మొగలారుూ కథలు, ప్రతాపరెడ్డి కథలు, కృష్ణుని మీసాలు, ఆరె వీరులు, భక్తతుకారాం మొదలగునవి అన్నీ ఆయన పరిశోధనాంశాలే.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
ఇంకా ఉంది

కె.వి. కోటిలింగం