వినమరుగైన

ఆంధ్రుల సాంఘిక చరిత్ర( సురవరం ప్రతాపరెడ్డి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్ర్తీగారన్నట్లు ‘‘శ్రీరెడ్డిగారి ఇల్లే ఒక చరిత్ర భాండారాం!’’
ప్రతాపరెడ్డిగారి రచనలన్నీ ఒక ఎత్తు వారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఒక ఎత్తు. అది వారి మాగ్నమ్ ఆపస్ ఆచార్య గోపీ అన్నట్లు ‘‘అసలు సాంఘిక చరిత్ర ఊహే ఆనాటికి కొత్తది, గొప్పది’’. దానికి కావలసిన కావ్య పరిశీలన, పరిశోధన బృహత్కార్యాలు. శ్రీ సురవరం వారే అన్నట్లు ‘‘రాజుల, రాజ్యాల చరిత్ర వ్రాయడం అంత కష్టం కాదు. సాంఘిక చరిత్ర వ్రాయడమే కష్టం. దానికి ఆధారాలు తక్కువ’’. అయినా శ్రీ రెడ్డిగారు తమకు గల బహుభాషా పాండిత్యంతో అలుపెరుగని శ్రమతో, పరిశోధకునికి ఉండే జిజ్ఞాసతో దొరికిన ఆధారాల నన్నింటినీ సంప్రదించారు. అభిమాన, దురభిమానాలకు తావీయలేదు. ననె్నచోడుడి కాలం నుండి వేటూరి ప్రభాకరశాస్ర్తీ, అక్కిరాజు ఉమాకాస్తమ్, చిలుకూరి వీరభద్రరావు గార్ల కాలం వరకు వున్న అనేక గ్రంథాలను విమర్శనాత్మకంగా పరిశీలించారు. కుక్కుటేశ్వర శతకం నుండి గువ్వల చెన్న శతకం దాకా ఒక డజనుపైగా పుస్తకాలను పఠించారు. శబ్ద రత్నాకరం వంటి అనేక నిఘంటువులను సంప్రదించారు. ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్ర వంటి యాత్రా చరిత్రలు పరిశీలించారు.
ఆంధ్రుల సాంఘిక చరిత్ర పుస్తకానికి ఒక చరిత్ర ఉంది. మొదట అది వ్యాసాల రూపంలో ఉండి 1949లో పుస్తక రూపం ధరించింది. 1950 మలి ముద్రణ నాటికి అది 2 పీఠికలు, 2 అనుబంధాలు, 8 ప్రకరణాలు కలిసి, సన్న అచ్చులో 400 పేజీలు పైబడిన ఉద్గ్రంధం అయింది. దానిలో క్రీ.శ.1000 సం. నుండి 1907 సం. దాకా 9 శతాబ్దాల పైబడి ఆంధ్రుల చరిత్ర నిక్షిప్తమై ఉంది. తొలి ప్రకరణాలు రాజవంశాల పేరుతో వున్నాయి. తూర్పు చాళుక్యుడు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు అనేవి మొదటి 5 ప్రకరణాలు. చివరి మూడు ప్రకరణాలు ఆంగ్లేయుల కాలానికి సంబంధించినవి. ఇవి క్రీ.శ. 1600 సం. నుండి 1907లో వందేమాతరం ఉద్యమం గాలులు ఆంధ్ర దేశంపై బలంగా వీచేవరకు వున్న కాలానికి సంబంధించినవి.
ఈ పుస్తక రూపంలో మన పూర్వీకులు గత వేయి సంవత్సరాల కాలంలో ఎట్లా బ్రతికారు,
ఇంకా ఉంది
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన -
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

కె.వి. కోటిలింగం