వినమరుగైన

ఆంధ్రుల చరిత్ర-సంస్కృతి( ఖండవల్లి లక్ష్మీరంజనం..బాలేందు శేఖరం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందొకటి కాకతీయ ప్రభువుల కుల నిర్ణయమును గూర్చి చారిత్రకుడెక్కువగా చికాకు పడవలసిన అవసరము లేదు అని ప్రారంభించి, శాసనస్థ విషయముల నుటకించుచు కొన్ని చోట్ల క్షత్రియులని, సన్నిహిత బంధువుల కారణముగ చతుర్థాన్వయ సంజాతులని తీర్పరచి, కడకు సమకాలిక శాసనములలో కొన్నింటియందు కాకతీయులు క్షత్రియులనియు, మరికొన్నిటి యందు శూద్రులనియు చెప్పబడియున్నది. కావున కాకతీయ ప్రభువులు వీరియందే వర్ణమునకు చెందినవారో నిశ్చయించి చెప్పుట సులభము కాదు అని వ్రాసిరి.‘నాడుల విభాగమున ఆరువేల నాడు శబ్దమును విచారించుచు నియోగులలో మిక్కిలి ప్రాచుర్యం గల ఆరువేల శాఖవారు ఆరువేల నాడునకు చెందినవారు. ఈ యారువేల నాడునకు నామాంతరము వెలనాడాఱు వేల గ్రామముల పరిమితి గలదగుట వలన దీనికాపేరు కలిగినది. దీనికి సంస్కృత నామములు షట్సహ ప్రదేశము. కృష్ణా నదికి దక్షిణ ప్రాంతము ఆరువేల నాడుగా వ్యవహరింపబడుచుండెను అని వ్రాయుట జరిగినది. ఇందు షట్సహ ప్రదేశమనుటకు చిలుకూరి వీరభద్రరావుగారి ఆంధ్రుల చరిత్ర ప్రథమ భాగము 15వ ప్రకరణమును సాక్ష్యముగా చూపుట జరిగినది. దీనివలన షట్సహ ప్రదేశమను సంస్కృత నామము చిలుకూరి వారు కల్పించి యుందురను భ్రమకు, ఆంధ్రుల చరిత్ర చూడని పాఠకులు లోనగు నవకాశము గలదు. అచ్చట శాసన ముదహరించినచాలును. కాని వీరు స్వయముగా ఆ శాసనమున చూడని కారణముగ ఆంధ్రుల చరిత్రను చూచుట కారణముగ అట్లు వ్రాసిరి. అంతేగాక ఆనాడును ఆరువేల నాడుగా ఎవరో గ్రహించిన పొరపాటు పాఠమును అట్లే గ్రహించిరి. శాసనములలో అది ఆరువేల వెలనాడుగా పేర్కొనబడినది. అట్లే ఆరువేల గ్రామపరిమితి గలదగుట దానిని ఆరువేల నాడనుట కూడా వీరి స్వంత వ్యుత్పత్తిగా భావింపనవకాశమిచ్చుచున్నది. నిజమునకు ఆ భావనయే పూర్వపండితుల నావిధముగా అనగా షట్సహ ప్రదేశముగా సంస్కృతీకరించుటకు ప్రేరేపించినది. అయితే మంజర దేశ విషయమున అనంతామాత్యుని భోజ రాజీయమును ప్రస్తావించిన వీరు ఆరువేల నాడనుటకు అతడిచ్చిన వ్యాఖ్యానములను ఏల గ్రహింపలేదో తెలియరాదు.
ఇంకా ఉంది

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన -
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

యార్లగడ్డ బాలగంగాధరరావు