వినమరుగైన

విజయశ్రీ -కరుణశ్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్థసారధిగా పగ్గాలు చేపట్టిన శ్రీకృష్ణుడు భీష్మద్రోణాది కురువీరులను అర్జునుడికి పరిచయం చేయటం రెండవ విభాగమైన స్కంధావారంలో జరుగుతుంది.
గురువులనూ, బంధువులనూ, పుత్రులనూ, మిత్రులనూ, హితులనూ, సన్నిహితులనూ సంహరించలేనని విచార వదనంతో వింటిని విడువబోయే అర్జునుడి వివిధ భావాలు మూడవ విభాగమైన విషాదంలో వెల్లివిరుస్తాయి.
శ్రీకృష్ణుడు తన గీతోపదేశంతో విజయుడి దైన్యాన్ని దూరం చేసి ధైర్యాన్ని చేకూర్చే సన్నివేశమే నాల్గవ విభాగమైన ప్రబోధం.
ఆరాటం తీరిన కిరీటి కౌరవులతో పోరాటానికి సంసిద్ధుడై నవభారత వీర పతాక నెత్తెదన్ అన దేవదత్త శంఖాన్ని పూరించటం చివరి విభాగమైన విజృంభణం.
ప్రతి పద్యం హృద్యంగా, రసహృదయ నైవేద్యంగా రచింపబడిన ఈ కావ్యంలో నాటి భారతంలో నేటి భారతం ఎలా ఇమిడిపోయిందో గమనించండి.
‘‘ఆతడజాతశత్రుడు; మహాత్ముడు; శాంత తపస్వి; విశ్వ వి
ఖ్యాతుడు; ధర్మరాజతని ఆత్మికశక్తికి లేవసాధ్యముల్;
తాతల వంటి వారయిన తప్పదు లోబడిపోదురోయి! ధ
ర్మేతర శక్తులెట్లు తల ఎత్తును ధర్మబలమ్ము సన్నిధిన్?’’
ఇది శ్రీకృష్ణుడి నోట వెలువడిన ధర్మరాజు వర్ణన. పై దృష్టికి ధర్మరాజు కనిపించినా లోదృష్టికి గాంధీజీ కనపడటం ఈ పద్యం ప్రత్యేకత.
కొడుకులకూ, కోడళ్ళకూ, మనవళ్లకూ దూరమై ధృతరాష్ట్రుడి భవనంలో కాలం గడుపుతున్న కుంతీదేవిని కవి ఎలా వర్ణించారో చూడండి.
‘‘విశ్వవిఖ్యాత భారత వీరమాత/ కుంతి పడియుండె కురురాజు కొంపలోన;
అశ్రుధారలు తన లోచనాంచలముల/ యమునలై గంగలై కృష్ణలై స్రవింప!’’ ఇక్కడ గంగ - కృష్ణ - యములుగా మారిన కన్నిటితో కుమిలిపోతున్న కుంతీమాతతోపాటు గంగ-కృష్ణ-యమున నదులతో నిండిన భారతమాత కూడా అప్రయత్నంగా మనకు దర్శనమిస్తుంది.
అలాగే శ్రీకృష్ణుడు పాండవులకు అందించిన మాతృసందేశాన్ని భారత మాతృ సందేశంగా భావించవచ్చు. ఉదాహరణకు-
దేశ కల్యాణ దివ్య సందేశ దీక్ష/ నందుకొని, స్వేచ్ఛ కొరకు విల్లందు కొనుడు
భరత సంతి భావి సౌభాగ్యమునకు/ సానుగావుత స్వాతంత్య్ర సమర రథము/ వీర భారత భూమి నావిర్భవించి/ పౌరుషములేని బానిస బ్రతుకు లేల/ ఈ అయోమయ శృంఖలా లింకనైన/ త్రెంపుకొని బైటపడి విజృంభింపరేల? అన్న పదాల్లో పద పదాన కదనోత్సాహాన్ని, బానిసత్వ ఖండనాన్నీ, భరతజాతి సంక్షేమాన్నీ గమనించవచ్చు. అదేవిధంగా-
‘‘దాస్య దారిద్య్ర గాడాంధ తమస మందు
జ్యోతి వెల్గింపవలె యుగాభ్యుదమునకు’’ అన్న పంక్తుల్లో
‘‘పాంచాలీయుతుల్ పాండవుల్ వందేమాతర మంచు
భక్తిమెయి సంభవాంచి రాత్మ ప్రసూ సందేశమ్ము
వినమ్రశీర్షములతో! సంతోషబాష్పాలతో’’ అన్న పంక్తులో-
‘‘విద్రోహులన్ నిర్మూలించి స్వతంత్య్ర భారత భవానీ వీర సంతానమై
మార్మోగింపుము దిగ్దిగంతముల యుష్మద్దేవ దత్త ధ్వనుల్’’ అన్నప్పుడు
జెండా జాతికి జీవగర్ర; సమతా చిహ్నమ్ము; సర్వస్వ; మీ
జెండావంపు సహింపజాలని శిరశే్ఛదమ్ము’’ అన్నప్పుడు,
గుణముం బిగియించి స్వరాజ్యలక్ష్మికిన్ స్వాగతమిమ్ము గాండివ
శరాసన! చంద్రకులైన భూషణా!’’
అన్నప్పుడు,
విజయలక్ష్మీ శాంతి సంక్రాంతమై యుద్ధాంతమ్మున
వీరభారతము విశ్వోత్కృష్టవౌ’’
అన్నప్పుడు,
‘‘ఇది నీ మాతృ ఋణంబు తీర్చుకొనుమోయి వీరరక్తమ్ముతో’’
అన్నప్పుడు,
భరతవీరా! లేవవోరుూ!
పౌరుషము మేల్కొలుపుమోయి!’’
అన్నప్పుడు,
‘‘ఈ దురభిమాన నితాంత నిరంకుశత్వ సంపత్తికి స్వస్తి చెప్పి నవభారత వీర పతాక నెత్తెదన్’’ అన్నప్పుడు సమకాలిక అస్వతంత్య్ర భారతదేశ పరిస్థితి, భారతీయుల కర్తవ్యం ద్యోతకమవుతాయి.
ఇలా అడుగడుగునా దేశభక్తినీ, జాతీయతనీ రంగరించుకొని స్వేచ్ఛా సుగంధాన్ని పాఠకులలోకి ప్రసరింపజేసే పద్యకావ్య సౌగంధికం విజయశ్రీ. నిద్రాణంగా వున్న మనసులనూ, మనుష్యులనూ చైతన్య సంపూర్ణులను కావించే కమనీయ కావ్య కల్హారం విజయశ్రీ. స్వాతంత్య్రానికీ, పారతంత్రానికీ నడుమ జరిగే సంఘర్షణలో విజయం స్వాతంత్య్రానిదే అని ఉద్ఘాటించి భారతమాతకు విజయ నీరాజనమెత్తే వీర కావ్య పారిజాతం విజయశ్రీ. జీవం తొణికిసలాడే పాత్రలతో వాటి హావభావాలనూ, స్వరూప స్వభావాలనూ కళ్లకు కట్టించే శ్రవ్య కావ్య రూపంలో వున్న అపూర్వ దృశ్యకావ్యం విజయశ్రీ.
*
- శత వసంత సాహితీ మంజీరాలు - విశాలాంధ్ర బుక్‌హవుస్ -
*
-అయిపోయిది
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-జంధ్యాల జయకృష్ణ బాపూజీ