వినమరుగైన

బుడుగు ( ముళ్లపూడి వెంకటరమణ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్కోసారి అమ్మ మినపరొట్ట చేసిన ఆదివారం నాడు నాన్నతో మాట్లాడటానికి కొందరు మీసాల వాళ్లు వస్తారు. ఎంతసేపటికీ లేచి వెళ్లరు. ‘మినపరొట్టి చల్లారిపోతుంది. ఈ మీసాలవాళ్లు ఎప్పుడు పోతారో’ అని వాళ్లకు వినపడేలా విసుక్కున్నాడు బుడుగు. ఆనక నాన్న మొట్టికాయలు వేశాడు. నిజం అయితే మాత్రం అప్పుడు ఎందుకు చెప్పాలి అని.
పిన్నిగారికి పెద్ద జడలేదు. కాని పెద్ద జడ, నిజం జడ అని అబద్ధం చెప్తుంది. పైగా అమ్మ జడ పెద్దది కాదు అని నవ్వింది కూడా. బుడుగుకి కోపం వచ్చింది. అందుకని ‘కొయ్.. కొయ్’ అన్నాడు. ‘నీది నిజం జడ కాదు, సవరం జడే’ అని కూడా అన్నాడు. అప్పుడు పిన్నిగారు ‘నోర్ముయ్’ అంది. అమ్మకూడా కసిరింది.
ఒకసారి నాన్న వాళ్ల ఆఫీసుకి వెళ్లాడు బుడుగు. ఓ గదిలో వున్న మేనేజర్‌ను చూసి ‘ఇక్కడ విగ్గులేని యముడు అని ఓడున్నాడు, ఎవడురావాడు?’ అని అడిగాడు.
‘‘నేనే మేనేజర్‌ని. అందుకని నేనే యముడిని’’ అన్నాడు వాడు.
బుడుగు తలుపు దగ్గరికి వెళ్లి ‘నాన్నా’ అని పిలిచాడు. పిలిచి అడిగాడు. ‘‘నాన్నా! వీడేనా విగ్గులేని యముడు’’ అని. నాన్నా వాళ్లందరూ పరుగెత్తుకొచ్చేసి బుడుగు నోరు మూసేశారు.
అబద్ధాలు చెప్పకూడదు. నిజమే చెప్పాలి అంటారు పెద్దవాళ్లు. తీరా నిజం చెబితే కసురుకుంటారు, మొట్టికాయలు వేస్తారు. ఈ పెద్దవాళ్ల మాటలు గబుక్కున అర్థం కావు. ఎప్పుడూ, ఏదీ సరిగ్గా చెప్పరు అని అనుకుంటాడు బుడుగు.
బుడుగు భాషకి వేరే అర్థాలున్నాయి. బుడుగుకి కోపం వస్తే ‘జాటర్ డమాల్’ అనేస్తాడు. ఈమాటకి అర్థం బుడుగుకే తెలియాలి.
బుడుగు భాషలో ప్రైవేటు చెప్పటం అంటే తిట్టడం అని అర్థం. కొట్టడం అని అర్థం కూడా. మేష్టార్లు ప్రైవేట్ చెప్పేటప్పుడు కొట్టడం, తిట్టడం చేస్తుంటారు. కాబట్టి ప్రైవేట్ అంటే కేవలం తిట్టడం, కొట్టడం అనే అభిప్రాయానికి వచ్చేశాడు బుడుగు.
వంటకి కావాలసినవి అన్నీ చప్పున అందివ్వకపోతే బామ్మ అమ్మకి ప్రైవేట్ చెప్పేస్తుంది. అమ్మ బుడుగుని ఎప్పుడైనా కొడితే నాన్న, అమ్మకు ప్రైవేట్ చెప్పేస్తాడు.
రెండు జెళ్ల సీతలు బాబాయికి ప్రైవేట్ చెప్పేస్తారు.
బుడుగు భాష ప్రత్యేకమైనది. బుడుగులాంటి పిడుగులకే అది సొంతం. అది వ్యాకరణ పరిధికి అందనిది. భాషా భేషజం సోకనిది. మామూలుగా చిన్నపిల్లలు మాట్లాడుకునే అందమైన, సహజమైన, సజీవమైన భాష అది. పిల్లలు ఇలా తారుమారుగా తిరగేసి మాట్లాడటమే ఒక్కోసారి అందంగా, ముద్దుగా ఉంటుంది. భాషలోని తియ్యదనం అంతా ఆ మాటల్లోనే ఉంటుంది.
ఇలాంటి ఏడేళ్ల బుడుగు ఎప్పటికీ అదే వయస్సుతో, అదే భావాలతో, అదే భాషతో మన మనస్సులో ముద్ర వేసుకొని ఉన్నాడు. ఒక్కొక్క పాత్రను సృష్టించిన రచయిత, చదువుతున్న పాఠకులు కాలంతోపాటు వయసుతో ఎదిగి ఉండవచ్చు. కాని ఆ పాత్రపై మాత్రం కాలం యొక్క ప్రభావం ఉండకూడదు. వయస్సులో మార్పు ఉండకూడదు.
కాలానికి అతీతంగా, శాశ్వతంగా ఆ పాత్ర అదే వయస్సుతో ఉండాలి. రమణ బుడుగు పాత్రను సృష్టించి ఇనే్నళ్లయిన తరువాత, కాలంతోపాటు బుడుగు వయస్సు కూడా పెరిగి యువకుడైనట్లుగా రమణ ఇప్పుడు రాస్తే, తెలుగు పాఠకులు అంతగా ఒప్పుకోరేమో! బుడుగు ఎప్పటికీ ఏడేళ్ల చిచ్చరపిడుగుగానే పాఠకుల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయాడు. అదే బుడుగు పాత్రకి, ఆ పాత్రను అద్భుతంగా చిత్రించిన ముళ్లపూడి వెంకటరమణకి, రమణ భావనలో పుట్టిన బుడుగు ఆకారాన్ని అత్యంత ఆకర్షణీయంగా మన కళ్లముందు ఉంచిన బాపుకి సార్థకత.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

అయపోయంది

సి.హెచ్ . సుశీల