వినమరుగైన

త్వమేవాహమ్ -ఆరుద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

- శత వసంత సాహితీ మంజీరాలు - విశాలాంధ్ర బుక్‌హవుస్ -
==============================

ప్రజాకవిత్వానికీ, అభ్యుదయ కవిత్వానికీ తేడా ఉంది అని ఆరుద్ర అభిప్రాయపడ్డారు.
నెర నెరాబండి అనే పాట ప్రజలకి సులువుగా బోధపడుతుంది. కొన్నిచోట్ల ఆనందాన్ని కూడా ఇస్తుంది. ఇది అభ్యుదయ కవిత్వమా? కాదు. ధూర్జటి కాళహస్తీశ్వర శతకం కవిత్వం కాదనగలమా? ఈ పద్యాలు సాధారణ ప్రజలకి వెంటనే అర్థం కాక పోవచ్చు. ఇది ప్రజా కవిత్వం కాకపోవచ్చు. అయినంత మాత్రాన కొట్టిపారెయ్యకూడదు. ప్రజా కవిత్వానికీ, అభ్యుదయ కవిత్వానికీ తేడా ఉంది. ఈ దృష్టితో చూచినపుడు త్వమేవాహమ్ అభ్యుదయ కవిత్వమేని ప్రజాకవిత్వం కాదు. త్వమేవాహమ్‌లో కవి ఉపయోగించిన ప్రతీకలు సామాన్య పాఠకుల జీవితానుభవాలలోవి కావు. ఇసుక గడియారం, నీటి గడియారం, పైథాగొరస్ సిద్ధాంతం మొదలైనవి ఒక స్థాయి పాఠకులకు కొరుకుడు పడేవి కావు. దనండి పెరిషించు లాటి ఇంగ్లీషు తెలుగు పదాల మణిప్రవాళ శైలి శ్రీశ్రీ గారన్నట్లు ప్రమాదంతో కూడుకొన్న ప్రదేశాలు, పాఠకులు ఇక్కడ జాగ్రత్తగా అడుగు వెయ్యాలి.
త్వమేవాహమ్‌లో కవి కావ్యాన్ని ప్రవాహంగా ఊహించారు. పర్వత దశ ఉపనదులు, ప్రవాహ దశలుగా కావ్యరచన సాగించారు.
ప్రవాహం కాలానికి పర్యాయపదం. ‘‘జీవితం తిరనాళ్లలో ఖర్చుపెట్టుకోమని / పెదనాన్న గారు ఇచ్చిన చిల్లర డబ్బులు కాలం / చరాచర జీవకోటి శ్రీమంతులైన బంధువర్గం / మానవుడు మనవడికిచ్చిన వారసత్వం కాలం’’ అని ఆలోచనామృతమైన కవిత నందించారు. ‘‘కాలాన్ని మీకు బానిసను చేస్తాను / కళ్ళల్లో జ్యోతులు వెలిగిస్తాను / భూతల స్వర్గానికి తలుపులు తీస్తాను’’ అని వాగ్దానం చేశారు.
కాలానికి సంకేతం గడియారం. ఇది మన సంఘం. గంటలు శ్రీమంతులు; నిమిషాలు మధ్యతరగతి; సెకన్లు శ్రామిక జనులు; ఇసుక గడియారం, నీటి గడియారం పాతకాలపు సంఘాలు స్టాప్ వాచీ విప్లవాన్ని టైం చేసే సాధనం. ఈ సంకేతాలను కవి విడమరిచి చెప్పేదాకా చాలామంది పాఠకులకు అర్థం కాలేదు.
తెలంగాణ సాయుధ పోరాటం అంతర్యుద్ధ కాలంనాటి స్పెయిన్ దేశం లాంటిది. స్పేనిష్ సివిల్ వార్ యూరోపులోని మేధావులను కదిలించింది. తెలంగాణ భారత కవులను కదిలించింది. ‘‘బ్రెయిన్‌లో బ్రెన్‌గన్ రెయిన్ ఆలోచనల ట్రెయిన్ / స్పయినల్ కార్డులో స్పెయిన్ / గ్లూమీ తిమిరాలు, చెరిపించి / సైతాన్ మనల్ని పరిషించునపుడు / నిర్వేదనా పవనాలు వర్షించు’’ నన్నారు ఆరుద్ర. ఇంగ్లీషు, తెలుగు పదాల కలయికతో ఆరుద్ర వెల్లడించిన ఉద్వేగం కొందరు పాఠకులను గాభరా పెట్టింది.
వర్తమాన కవులంతా ఆధునికులు కారు. ఆరుద్ర భవిష్యత్తుపై దృష్టిగల ఆధునిక కవి. త్రీడి చిత్రం చూడటానికి ప్రత్యేకమైన కళ్లజోళ్లు కావాలి. త్వమేహమ్ అర్థం చేసుకోవడానికి వ్యాఖ్యానపు తోట్పాటు అవసరం.
1953లో శ్రీ దాశరధి త్వమేవాహమ్‌కి చిన్న వ్యాఖ్య రాశారు. దీని సహాయంతో రుూ కావ్యాన్ని ఆస్వాదిస్తే ఉద్వేగోపబుద్ధములైన అభినవ స్వరవాద కల్పనలు కొల్లలుగా కానవస్తాయి.
ఆరుద్ర త్వమేవాహనమ్ కావ్యాన్ని నాటకీయంగా రాశారు. కావ్యంలో మొదట ఎలారం ప్రవేశపెట్టారు. ఎలారం హెచ్చరిక చేస్తుంది. ‘‘లోయలో! లోయలో!! ఓహో!! పటాలం! పటాలం! లోయలో ప్రమాదం! ప్రమాదం’’ అని దుండగీండ్లను కూర్చి ఎలారం హెచ్చరించింది.
పెద్దముల్లు మధ్య తరగతి మనస్తత్వంతో చిన్నచిన్న చీమలకి ‘‘రాజకీయ ఛాందస వైయాకరణిని / ప్రశ్నించకండి / వాడు వృశ్చికం, వాడు రాస్ఖలుడు’’ అని హితబోధ చేసింది- అసలు ‘‘ఈ వ్యాకరణం కన్నా గణితం పనికివస్తుంది. వ్యక్తిగత దరిద్రాలనీ వర్గ కలహాలనీ ఆశారేఖా గణితం రీత్యా /అభ్యుదయ బీజగణితం ద్వారా సాల్వ్ చేద్దాం / ఇంకా పైథాగరస్ థీరం తీరానికి తీసుకెళ్లగలదు’’ అని, వామపక్ష నినాదాలు పచరించి / వామపక్ష విధానాలాచరించి / నిర్మాణక్రమాన్ని చెయ్యండి’’ అని తరుణోపాయాన్ని తెల్పింది. శ్రామిక జననం బతుకు బరువు లాగుతున్నారు. శ్రీమంతులు ఉద్యమాన్ని స్వాధీనం చేసుకొని ప్రయోజనం పొందాలని చూస్తున్నారు.
పెండ్యులం వంటి కవి హృదయం- ‘‘వాటీజ్ టు బి డన్?’’ అని యోచిస్తుంది. సామ్యవాద సమాజపు చిక్కు ప్రశ్నలకు లెనిన్ చూపిన పరిష్కారాలు ‘వాటీజ్ టు బి డన్’ అనే పుస్తకంలో ఉన్నట్లు తెలుసుకుంటుంది. ఆ మార్గమే అనుసరించదగినదిగా సంకల్పం చెప్పుకుంటుంది.
కావ్యంలో రెండవ భాగం ఉపనదులు. చిరంజీవి మానవుడితో మృత్యువు సంభాషణ ఇందులో వస్తువు- కిరణాకొట్లో ధరలు / రెచ్చి తమ్ము తాము హెచ్చవేసుకుంటాయి / చిరంజీవి మానవుడా? ఇది ప్రళయం! నాగేటి చాలులో కార్మిక నాయకుల / పుర్రెలు దొరుకుతాయి / సాఫీ జీవితమీద తెర తెగుంది! చిరంజీవి మానవుడా! ఇది నరకం ఇదీ సమాజపు స్థితి’’
‘‘ఈ సివిలిజేషన్లు డొల్ల
ఇక భవితవ్యము కల్ల’’
అని పాతకాలపు సంఘం నిరాశగా పలికింది.
‘‘నువ్వు ఎక్కదలచుకొన్న రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు
నువ్వు వెళ్లదలచుకొన్న ఊరు
నువ్వు బతికుండగా చేరదా రైలు’’
అని విషాదాన్ని ఘనీభవింపజేసింది.

-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-కడియాల రామమోహనరాయ్