వినమరుగైన

వదరుఁబోతు (పప్పూరు రామాచార్యులు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ విషయము వ్యాసములలో వారుదహరించిన ఉధృత వాక్యములను బట్టి తేటపడుచున్నది. పత్రికా సంపాదకులనుటను బట్టి, సాధన పత్రిక విషయము, సంపాదకీయముల ప్రశంసను బట్టి, వదరుఁబోతు వ్యాసముల ప్రస్తావనను బట్టి ఈ వ్యాసములకు కర్తలుగ ఆప్రస్తావన కర్త ఇద్దరు ముగ్గురని చెప్పినను, ఇవన్నియు శ్రీరామాచార్యుల కృతములేనని స్పష్టపడుచున్నది. వ్యాసములందలి శైలి యంతయు నొక్కటిగా భాసించుట మరియొక కారణము. అంతేగాక ప్రకాశకుల మనవి పేరుతో ప్రత్యక్షమైనది, ప్రస్తావనము కూడ రామాచార్య కృతములేయని నిస్సందేహముగా చెప్పవలనుపడుచున్నది. కల్లు ప్రస్తావన విషయము వలన అది నిషేధమునకు గురియగుట సర్వవిదితము. దానివలన వారు జైలుపాలగుటయు తెలియును. ఈ విషయాన్ని శ్రీ ఎన్.గంగప్పవారు అమ్రేడించుచున్నారు. అంతేకాదు, శ్రీ నీలం సంజీవరెడ్డిగారికి అక్షరభిక్ష గావించిన వారు కూడా శ్రీ రామాచార్యులవారేనని శ్రీ గంగప్ప చెప్పడం జరిగింది. ఇక వదరుఁబోతు మూతపడుటకు కారణములు ఊహించుట చాలా సుకరము, వయోవృద్ధులు, విద్యార్థులు, వృద్ధులు, అధికార వృద్ధులు గూడ నాచరించుచుండిన కొన్ని పద్ధతులను ఆచారములను తప్పులని తోచినప్పుడు విమర్శించి ఖండించుటకై గదా జన్మించినవి ఈ వదరుఁబోతు వ్యాసములు.
వ్యాసభాగములలో నాడు దేశోద్ధారక, బాలసరస్వతి, రాయబహుదూరు, అభినవ తిక్కన, ఆంధ్ర పరాశర, ఆంధ్రగౌతమ, ఆంధ్ర నాటక పితామహ ఇత్యాది బిరుదములను ధరించినవారిని అవహేళనచేసి తీరుగలదు. ఇంక భవిష్యమున ఆంధ్రవ్యాసుడు, అభినవ కుమ్మరి మొల్ల, నవీన ముద్దుపళని, ఆంధ్రబిసెంటు బిరుదములను ధరింపగలవారు గూడ రావచ్చుననిరి.

ఇంకా ఉంది

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన -
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

యార్లగడ్డ బాలగంగాధరరావు