వినమరుగైన

వదరుఁబోతు (పప్పూరు రామాచార్యులు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరియొకడు కామినీజన సౌఖ్యమును కోరుదమనెను. నాల్గవవాడు విద్యాధనమును కోరుదమనెను. ఈ చర్చతోనే నాల్గు దినములు గడిచినవి. దేవుడు ప్రత్యక్షమయ్యెను. తుదకు వారు కోరినది మాకే సుఖమును వలదు. మేము కోరు వరమిదేననిరి. దేవుడు నవ్వి మీకిపుడు సుఖ స్వరూపము బాగుగా తెలిసినది. ఇక మీకు నేనీయదగినది ఏదియు లేదు పొండనెను. లోకోభిన్న రుచిః అను వాక్యమును వ్యంగ్యముగా స్థాపించిన రీతి ఇందు కాననగును.
ఇక గ్రంథ ప్రచురణల విస్తృతిని మరొకచో విమర్శించిరి. పూర్వులు తమ జన్మమునకంతటికి ఒకే కావ్యము రచించియుండగా, నేటివారు పుంఖానుపుంఖాలుగా గ్రంథమును వ్రాయుచుండిరి. కాని పస తక్కువ. కలము, చుట్టల పెట్టి లేక పొడుము డబ్బా, తేనీరు లేక నల్లమందు అను మూడు సాధనములుండిన చాలును నేటివారికి గ్రంథములు వ్రాయుటకనిరి. ఇట్లు పెక్కు విషయములను నిశితముగా విమర్శించిరి. ఇవన్నియు ఎవరికివారు చదివి ఆనందింపదగినవి. అయితే పుస్తకము దొరికిన గదా చదువుట. కావున ఈ పుస్తకము ముద్రణకు రావలసి ఆవశ్యకమెంతేని గలదు. అది జరుగునని ఆశింతము.
నోట్
ఈ సమీక్ష వ్రాసి, ప్రసారమైన మూడు నెలల తరువాత, వదరుఁబోతు శుద్ధ ప్రతి అందినది. దానివలన, సమీక్షకు అందిన ప్రతిలోని పుటలు తారుమారగుట, కొన్ని లేకుండుట, ఆ ప్రతికి మాత్రమే పరిమితమని, అది బైండు చేసినవారి లోపము గానవచ్చునని, ఊహించినది నిజమేనని తేలినది. లోపించిన పుటలవలన తెలిసిన విషయము, పానుగంటివారి సాక్షి వ్యాసములు 1920 నుండి ఆంధ్రపత్రికలో వెలువడినవని, వదరుఁబోతు వ్యాసములు 1917లో జన్మించినవని, ఇవి వెలువడునాటికి సాక్షి వ్యాసముల విషయము వదరుఁబోతు రచించువారికి తెలియదని విశదపరుపబడినది. సాక్షి పదమునకు ఆకరము ‘స్పెక్టేటరు’ కాగా వదరుబోతునకు ‘టాట్లరు’ పదము మూలమని, కాగా, ఈ రెండు పదములు, ఆ రెంటికి ఒకదానికొకటి తారుమారైయుండిన ఉచితముగా నుండి యుండెడిదని ‘ప్రస్తావన’లో సూచింపబడుట గమనార్హము.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

సమాప్తం

యార్లగడ్డ బాలగంగాధరరావు