వినమరుగైన

కొత్త పాళీ ( తాపీ ధర్మారావు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుస్తకం నాల్గవ అధ్యాయంగా సూరి మరణం లేదా బండి రా పల్లకి పేరిట రాసిన చిన్ని ప్రహసనంలో ఆయన భాషా ఛాందసత్వం మృతి చెందడాన్ని హర్షించుతారు. ఆనాడు ప్రబలంగావున్న వాదనలను అపహాస్యంచేస్తారు.
దృతం, శకటరేఫ, అరసున్నా, బండి రా వగైరా ఆచరణలో లేని అక్షరాల అంత్యక్రియలు జరిగిపోయిన వైనాన్ని తమాఃగా చెబుతారు. యొక్క బడు వంటి ప్రయోగాలలో ఇబ్బందిని వెల్లడిస్తారు.
భావంకన్నా భాషకు ప్రాధాన్యతనివ్వడం అర్థరహితమని అంటూ తాపీవారు ఇది దర్జీ వాదన అని అంటారు. అంటే మనిషికన్నా అతను వేసుకునే దుస్తులకు విలువనివ్వడమన్నమాట. ఈ మాట ఇప్పటికీ వంటపట్టనివాని చూసినపుడు ఆయన సునిశిత దృష్టి మనం గుర్తించగలుగుతాం.
భాషా ఛాందసానికి గల సామాజిక పునాదులను కూడా ఆయన విస్మరించలేదు. పై కులాలవారి ఆధిపత్యంవల్లనే అది త్రికి బట్ట కట్టిందని అంటారు.
నన్నయ తర్వాత కాలంలో సమర్థులైన ఎందరో కవులు మంచి తెలుగు రాసినా ఉద్దేశపూర్వకంగా దాన్ని వెనక్కు నెట్టారని వివరించారు. ఆఖరుకు పోతన అంతటి వాడిని కూడా మన డితులు తేలిగ్గా ఆమోదించలేకపోయారు. ప్రౌడభాష లేనికవిత్వం గాటస బీటస అంటూ తేలిక చేశారు. గనుక పాల్కురికి సోమనాధుడు తదితర కవులు కూడా నిర్లక్ష్యానికి గురైనారు. కవయిత్రి మొల్ల ఈ పరిస్థితిపై ఆ కాంలోనే తీవ్రమైన ఆవేదన, అభ్యంతరం వ్యక్తం చేసిన తీరును ఆయన ప్రస్తావించారు. ప్రబంధాలో జీవం లేని తేల్చేశార. అంతేకాక కవి సమయాలు వగైరాల పేరిట సాగిన హాస్యాస్పద తతంగాలను సాధికారికంగా విమర్శించారు. సామాన్యులకు కలిగే సందేహాలకను ఆయన ప్రస్తావించుతారు. కాళిదాసు మాతా అంటూనే కుచోన్నతో అనడం, పోతన చనుకట్టు గురించి రాయడం ప్రస్తావించారు.
ఆఖరుకు కుమారుడి అంత్యక్రియల కోసం వెళిలన 80 ఏళ్ల చంద్రమతిని వర్ణించేటపుడు కూడ తరుణీమణి అని, గజగజేంద్ర సమానగామిని అని వర్ణించిన అనౌచిత్యాన్ని ఆయన తుత్తునియలు చేస్తాడు. అన్నివేళలా స్ర్తిని ఒకే దృష్టితో చూసే దౌర్భాగ్వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని అంటారు.
స్ర్తి గురించి ప్రస్తావించడంలో తాపీవారు ఒక గొప్ప సామాజిక సత్యాన్ని సాహిత్య కోణం నుంచే విశే్లషించారు. తెలగుదేశంలో వున్న స్ర్తిలకన్నా స్ర్తిని వర్ణించే పదాలు ఎక్కువ. ఆమె ఒకో అవయవాన్ని ఆధారంగా చేసుకుని ఒకోమాట కనిపెట్టారని వ్యాఖ్యానించారు.

ఇంకాఉంది
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన -
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

తెలకపల్లి రవి