వినమరుగైన

త్వమేవాహమ్ -ఆరుద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరుద్రగారుపయోగించిన రుూ ఉపమానం ఈ శతాబ్దపు తెలుగు కవిత్వానికి జేగంట.
భవితవ్యము కల్ల అని పాతకాలపు సంఘం పెదవి విరిచినా ‘‘రూపిడి జగత్తు చెరలో / రూపరి జగత్తులో మరలో నలిగి నలిగి / నాశనమయిపోతాం’’ అని భయపడతారు శ్రీమంతులు. ‘‘ఏంగేఝుయిటీ గుప్పిటినుంచి / విషాదం బారి నుండి / వినాశం దారి నుండి / మము బ్రోచేవారెవరూ లేరా’’ అని మధ్య తరగతివారు ఆర్తితో పల్లవిస్తారు. ‘‘మా జీవితాలకల్ల / సారెగది లోనిదే రొమాన్సు / పెద్దదొర ముందు మాట్లాడటమే ఎడ్వెంచరు / ఇంక్రిమెంటే మోక్షం’’ అనే మాటలలో ఆరుద్ర మధ్య తరగతి స్వభావాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. వీళ్లని గుచ్చి కాల్చుకొని తిన్నది, తింటూన్నది, తింటుంది నేటి సమాజం అంటారు ఆరుద్ర.
కావ్యంలో మూడవదశ ప్రవాహదశ. ప్రవాహం విప్లవసేవ ప్రయాణ ప్రతీక. ఇందులో శ్రామిక జనులు రాకాసిరాజు నిజాంను గూర్చి బుర్రకథ రీతిలో గోడు వెళ్లబోసుకుంటారు. ‘‘్భళానోయి భాయి తమ్ముడూ! దేవ భళానోయి దాదానా! వాడి పేరు దగాకోరురా! వాడి వజీరు పుండాకోరురా! రాజ్యంలోని జీవులా సై/కుక్కల నక్కల చేసెరా సై/ ఎదురు చెప్పినా వారలా సై / కోటగుమ్మానికి కట్టెరా సై/ .. పంటలనన్నీ దోచెరా సై / బంగారమెంతో దాచెరా సరై/ రక్కసి మూకల ఊళ్లపై సై / విచ్చలవిడిగా వదిలెరా సై’’నిజాం నవాబు దుర్మార్గాలనూ రుూ భాగంలో ఆరుద్ర సుబోధకంగా తెలిపారు.
శ్రీమంతులు తాడును చూపి పామని చెప్పి బెదిరిస్తారు. పారిపొమ్మంటారు.
పోలీస్ యాక్షన్ తర్వాత కూడా రైతు కూలీల దుస్థితి మారలేదు. పరిపాలనను చేపట్టిన సైన్యం ప్రజలకు మేలు చెయ్యలేదు. సైన్యం అండదండలతో భూస్వాముల రైతుల్ని మళ్లీ వేధించసాగారు.
‘‘ఈ కొడిగట్టిన గుడ్డిదీపం చూసి / అమరజ్యోతి అనుకున్నాం / అల్లాఉద్దీన్ స్వర్గాలటుంచి / అంగుళం మేరయినా వెల్గదు /ఇకమీదట పోలింగ్ స్టేషను రాజ్యాంగానికి చూపుడువేలు కానే కాదు’’ అని అప్పటి దుస్థితిని ఆరుద్ర కళ్లకు కట్టించారు.
హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ ఇంగ్లీషులో రాసిన (టేల్స్ ఆఫ్ తెలంగాణ)ను ఆరుద్ర వీర తెలంగాణ పేరుతో తెనిగించారు. త్వమేవాహమ్‌లో నాలుగవ భాగం సాగరసంగమంగా రుూ వీర తెలంగాణాను తర్వాత కాలంలో చేర్చారు.
త్వమేవాహమ్‌కి అనుబంధమైన వేదనాశకలం కూడా నాటకీయమైన రచనే. ‘‘అయ్యో! ఇలా మండుతోందేం ప్రపంచం! విషాదాంతమేనా సమస్తం. ప్రజానీకమంతా సుఖించే దినం విచ్చునో విచ్చదో’’ అని జనత సందేహిస్తుంది.
‘‘ప్రజాబలము పొందు సౌఖ్యములపైరు ఎల్లప్పుడూ / ప్రజాబలము గెల్చు సంఘటిత రమ్య దేశమ్ములో’’ అని అఖండ జ్యోతి ఆశీర్వదిస్తుంది.
‘‘్భమిపయి దేవతల భూమి విహరించవలె / లేమి గలవారలకు కామితము పంచన్ / ఆమని సదా అవని భామని వరించవలె’’నని భరతవాక్యం.
‘‘బూర్జువా వర్గం మారిన తర్వాత పెట్టుబడిదారీ సమాజం ప్రగతిశీలమవుతుంది’’ అని ఆరుద్ర తథాస్తు అనే చివరి భాగంలో తెలిపారు.
తెలంగాణ నుండి భావి ఉద్యమాలు తలెత్తుతాయని ఆరుద్ర క్రాంత దర్శియై పలికారు. ఆయన వాక్కు యదార్థమైంది. ఉత్తర తెలంగాణలో ఆనాటి సాయుధ పోరాట స్ఫూర్తి యింకా చైతన్యవంతంగా ఉన్నది. భూమికోసం భుక్తికోసం రైతు కూలీ పోరాటాలు జరుగుతున్నాయి.
శ్రీశ్రీ గారన్నట్లు ఆరుద్ర తన ఛందస్సుల చేత అందంగా చాకిరీ చేయించుకోగలరు.
సినీవాలి, గాయాలూ గేయాలూ, కూనలమ్మ పదాలు, పైలాపచ్చీసూ, ఇంటింటి పజ్యాలు మొదలైన కావ్యాలెన్నో రాసినా ఆరుద్రగారి ప్రతిభా పాటవాలు త్వమేవాహమ్‌లోనే పరిపూర్ణంగా వికసించాయి.
ఇరవయ్యవ శతాబ్ది తెలుగు కావ్యాలలో ప్రథమశ్రేణిలో చేర్చదగిన రసవత్కావ్యం త్వమేవాహమ్.

-అయిపోయిది
(ఆకాశవాణి సౌజన్యంతో...)

- శత వసంత సాహితీ మంజీరాలు - విశాలాంధ్ర బుక్‌హవుస్ -

-కడియాల రామమోహనరాయ్