వినమరుగైన

ఈ జీవితం... ఓ నాటకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్ళిపెద్దలం
*
-షణ్ముఖశ్రీ-
*
క్లేశవరావు: మనకు కూడా దూరపు బంధుత్వం ఉందని ఆ అమ్మాయి తాలూకూ వాళ్ల ద్వారా నాకు తెలిసింది. మీ విషయం చెప్పగానే వాళ్లీవిషయాలన్నీ బయటపెట్టారు.
సంతోషరావు: (తనలో) వామ్మో వీడితో దూరపు బంధుత్వం కూడా ఉందిట. ఎలాగోలా వీడితోటి ఆ బంధాన్ని వదిలించుకోవాలి.
క్లేశవరావు: ఏదో ఆలోచనలో ఉన్నట్లున్నారు.
సంతోషరావు: అబ్బే ఏం లేదండి. మీరు మా విషయంలో శ్రమ తీసుకున్నందుకు చాలా సంతోషం. మా వాడికి ఇంకా ఒకటి రెండు సంబంధాలు కూడా ఇంతకు ముందే వచ్చి ఉన్నాయి. వాటి విషయం కూడా ఆలోచించుకుని మీకు ఫోను చేస్తాను. అందాక మీరు మా ఇంటి ఛాయలకు కూడా రావాల్సిన పనిలేదు.
క్లేశవరావు: బలవంతం ఏం లేదండీ. మీకెలా తోస్తే అలాగే చెయ్యొచ్చు. వస్తానండీ.
సంతోషరావు: హమ్మయ్య వెళ్లాడు. నేనిక ఇంటికెళ్తాను.
సంతోషరావిల్లు , హాల్లో పచార్లు చేసూత నతలో తాను మాట్లాడుకుంటుంటాడు. సమయం మధ్యాహ్నం 12 గంటలు
సంతోషరావు: ( తనలో) ఇంతకూ ఆ క్లేశవరావు చెప్పిన సంబంధం సంగతి ఏం చాయాలో పాలుపోవడం లేదు.
సంతానలక్ష్మి; (ప్రవేశిస్తూ) ఇంతకూ ఆ సంబంధం సంగతి ఏం చేద్దామనుకుంటున్నారు. నాకారోజు ఏదో మూడు ముక్కల్లో చెప్పి ఊరుకున్నారు.
సంతోషరావు: నేనూ అదే ఆలోచిస్తున్నాను. మన్నీ మన సంపదనూ చూసి ఏ సంబంధమూ రావడంలేదు. ఏమిటో నాకంతా ఆగమ్యగోచరంగా ఉంది.
బయట నుంచి కేక : కొరియర్ సార్
సంతోషరావు: ఆ ఇలా ఇవ్వు
సంతానలక్ష్మి: ఎక్కణ్ణుంచో త్వరగా విప్పి చూడండి.
సంతోషరావు: అరే అబ్బాయినుంచే ఆశ్చర్యంగా ఉందే. మన అబ్బాయి కూడా ఈకాలం అబ్బాయిల్లా మారిపోయాడే వీడు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాట్ట. మ నకెలా చెప్పాలో తెలీక సతమమవుతున్నాట్ట. మ నం ఒప్పుకుంటామో లేదో! ఇంట్లోకి రానిస్తామో లేదో అని తెగ భయపడుతున్నాట్ట. ఇవిగో పెళ్లి ఫోటోలు కూడా పంపాడు.
సంతానలక్ష్మి: ఆ ! ఇంతకూ ఆ పిల్ల గోత్రనామాలేమిటో! ఈ పెల్లి పెద్దలివరో!
క్లేశవరావు: (ప్రవేశిస్తూ) ఆ పెళ్లి పెద్దలం మ ఏమే
సంతోషరావు: ఆ! ముందే ఆ విషయం చెప్పొచ్చుకదా!
మోహనరావు: ఏం చేప్తాం. ! మీరసలే సతమతం వారు. ఆ పిల్లవాళ్లేమో రెటమతంవారు. మీ ఇద్దర్నీ కలపాలంటే ఏదో కొంత నాటక మాడక తప్పలేదు. ఈ క్లేశవరావు ద్వారానే ఆ పెళ్లి జరిగింది.
క్లేశవరావు: అవును. మేమే ఆపెళ్లి పెద్దలం. ఈనాడు కోకొల్లలుగా ప్రేమ పెళ్లిళ్లు. ఆ వెంటనే తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యలు ఎక్కువయిపోయాయి. అందువలన తల్లి దండ్రుల మనసులను కూడా అయిసు గడ్డల్లా కరిగించి, ఆ సొగసు బిడ్డల జీవితాలను జిలేబీ చుట్టల్లా చేయడానికి మీ బంధుమిత్రుల్లా మీకు, మీ కుటుంబానికి మంచి చేసే ప్రయత్నం చేశాం. మా తప్పేమైనా ఉంటే క్షమించండం. ఆ ప్రేమ దంపతుల్ని అప్యాయంగా ఆహ్వానించి ఆశీర్వదించండి.
సంతోషరావు: బంధుమిత్రులంటే మీలా ఉండాలి. అందర్నీ కలిసేటట్లు ఉండాలి. మా కొడుకూ కోడలు రాగానే మేమిద్దరం కూడా వాళ్లతో మాటు ఉండి మా శేషజీవితాల్ని ఆనందంగా గడుపుతాం.
మోహనరావు: సరే మేం వెళ్లొస్తాం.
సంతోషరావు: మీ ఇద్దరూ భోంచేసి వెళ్లండి.
సంతానలక్ష్మి: వంట నేనే చేస్తాను. వంట మనిషి చేత చేయించను. వెళ్లకండి!
సంతోషరావు: అవును. ఉండండి.
క్లేశవరావు: అలాగే! ఎంతయినా పెళ్లి పెద్దలం కదా.
అందరూ నవ్వుకుంటారు.
*
(ఇంకాఉంది)
*
హైదరాబాద్ ఆకాశవాణిలో ప్రసారమైన నాటికలు- ఈ జీవితం ఓ నాటకం- రచన:షణ్ముఖశ్రీ. శ్రీ షణ్ముఖ పబ్లికేషన్స్, హైదరాబాద్.