వినమరుగైన

పెనే్నటి పాట -విద్వాన్ విశ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం జిల్లాలో ప్రవహించే నదుల్లో ముఖ్యమైంది పెన్నా నది. ఇది కర్ణాటకలోని నందిదుర్గ దగ్గర చెన్నకేశవ కొండల్లో పుట్టి కర్ణాటకలో 43 కి.మీ ప్రవహించి అనంతపురం జిల్లా హిందూపురం తాలూకాలో ప్రవేశించి హిందూపురం, పెనుగొండ, ధర్మవరం, కళ్యాణదుర్గంల మీదుగా గుత్తి, అనంతపురం సరిహద్దుల గుండా ప్రవహించి తాడిపత్రి వద్ద కడప జిల్లాలోకి ప్రవేశిస్తున్నది. చిత్రావది, జయమంగళం, కుందేరు, సగిలేరు, పాపాగ్ని, బొగ్గేరు ఈ నదికి ముఖ్యమైన ఉపనదులు.
పెన్నా నది నీటి పరివాహక ప్రాంతం 21,317 చ.మైళ్లు. ఇందులో 2,678 చ.మైళ్లు కర్ణాటకలో ఉంది. దీని పరివాహక ప్రాంతం ఎక్కువగా కర్ణాటకలో ఉండటం మూలాన వారు దీని మీద విచక్షణారహితంగా అనేక చెరువులు, పూటాకాల్వలు, చెక్‌డ్యాములు, డ్యాములు నిర్మించటంవల్ల అనంతపురం జిల్లాకు నీరందే అవకాశం లేకుండా పోతున్నది.
ఈ పెన్నానది పరీవాహక ప్రాంతంలోని జన జీవితాన్ని కరుణరసార్ద్ర హృదయంతో రచించిన కన్నీటి పాటే విద్వాన్ విశ్వంగారి పెనే్నటి పాట. రాయలసీమలోని పెనే్నటిగట్టున ఉన్న పల్లె జనం బతుకుల నీడ ఇందులో ఉంది. వారి జన జీవనం, పేర్లూ, పలుకుబడులూ ఇందులో ఉన్నాయి. రాయలసీమ జన జీవితాన్ని ప్రతిబింబించిన తొలికావ్యం ఇది. దీన్ని 1956లో తెలంగాణ రచయిత సంఘం వారు ప్రచురించటం విశేషం. శ్రీమాన్ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారు పీఠిక రాశారు.
అదే పెన్న! అదే పెన్న
నిదానించి నడు
విదారించునెగనే, వట్టి
ఎడారి తమ్ముడు!
పేరుకు మాత్రమే పెన్న రాయలసీమలో ఉంది. అనుభవం మాత్రం కర్ణాటక, నెల్లూరు జిల్లా వారిది. పెన్నలో నీరు పెరుమాళ్లకెరుక అనే సామెత ఇక్కడే పుట్టింది. ఎప్పుడో వచ్చే నీరు ఇక్కడి ప్రాంతాలకు అందదు. క్రిందికి ఒక్క పూపున పోయి అట్టడుగు ప్రాంతంవారికి అందుతుంది. అందుకే ఇది ఎడారి.
ఇసుక పాతర లోతులకేగు దనుక నీకు కన్పించదీ మేటి నీటిచుక్క
పెన్న ఈనాడు వల్లకాడు, పీనుగులకు నిలయం. పెన్న నది గట్టుల్లో పుర్రెలు తప్పిస్తే మరేమీ లేవు. పెన్నలో నీరు లేక రేగుచెట్లు, పల్లేరుకాయలు, నక్కలకు నిలయమయింది. నమ్ముకున్న రైతుల నెత్తుటి ఛాయలే ఇక్కడ నీటిబొట్లుగా మారినాయి.
సీమ కరువును కళ్ళారా చూచి, అనుభవించి హృదయం ద్రవించి, బాధాదగ్ధమయిన కంఠంతో విద్యాన్ విశ్వంగారు పలికించిన కావ్యం పెనే్నటిపాట.
ఇంత మంచి పెన్నతల్లి/ ఎందుకెండిపోయెనో
ఇంత మంది కన్నతల్లి
ఎందుకిట్లా మారిపోయెనో?
అని బాధా దగ్ధమయి వేదనాభరిత హృదయంతో ప్రశ్నిస్తున్నారు. పెన్నలో నీరే వుంటేనే అన్నది వారి బతుకులు ఎంత సుఖమయమయి వుండేవో గదాయని ధ్వనిస్తున్నారు.
పెన్న ఆంగ్లేయుల దొరతనంలో ఎన్ని విధాల ఎండవచ్చునో అన్ని విధాల ఎండింది. పెన్నను నమ్ముకున్న జనం జీవితాల్లో కన్నీళ్లే కురిసినాయి.
ఈ సీమ దరిద్రావస్థ, దైన్యం విశ్వంగారిలో కలిగించిన తీవ్ర నిర్వేదమే పెనే్నటిపాట. అనుభవమే మూలాధారంగా వెలువడిన పరవశ రచన ఈ పాట. రైతుల ఆశ నిరాశలను ఈమె పలుకుబళ్లతో అభివర్ణిస్తుంది. కాపు దంపతులయిన రంగడు, గంగమ్మల పరస్పరానురాగం, నిష్కల్మష ప్రవర్తన, నిప్పచ్చరము, కరుణ మహితంగా చిత్రించిన కమనీయ రచన పెనే్నటి పాట. పద్య గేయ సమాహారంగా వెలువడిన తొలి సమగ్ర కావ్యం ఇది.
శ్రీకృష్ణదేవరాయలు రాజధానిలో ఉన్నంతకాలం కవులతోనే కాలక్షేపం. భువన విజయం అష్టదిగ్గజాలతో ప్రకాశిస్తూ ఉండేది. ఆ రోజుల్లో కళలు, సాహిత్యం బాగా విరాజిల్లినాయి.
ఆ వైభవానే్న విశ్వంగారు
‘‘కలియ పాలకల మాలల మేలి పాటల
.. రాయలసీమ పచ్చల బజారు’’ అంటూ గుర్తుచేస్తున్నారు.

-సశేషం

--్భమన్