వినమరుగైన

శివతాండవము -పుట్టపర్తి నారాయణాచార్యులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి నారాయణాచార్యులు బహుమఖ ప్రజ్ఞావంతుడు. మహాపండితుడు, మహాకవి, విమర్శకుడు, చరిత్రకారుడు, వాగ్గేయకారుడు, అనువాదకుడు. అతని పాండిత్యానికి ఆకాశమే హద్దు. ‘పాండితీశోభ పదునాల్గు భాషలందు’’ అని తన్ను గురించి తానే చెప్పుకున్నాడు. సాక్షాత్కరము వంటి కావ్యాలు అతని భావలాలిత్యాన్ని చాటితే, శ్రీనివాస ప్రబంధము వంటి కావ్యాలు అతని పాండిత్య గరిమకు అద్దంపడతాయి. కానీ అన్ని కావ్యాలలోనూ అంతర్వాహిని భక్తితత్త్వమే. మోక్ష సాధన సానుగ్య్రాం భక్తిరేవగరీయసి అన్న వాక్యంలో పుట్టపర్తికి అచంచలమైన విశ్వాసం. తెలుగులో సాహిత్య విమర్శను సుసంపన్నం చేసిన వారిలో అతడు మొదటివరుసకు చెందినవాడు. ప్రబంధ నాయికలు వంటి సాహిత్య పాత్రల విశే్లషణతో ప్రారంభమైన అతని సాహిత్య విమర్శ వ్యాసుణ్ణి, వాల్మీకిని, భవభూతినీ, తిక్కననూ, పోతననూ, అన్నమయ్యనూ, కృష్ణరాయలనూ, రామకృష్ణుణ్ణీ పరామర్శిస్తూ భాగవత విశే్లషణలో శిఖరాగ్రాలను చేరుకుంది. భాగవత సుధాలహరి సంపుటాలు పుట్టపర్తి పాండిత్యానికీ, విశే్లషణాశక్తికి నిదర్శనంగా కలకాలం నిలుస్తాయి. అతడు సంగీత శాస్త్రం తెలిసిన వాగ్గేయకారుడు. అష్టాక్షరి అన్న ముద్రతో వేలాదిగా కీర్తనలు రాశాడు. అతని అభిమాన విషయం చరిత్ర. అతని విజయనగర సామాజిక చరిత్ర కొందరు మహావీరుల, మహారాజుల జీవిత చరిత్రే చరిత్ర కాదని నిరూపించిన అరుదైన గ్రంథం. అతడు సంస్కృత, ప్రాకృత, హిందీ తమిళ, కన్నడ, మలయాళ భాషల నుంచీ తెలుగులోకి ఎన్నో అనువాదాలు చేశాడు. విశ్వనాథ ఏకవీరను మలయాళంలోకి అనువదించారు. కానీ అతని శతాధిక గ్రంథాల్లో పుట్టపర్తి పేరు చెబితే జ్ఞాపకం వచ్చే గ్రంథం శివతాండవం. ఈ కావ్యాన్ని పుట్టవర్తి 1947లో రాసి అదే సంవత్సరం భారతిలో ధారావాహికంగా ప్రచురించాడు.
పుట్టపర్తి నారాయణాచార్యులు కృష్ణదేవరాయల ఆధ్యాత్మిక గురువు తిరుమల తాతాచార్యుల వంశంలో పుట్టిన పరమ వైష్ణవుడు.

-సశేషం
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-వల్లంపాటి వెంకటసుబ్బయ్య