వినమరుగైన

శివతాండవము -పుట్టపర్తి నారాయణాచార్యులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివతాండవం వర్ణనా సామర్థ్యంలోనూ, వైవిధ్యంలోనూ 20 శతాబ్దంలో అరుదైన కావ్యం. ఉదాహరణకు శివుని కాలిగజ్జలు మోగటాన్ని పుట్టపర్తి ఎంత హృదయంగమంగా వర్ణించాడో చూద్దాం. తరగలను చిరుగాలి పొరలు లేపినయట్లూ, చిగురుటాకుల గాలి వగలు పోయినయట్లూ, నగవులోలే వలపు బిగువు జారినయట్లూ, మొగలి పూవుల బావి పుక్కిలించినట్లూ, నగవులలే వలపు బిగువు జూరియట్లూ, మొగలి పూవుల తాలి పుక్కిలించినయట్లూ, శివుని చెంత శర్వాణి సిగ్గు జారినయట్లూ, కనె్న మది కోరికలు కలల దూకిన యట్లూ, మనసులోని సంతసము కనులలోకి జారినట్లూ, తొలుకారు మెరపులు దోబూచులాడిన యట్లూ, తొలి సంజలో తెల్వి దూకి వచ్చిన యట్లూ, మలి సంజలో కాంతి మరలిపోయిన యట్లూ, కులుకు నీలపు కండ్లు తళుకు చూపులు పూయగా, ఘల్లు ఘల్లుమని కాళ్ల చిలిపి గజ్జెలు మోయగా శివుడు నాట్యం చేశాడు.
సంగీత, నాట్య సంకేతాలను ఇంత సహజంగా, ప్రతిభావంతంగా ఉపయోగించుకున్న కావ్యం తెలుగులో మరొకటి లేదు. అలా శివుడు స్వర కన్యకల గుబ్బ చనుల పుల్కలను రేపి, లయ పురుషునానంద రాశిలో ముంచి సురకాంతల మనస్కుల్ని ఉయ్యాలలూగించి తన తాండవాన్ని కొనసాగిస్తాడు. దాన్ని చూచి తంబూర ఆనంద తరళ సంపుల్ల కంఠస్వరం తనకు తానుగా గళం విప్పి పాడుతుంది.
తాండవ వర్ణన పూర్తయిన తరువాత శివకేశవాద్వైతాన్నీ తాత్వికాద్వైతాన్నీ అనితర సాధ్యంగా ప్రతిపాదించాడు పుట్టపర్తి.
శోకమ్ము సంతోష మేకము, నరకంబు/ నాకంబనేకం బనంత మా కాశమ్ము/ పరిగతంబగు భూమి, నవ నిధులు పల్వములు/ తరులు బీజములు, క్రొవ్విరులు కసి మొగ్గలును / రఠాంధకారమ్ము పరిణామి చంద్రికలు/ పరమృషుల జ్ఞాన భరితులందరును నే/ డ ద్వైత మద్వైతమని మాటి/ కద్వయంబున నొత్తి యఖిలలోకము లార్వ! ఆడెనమ్మా శివుడు.
సుఖ దుఃఖాలూ, స్వర్గ నరకాలూ, భూమ్యాకాశాలూ, చెట్లూ, విత్తనాలూ, పువ్వులూ మొగ్గలూ, అజ్ఞానులూ, విజ్ఞానులూ వేరువేరు కారని అఖిల లోకాలు ఎలుగెత్తి చాటుతాయి. ఆ తరువాత హరిహరాద్వైతం ప్రతిపాదించబడింది. హరియె హరుడై, లచ్చి అగజాతై సరికి సరితాండవం అవటం ప్రారంభిస్తారు. విస్మతులైన దేవతలూ, మునులూ, హరిలో హరుణ్ణీ, హరుణిలో హరినీ చూచి భావావేశంతో ఎగిరి ఉప్పొంగి స్తోత్రాలు చేస్తారు. భేదభావాలన్నీ ప్రదిలిపోతాయి. ప్రపంచమంతా హరిహరాద్వైతమే ప్రతిధ్వనిస్తుంది. శివకేశవులు పరస్పరం నమస్కరించుకొని కృతజ్ఞతలు తెలుపుకోవటంతో శివుని తాండవం ముగుస్తుంది.

-అయపోయంది

-వల్లంపాటి వెంకటసుబ్బయ్య