వినమరుగైన

చత్వారాలు - చంపస్వరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ మోస్తరు వేగంతో పోనిస్తున్నాడతను. మధ్యలో రెండుసార్లు బ్రేక్ వేయాల్సి వస్తే వెంటనే పడలేదు. కొంచెం ఇబ్బంది పడ్డాడు. అహోబిలంగారు కంగారు పడ్డారు.
‘‘ఏమిటి బ్రేకులు పనిచేయడం లేదా’’ అన్నారు.
‘‘నాకు బ్రేకులు నచ్చవండి. ఈమధ్యనే చిన్న రిపేరు చేయించా అంతే’’ అన్నాడతను.
‘‘సడేలే! బాగానే వుంది, ఆపు. మేం వేరే ఆటోలో వెళ్తాం’’ అన్నారాయన.
‘‘్భయపడకండి సార్, నా ఆటోలో ఎక్కిన వాళ్ళను జాగ్రత్తగానే వాళ్ళు దిగాల్సిన చోటికి చేర్చేవరకు నా ఆటోకు బ్రేకులు పడకూడదని నా ఉద్దేశ్యం. ఇది నా సెంటిమెంటు కూడా. బ్రేకులు బాగానే వున్నాయ్’’ అంటూ సడన్ బ్రేక్ వేశాడు. ఆ కుదుపుతో అహోబిలంగారి గడ్డం ముందు సీటుకు గుద్దుకొని బొప్పి కట్టింది. కాంతమ్మగారి చెయ్యి ఇనుపరాడ్‌కు కొట్టుకొని కొద్దిగా వాచింది.
‘‘ఇక బ్రేకులెయ్యకు బాబూ! పోనీ.. అవతల ముహూర్తం టైవౌతోంది’’ అన్నారు- లోపల ‘అబ్బా’ అనుకుంటూ అహోబిలంగారు. ఆటో మళ్లీ కదిలింది.
‘‘నేనిప్పుడే అనుకున్నా బయల్దేరే ముందు ఆ పక్కింటి బామ్మగారు పనిగట్టుకొనల్లా వచ్చి ‘ఏం కాంతమ్మ కొత్త పట్టుచీర కట్టావ్, ఎక్కడికో’’ అని తెలుసుకొనిపోయింది. దీనికితోడు ఎదురింటాయన, ఇంటికి తాళం వేస్తుంటే గొడ్డుకారం ముక్కులోకి పోయినట్లు తెగ తుమ్మాడు. ఆటో కదిలేట్పుడు ఎవరెవరో గోల గోలగా ఎదురొచ్చారు’’. తెగ గొణిగి వదిలిపెట్టింది చెయ్యి నిమురుకుంటూ కాంతమ్మ.
‘‘మూఢనమ్మకాలు మానమని లక్షసార్లు చెప్పా! అలా మాట్లాడడం ఫ్యాషన్ కాదు’’ అన్నారు అహోబిలంగారు గడ్డం నిమురుకుంటూ.
‘‘నావి మూఢనమ్మకాలయితే, మీవి మూర్ఖపు గుణాలు. ఎవరింట్లోనో పెళ్ళికెళ్లడానికే ఇంత గగ్గోలుగా వుంటే, ఇక మనింట్లో ఎలా చేస్తారో మో!’’ అంది విసుగ్గా కాంతమ్మ.
‘‘నావి మూర్ఖపు గుణాలైతే, నీవి మర్కట గుణాలా’’ అడిగారు.
‘‘బాగుంది వరుస. ఇహ ఆపండి. ఆటోలో వెళ్తూ ఇలానా మాట్లాడుకునేది. ఆ ఆటో అబ్బాయి అంతా వింటూ నవ్వుతున్నాడు’’ అంది బిడియపడుతూ కాంతమ్మ. ‘‘నవ్వితే నవ్వాడులే చెప్పు’’ రెట్టించారు.
‘‘నిన్నరాత్రి భోజనాల దగ్గర మీ పళ్ళెంలో వేసింది పండుమిరపకాయల కారం అని చెబితే, కాదు కాదు టొమాటో పచ్చడి అని పదిసార్లు అన్నారు. చత్త్వారం వచ్చింది మీకైతే నాకంటారు. జోడు వాడడానికి నామోషి. ఏం ఫ్యాషనో బోడి ఫ్యాషన్’’ అంది.
‘‘అందుకేగా ఆ పచ్చడి నా కంటికి తగిలించి పండు మిరపకాయల కారమని వొప్పించావ్. కళ్ళు మండి చచ్చాను. ఫ్యాషనా నా బొంద’’ అన్నారు చిరాగ్గా.
‘‘అందరూ వినేట్లుగా ఇంత పెద్ద గొంతేసుకొని ఇలాగే మాట్లాడుతుంటే నే రానే రాను. నేనీ ఆటోలోంచి దూకేస్తాను’’ అంది కాంతమ్మ భయపెడ్తూ.
ఇలా వీళ్ళు వాగ్వాదం చేస్తుండగా మధ్యలో ఆటోవాడు ‘‘నా సెల్ ఆన్‌లో వుంచండి. మా ఆవిడ ఇంకో అయిదు నిమిషాల్లో ఫోను చేస్తుంది. ఒకవేళ ఆమె రమ్మంటే నేనింటికెళ్ళాలి’’ అన్నాడు.
‘‘ఏడిసినట్లే వుంది, మమ్మల్ని అక్కడ దించిపోవా’’ అన్నాడు ఆదుర్దాగా
‘‘మా ఆవిడ మాట నాకు వేదవాక్కు. ఆవిడ చెప్పినట్లు నడుచుకోబట్టే మా ఇల్లు కళకళలాడుతోంది. మిమ్మల్ని కొద్దిసేపట్లోనే మండపం దగ్గర దించేస్తాలెండి’’ అన్నాడు.
‘‘ఈ ఆటోవాణ్ణి చూసైనా సరే ప్రతి మగాడు ఆడదానికి ఎలాంటి గౌరవం ఇవ్వాలో తెలుసుకోవాలి’’ అంది కాంతమ్మ.
‘సరే సరే! ఆపు నీ ఉపన్యాసం. ఇదివరకు వాళ్ళు సన్యాసం, సన్యాసం అని ఎందుకనేవాళ్ళో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఇంతకూ గిఫ్ట్ కవర్ మర్చిపోలేదు కదా!’’ అనుకుంటూ జేబులు తడుముకున్నాడు. అన్నం మెతుకులు కవర్‌పై కూడా పడి వున్నందున, కవర్ జేబుకు అతుక్కుంది. కవర్ చిరగకుండా మెల్లగా పీకి, జేబును గట్టిగా పట్టుకున్నారు. ఇంతలో ఆటోవాని భార్య ఫోన్ చేసింది. ఆ సెల్ అతనికి ఇస్తే, ఆటో అటో ఇటో అవుతుందేమోననుకొని.
‘‘మీ ఆవిడకేం చెప్పమంటావ్’’ అని అడిగారు.
‘‘ఏడిసినట్లుంది. ఆ సెల్ అతనికి ఇవ్వండి. వాళ్ళిద్దరేం మాట్లాడుకోవాలనుకుంటున్నారో, అసహ్యంగా వాళ్ళావిడతో మీరు మాట్లాడ్డం ఏమిటి’’ అంది కాంతం.
ఎటూ తోచక, పిచ్చెక్కినవాడిలా ఆ సెల్ ఆటో అతనికి ఇచ్చాడు. అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. డ్రైవ్ చేస్తూనే, సెల్‌లో తెగ మాట్లాడేస్తున్నాడు. ఆటో సందులు గొందులు తిరుగుతోంది. ఇంతలో ఓ పెద్ద శబ్దంతో ఆ వీధిలోనున్న ఓ కుప్పతొట్టికి ఆటో గుద్దుకొని ఆగిపోయింది. ఆటోలో వాళ్ళు ఒకళ్ళమీద ఒకళ్ళు పడ్డారు. క్షణకాలం ఎవరికీ మాట రాలేదు. ఆ కుప్పతొట్టిలోని చెత్తంతా, అహోబిలంగారిమీద, కాంతమ్మగారిమీద పరమ చండాలంగా పడింది. ఆటోవాడు మాత్రం మామూలుగానే తన మీద పడ్డ చెత్తను తొలగించుకుంటున్నాడు. సెల్ ఆగిపోయింది.

-సశేషం

--షణ్ముఖశ్రీ