వినమరుగైన

తిండితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ రోజుల్లో అన్నీ విచిత్రాలే. పేర్ల దగ్గరనుండీ, ఫ్యాషన్ల దగ్గరనుండీ, సంపాదనలూ, పొదుపులూ, ఒకటేమిటి అన్నీ అన్నిగానే వున్నయ్. అందుకే ఈ మోడ్రన్ డేస్‌లో జగన్నాథాన్ని జఫై అనీ, కమలనాధాన్ని కఫై అనీ పిలవడం. వీళ్ళనే కాదు వీళ్ళ భార్యల పేర్లు కూడా. జయను జయ్యుం అనీ, విజయను జస్సుం అనీ పిలుస్తుంటారు. వీళ్ళు అలా పిలిపించుకోవడం గొప్పగా భావిస్తున్నారే గానీ హేళనగా ఎప్పుడూ అనుకోనేలేదు. ఇదో లైఫ్ స్టైల్ అనుకుంటున్నారు. హేఫీగా ఫీలవుతున్నారు.
జఫై అంటే వెంటనే తెలియదు కానీ, జయ్యుం మొగుడంటే వెంటనే తెలిసిపోతుంది. ఎప్పుడు చూసినా ఆమె మెడనిండా బంగారం నగలు మెరుస్తుంటాయ్. జఫైకి మాత్రం ఎప్పటికైనా ఓ మేడ కట్టుకొని, మెట్లెక్కి డాబాపైన పడుకొని చంద్రుణ్ణి చూడాలని కోరిక.
‘‘జఫైగారూ!’’ అన్న కేక విని అటు చూశాడు జఫై
‘‘ఇటుకలు తెచ్చానండీ!’’ అన్నాడు వచ్చినతను.
‘‘సరే ఆ గోడమ్మట పరచు’’ అన్నాడు వచ్చినతను.
ఇటుకలు పరచి డబ్బు తీసుకొని వెళ్ళాడు వచ్చినతను.
‘‘ఎప్పుడో కట్టబోయే ఇంటికోసం ఇప్పట్నుంచే ఇటుకలు కొని పెట్టుకుంటారా. ఎవరైనా సరే విలువ పెరుగుతుందని బంగారం కొనుక్కుంటారుగానీ!’’ అంది జయ్యుం.
‘‘నీ సంపాదనతో నీ వొళ్ళంతా బంగారమవుతోందిగా!’’ అని జఫై అంటుండగా కఫై వచ్చాడు.
‘‘మొత్తానికి ఇటుకలు చేరుస్తూనే వున్నావ్. అవునే్ల స్థలమెలాగూ వుండే! ఎన్నాళ్లీరేకుల షెడ్డులో మాడతావ్. ఆఫీస్ టైం అయింది పోదామా’’ అన్నాడు కఫై.
‘‘పద పద’’ అంటూ కఫైతో కదిలాడు జఫై.
‘‘గంతకు తగ్గ బొంతలా సరిపోయారిద్దరూ!’’ అనుకుంటూ ఇంటికి తాళం వేసి తనూ బయల్దేరింది ఆఫీసుకు రుసరుసలాడుకుంటూ జయ్యుం.
జఫై పెళ్ళానికి బంగారం పిచ్చయితే, కఫై పెళ్లానికి సింగారం పిచ్చి. కొత్తగా రిలీజయ్యే సినిమాల్లోని హీరోయిన్లు వేసుకొనే డ్రెస్సుల్ని వేసుకుంటేనే రాజయోగమన్నట్లు భావిస్తుంటుంది.
‘‘నీకీ చుడీదార్లు బాగాలేవే!’’ ఏమిటో వంగిపోయిన జామ చెట్టులా వున్నావ్! చక్కగా చీర కట్టుకో మామిడిపళ్ళ చెట్టులా ముద్దొస్తావ్’’ అందిట ఓ ఫంక్షన్‌లో కనపడిన తెలిసినావిడ.
‘‘చాల్లే ఊరుకోండి పాతకాలపు చూపులూ మీరూనూ, చీరకడితే నిండు గర్భిణిలా వుంటాను. ఫ్యాషన్లూ తెలియవూ, ఎట్రాక్షన్స్ తెలియవు. అంతా మొరటుమామీలు’’ అంటూ విసుక్కుంది జస్సు. అయినా మళ్లీ ఏమనుకుందో ఏమో అవి ఇవీ కాకుండా, స్కర్టులనీ, ప్యాంటూ షర్టులనీ మార్చి మార్చి కట్టుకోసాగింది.
కఫైకి మాత్రం ఈ ఫ్యాషన్ల గోల లేదు కానీ, ఎప్పటికైనా ఓ కారు కొనుక్కోవాలని వుంది.

-సశేషం
*
ఆకాశవర్షిణి నుంచి...

-షణ్ముఖశ్రీ