వినమరుగైన

లకపికమక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను పెద్దగా సదువుకోకపోయినా, మా అయ్య నాకు సెప్పిన పనిచేసుకుంటూ వస్తూ ఇంటివాడ్నయినా. నాకు తెలవగ అడుగుతాను, ఎవడి పని ఆడు చేసుకుపోతే తప్పేంటి? ఇయ్యాల ఆడిపని ఈడు, ఈడి పని ఆడు చేస్తున్నాడు. అందుకే అంతా గడబిడగా వుంది. ఎవడూ ఎందులోనూ గొప్పోడు కాలేకపోతున్నాడు. అందరూ బాగుండాలంటే, ఎవడి పని ఆడు చూసుకోవాలి. ఇంకోడి జోలికి పోకూడదు. ఈనాడు నాకు చాలా సంబరంగా వుంది’’ అని తన సీట్లోకి వెళ్లి కూర్చున్నాడు. పెద్దిగాడు మైకు దగ్గరకు వందన సమర్పణ చేయడానికి వచ్చాడు. ఇంతలో హఠాత్తుగా కొందరు పోలీసులూ, ఇద్దరు ఇనస్పెక్టర్లు, స్టేజీ దగ్గరకు వచ్చి ‘‘సభ ఇంకా అయిపోలేదు. ఇంకొకరికి సన్మానం చేయాలి’’ అంటూ పెద్దాయనవైపు చూడగానే ఆయన తన జేబులోంచి పిస్టల్ తీశాడు. ఆ వెంటనే ఇన్స్‌పెక్టర్ అతని చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ చేతిలోని పిస్టల్ పేలింది. జనం పరుగులు తీయబోయారు. కానీ తలుపులన్నీ వేసి వున్నయ్. భయం భయంగా చూస్తూ నిలబడిపోయారు. ‘‘ఇదుగో! వీరికే మా సన్మానం. మన దేశంలో వుంటూ, మన తిండి తింటూ, మన గాలి పీలుస్తూ, మన దేశానికే ద్రోహం తలపెట్టే విధంగా అనేక వేషాల్లో, మన దేశ రక్షణకు సంబంధించిన సమాచారాన్ని ఇతర దేశాలకు అందించే ముఠా నాయకుడీయన. ఇలాంటివాళ్ళింకెందరో వున్నారు. వాళ్ళందరిన్నీ ఏరిపారేసి, మన దేశం నుండి తరిమికొడితే తప్ప, ఈ దేశంలో శాంతి నిలబడదు. మనం ప్రశాంతంగా గుళ్ళూ గోపురాలూ తిరగలేం, ఇళ్లూ వాకిళ్లూ నిలుపుకోలేం. ఒకరినొకరం ధైర్యంగా పలకరించుకోలేం. కాబట్టి అందరూ ఎప్పుడూ జాగరూకులై వుండండి’’ అంటూ ఆ పెద్దాయనతో ఆ పోలీసులందరూ స్టేజీపైనుంచి బయటకు వెళ్లిపోగానే, మిగతా తలుపులు తీశారు. మిగతా జనం బ్రతుకు జీవుడా అంటూ బయటపడ్డారు.
****
ఆ మర్నాడే ఆ పెద్దాయన ఇంట్లో వాళ్లంతా గఫ్‌చుప్‌గా ఖాళీచేసి ఎటో వెళ్లిపోయారు. రామశాస్ర్తీ కూడా ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు రోజూ పూజ చేసే వినాయకుడి గూడు దగ్గరకు భార్యా సమేతుడై చేరి, ‘లంబోదర లకుమిరా!’’ అనబోయి, ‘‘ఏమిటో అంతా లకపికమక’’ అంటూ తలుపేసి, ఈ ‘‘ఈ దేశాన్ని రక్షించాలంటే రాజకీయ నాయకులొక్కరే పూనుకుంటే చాలదు. నీలాంటి వినాయకులు కూడా రంగంలోకి దిగాలి. అప్పుడే ఈ దేశం రంగరంగ వైభవంగా సుఖ సంతోషాలతో వర్థిల్లుతుంది’’ అని ఆయనకో నమస్కారం పెట్టి తలుపేసి, సామాన్లబండిలో ఎక్కాడు రామశాస్ర్తీ. -అయపోయంది

-షణ్ముఖశ్రీ ఆకాశవర్షిణి నుంచి..