వినమరుగైన

ఈగోల గోల - ఈశ్వర లీల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షణ్ముఖశ్రీ చిన్న కథలు
*
ఆనాడు తొలి కార్తీక సోమవారం కావడాన శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో మల్లికార్జునస్వామికి జరుగుతున్న అభిషేకం తాలూకు నమక చమకాలు సుస్వరంతో మైకులో వినిపిస్తున్నయ్. క్యూలో వున్న భక్తులు వింటూ పరవశించి ముందుకు సాగిపోతున్నారు.
విఐపి విశే్వశ్వరావు సకుటుంబంగా కారులోంచి దిగి నేరుగా స్వామివారిని దర్శించుకొని, పూజలు నిర్వహించుకుని, తిరిగి కారెక్కబోతూ మొక్కుబడి తీర్చుకొన్న సంతోషంతో ముక్కుపొడి గట్టిగా పీల్చి వదలి ఓసారి ఆ క్యూలో నిల్చున్న భక్తులను చూశాడు.
‘‘వచ్చే జన్మలోనైనా విఐపిగా పుట్టే అవకాశం ఇవ్వు మల్లేశ్వరా’’ అని ఒకరు.
‘‘ఒకవేళ విఐపిగా జనె్మత్తినా నిన్నిలా క్యూలో వచ్చి దర్శనం చేసుకుంటేనే తృప్తిగా వుంటుందని’’ వేరొకరు.
‘‘ఆహా! ఆ విఐపిగాడి అదృష్టమే అదృష్టం. ఏం ఫోజు కొడ్తూ కారెక్కుతున్నాడో’’ అని ఇంకొకరు.
‘‘అసలీ విఐపీలందరకూ విడి రోజుల్లోనే ఏదో ఒక టైం కేటాయించి, ఆ టైములోనే వీళ్ళకు దర్శనం ఏర్పాటుచేస్తే సామాన్య భక్తులకు ఇలాంటి సమయాల్లో ఇబ్బంది వుండదని’’ మరికొందరూ భావన చేసుకుంటున్నట్లు అనిపించిందతనికి.
ఒకసారి గర్వంగా తన కుటుంబ సభ్యుల వైపు చూశాడు.
‘‘ఏమిటా చూపూ మీరూనూ, అంత దూరం నుంచి పడొస్తే ఓ గంటయినా దేవుణ్ణి చూడ్డానికి వీల్లేకుండా ఎందుకొచ్చినట్లో, ఎందుకెళ్తున్నట్లో’’ అంది ఆయన భార్య విశాలాక్షి కళ్లు మరీ పెద్దవి చేసి, పెదవి విరుస్తూ భయంకర చూపుతో.
‘‘డాడీ! వాళ్ళందరూ చూడండి ఎంచక్కా ‘నమశ్శివాయ, ఓం నమశ్శివాయ’ అంటూ ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో? భక్తులంటే నిజంగా వాళ్ళే! నేనూ, రవీ కూడా అలా ఎంజాయ్ చేసి, మళ్లీ దర్శనం చేసుకొని వస్తాం! నువ్వూ, మమీ లాడ్జికి వెళ్ళండి’’ అంది ఆయన కూతురు కోమ్. అసలు పేరు కోమలి. ముద్దుగా కోమ్ అంటారు.
‘‘పొద్దునే్న ఆఫీసుకు తగలడాలి. కాస్త రెస్టు తీసుకోకుండా ఎలా. మీకు మటుకు స్కూలు లేదా ఇప్పట్నుంచే అంత భక్తి పనికిరాదు. పెద్దయ్యాక సన్యాసుల్లో కలుద్దురుగాని, ఇంతవరకూ ఓపిక పట్టండి’’ అంటూ అందర్నీ ఆ కారులోకి, ఓ నెట్టు నెట్టి స్టార్టు చేశాడు.
శ్రీశైలంలో విడిది చేసిన లాడ్జి దగ్గర కారాపాడు. అందరూ మొహాలు మాడ్చుకొని రూమ్‌లోకెళ్ళారు. భోజనాలయ్యాక కాస్త కునుకు తీద్దామనుకుంటుండగా కాలింగ్ బెల్ మ్రోగింది. తలుపు తీశాడు.
‘‘ఏరా! బాగున్నావా?’’ అంటూ లోపలికి రాబోయాడతను. అతణ్ణి చూస్తూనే చిరాగ్గా తలుపేశాడు.
‘‘ఎవరండీ అతను’’ అడిగింది విశాలాక్షి.
‘‘ఆ! ఏముందీ పనీ పాటా లేని వాళ్ళంతా విఐపీలు, కనపడగానే వెర్రి మొగాలేసుకొని వెంట పడుతుంటారు. ఏమన్నా పడేస్తామేమోని! చిన్నప్పుడు నాతో చదివేడ్చాడులే. ననె్నక్కడ చూశాడో ఏమో నా వెంట పడ్డాడు’’ అన్నాడు చిరాగ్గా.
‘‘అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. నాకెవరన్నా ఫోన్ చేస్తే వెంటనే లిఫ్టు చెయ్యను. వెయ్యి మిస్సుడు కాల్స్ తర్వాత నాకు లిఫ్టు చేయాలనిపిస్తేనే ఉస్సురంటూ లిఫ్టు చేస్తాను. వాళ్ళేమనుకున్నా ఫరవాలేదు. చాలా డిగ్నిఫైడ్‌గా వుంటానండీ! ఊరికే ఈగో వుండగానే సరికాదండీ! దాన్ని స్టయిల్‌గా పెంచుకోవడం కూడా తెలియాలి. అప్పుడే మన గొప్పేమిటో మనకీ, వాళ్ళకీ కూడా అర్థమవుతుంది’’. అంది బరువెక్కిన బాడీతో కళ్ళింత చేసుకొని విశాలాక్షి. వినీ విననట్లుగా రిలాక్సుగా బెడ్‌పైన వాలాడు విశే్వశ్వరరావు.
***
విశే్వశ్వరరావు ఓ ఆధ్యాత్మిక సంఘం వారికి పెద్ద మొత్తంలో డొనేషన్ ఇచ్చాడు. అందుకని వాళ్ళు ఏర్పాటుచేసిన పురాణ ప్రవచనానికి అధ్యక్షత వహించి ప్రారంభించమని ఆహ్వానించారు. ప్రవచనం చేసే వ్యక్తి ప్రముఖుడు కావడంతో జనం బాగానే వచ్చారు. ఇంకా సభకు కొంత సమయమున్నందున అక్కడ చేరినవారు ముచ్చటలో పడ్డారు.
ఆ ఉపన్యాసానికి వచ్చిన స్ర్తిలలో ధనవంతులూ, సామాన్యులూ ఉన్నారు. దివ్య సువర్ణ్భారణ శోభితురాలైన ఓ మహిళ ప్రక్కనే ఓ సామాన్యురాలు వచ్చి కూర్చుంది. అంతే టక్కున ఆ శోభిత మనసులో ఈగో, ఒకటేమైన గోల చేయసాగింది.

- సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)