వినమరుగైన

శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తి రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నేను నేనుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా, మీ మీద నాకు మంచి అభిప్రాయం వుంది పాపయ్యగారు. ఇప్పటికే మీరు చాలామందికి మంచి మంచి సంబంధాలు కుదిర్చారని అందరూ అనుకుంటూ వుంటారు కూడా!’’ పొగిడారు రత్నంగారు.
‘‘అంతా ఆ ఏడుకొండలవాడి దయ’’ అంటూ తను తెచ్చిన సంబంధం తాలూకు వివరాలలోకి వెళ్ళబోయారు పాపయ్యగారు.
‘‘ఆ! ఆ! వుండండి. కాస్త కాఫీ తాగి తాపీగా మొదలెడుదురుగాని’’ అంటూ వారించారు రత్నంగారు.
‘‘ఇదే సంబంధం ఇప్పటికి పదిళ్ళల్లో చెప్పి, కాఫీలు తాగడాలూ, నే చెప్పిన సంబంధం నచ్చక ఆ ఇళ్ళల్లో, ఇల్లాళ్ళ ఆగడాలూ అన్నీ అయ్యాయి. అందువలన ఎకాయకీ అసలు విషయంలోకి వెళదాం. మనం మాట్లాడేటప్పుడు మీ వాళ్ళు కూడా ఇక్కడే వుంటే వెంటనే అన్నీ తేలిపోతాయ్. మళ్లీ మళ్లీ వాగే ఓపిక లేదు. నాకెందుకో మీకీ సంబంధం ఖాయమవవచ్చనిపిస్తోంది’’ అన్నారు పాపయ్యగారు.
‘‘అరుణా! అమ్మను కూడా తీసుకొని ఇక్కడకు రా. కాఫీలు వద్దని అమ్మకి చెప్పు’’ అంటూ లోపలికి కేకేశారు రత్నంగారు. తల్లీ కూతుళ్ళిద్దరూ కుతూహలంగా వచ్చి సోఫాలో కూలబడ్డారు.
‘‘ముందు అబ్బాయి ఫొటో చూపిస్తే బాగుంటుందేమో!’’ సలహాగా అన్నారు రత్నంగారు.
‘‘వివరాలు నచ్చితే కొందరు ఫొటోను కూడా చూడకుండా ముందడుగు వేస్తారు. మరికొందరు ఫొటో చూశాక నోరు కట్టేసుకొని ఊరుకుంటారు. ఇంకొందరు జాతకం చూడందే ఇంటి ఛాయలకే రారు. సాధారణంగా చాలామంది కట్నం ఏ మాత్రం ఇవ్వగలరో కనుక్కోండి. అప్పుడు పిల్లను మేమే చూసి, పిల్లవాణ్ణి ఎలాగోలా ఒప్పించడానికి అన్ని విధాలా కష్టపడతాం అనేవాళ్ళే ఎక్కువ. సంప్రదాయం సంస్కారం కన్నా డబ్బే చాలా ముఖ్యం. ఆ డబ్బనేది వస్తున్నప్పుడు ఎటువంటి డబ్బా సంబంధమైనా చాలా డాబయిన సంబంధం అంటూ గొంతెండిపోయేలా వీధి వీధి తిరిగి పనికట్టుకొని చెప్పొస్తారు. ఏం చెప్పమంటారు- ఈ కట్నాల వ్యామోహంలో పడి చాలామంది కొత్త కోడల్ని చిత్రహింసలకు గురిచేసి ఆమె ఆత్మహత్య చేసుకొనేలా చేసి, తమ కుమారుడికి ఎన్ని పెళ్లిళ్ళయినా చేయడానికి సిద్ధపడే వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోతోంది. పేపరు చూస్తున్నారుగా అదీ’’ అంటూ ఊపిరి గట్టిగా పీల్చి వదిలారు పాపయ్యగారు.
‘‘వివరాలే చెప్పండి’’ అన్నారు రత్నంగారు.
‘‘ఇంటిపేరు పెడసరం వారు. అయినా సరసమైనవారే. మీ కుల గోత్రాలకూ, మత వ్ఢ్యౌలకు బాగా సరిపోతారు. ఇద్దరబ్బాయిలూ, ఇద్దరమ్మాయిలూ. ఈ అబ్బాయి ఆఖరివాడు. మిగతా వాళ్ళకు పెళ్ళిళ్ళయ్యాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉద్యోగం. ఈమధ్యనే అపాయింటయ్యాడు. సునామీ వస్తుందో రాదో చెప్పే ఆఫీసులో చాలా పెద్ద సున్నితమైన ఉద్యోగం చేస్తున్నాడు. నెలకు లక్షట జీతం. ఏమంటారు?’’ చెప్పడం ఆపారు పాపయ్యగారు. అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.
‘‘్ఫటో చూపించండి’’ అడిగారు రత్నంగారు.

-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

షణ్ముఖశ్రీ కథలు 8897853339