వినమరుగైన

శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తి రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అ! నేనే మాణిక్యాన్ని. నీ విషయాలు చెప్పు’’ అడిగారు మాణిక్యంగారు.
‘‘అన్నీ చెబుతా. ముందు కాఫీ తాగుదాం!’’ అంటూ రెండు కాఫీలు తీసుకొని, ఓ కాఫీ మాణిక్యానికిచ్చారు రత్నంగారు. ఆ తర్వాత ఇద్దరూ వచ్చి బల్లమీద కూర్చున్నారు. రత్నంగారు తన విషయాలు చెప్పారు.
‘‘నాకు తెలిసి దాదాపుగా అయిదేళ్ళుగా మీ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నావ్ ఇప్పటికీ కుదరలేదా?’’ అన్నారు మాణిక్యంగారు.
‘‘మీ అబ్బాయికి చూస్తూనే ఉన్నావుగా, కుదిరిందా?’’ అన్నారు రత్నంగారు.
‘‘ఏం కుదురుతుంది? మావాడికి ఉద్యోగమా? సద్యోగమా? ఏదో నాలాగే పౌరోహిత్యం చేసుకొని బతుకుతున్నాడు’’ నిస్పృహగా అన్నారు మాణిక్యం.
‘‘దొరుకుతుందిలే.. దిగులుపడకు’’ అన్నారు రత్నంగారు.
‘‘ఇంగ్లీషు చదువు లేనివాడికి, ఏ ఉద్యోగం దొరుకుతుంది? ఉద్యోగం దొరకలేదని బాధ లేదులే. ఏదో జరిగిపోతోంది. సరే నేను వస్తాను. ఈ రాత్రికి గుంటూరులో ఓ పెళ్లి జరిపించాలి. మీ అమ్మాయికి సంబంధం కుదరగానే, కబురు పెట్టు, సశాస్ర్తియంగా పెళ్లి జరిపిస్తా’’ అంటూ లేచారు మాణిక్యంగారు. అప్పుడే సింహాద్రి ఎక్స్‌ప్రెస్ ఫ్లాట్‌ఫాంమీదకు వచ్చి ఆగింది. ‘‘అలాగే! అలాగే!’’ అంటూ రత్నంగారు ఆదుర్దాగా ఆ బండివైపు చూడసాగారు. మాణిక్యంగారు ఆ బండివైపు కదిలారు. రత్నంగారు తన దగ్గరున్న ఫొటోతో జనం వైపు చూడసాగారు. జనమంతా బిలబిలమని దిగారు. ఎక్కవలసిన వారు కూడా ఎక్కి కూర్చున్నారు. ఆయన దగ్గరున్న ఫొటో తాలూకు వ్యక్తి ఎవరూ రాలేదు. విసుగుపుట్టి వెళ్దామనుకుంటుండగా, అంతకుముందు కనిపించిన పోర్టర్ రత్నంగారికి కనిపించగా, మళ్లీ ఆ కోటేశ్వరరావు గురించి అడిగారు. అతను అక్కడే క్షణకాలం ఆగి, ‘‘అడుగో అడుగో’’ అంటూ తన చేతిని సింహాద్రి ఎక్స్‌ప్రెస్ వైపు చూపాడు. అతను చేయి చూపించిన వైపు చూశాడు. అచ్చం తన వద్ద వున్న ఫొటోలాలానే వున్నాడు అనుకున్నాడు. ఆ కోటేశ్వరరావు నీళ్ళ ట్యూబ్‌తో, ట్రెయిన్ పెట్టెలపైన ఎక్కి బాత్‌రూమ్‌లోకి, ఆ నీటి గొట్టంతో నీళ్ళు నింపుతున్నాడు. ‘‘రైల్వే డిపార్టుమెంట్‌లో ఉద్యోగమని చెబితే వచ్చాడు. ఇదా ఇతని ఉద్యోగం . పిల్లాడు బాగానేవున్నాడు కానీ ఏం లాభం, చిన్న ఉద్యోగం. ఇందులో పాపయ్య తప్పు కూడా ఏం లేదు. తానింకా వివరాలు తెలుసుకోలేదని చెప్పాడుగా’’ అని అనుకుంటూ నడుస్తుండగా ఆ పాపయ్యగారే అక్కడకు వచ్చారు.
‘‘ఏం పాపయ్యగారు, ఏమిటండీ! ఈ సంబంధాలు! మా గురించి తెలిసినప్పుడు అన్నీ విచారించి చెప్పాలి కదా!’’ అన్నారు రత్నంగారు.
‘‘నిజమే, చెప్పాలి. కానీ ఏం చేయను. విచారించి చెప్పినవి నచ్చడంలేదని, విచారించకుండా చెప్పేవి నచ్చుతాయేమోనని చెప్పాను’’ అన్నారు మామూలుగానే.
‘‘ఇక మా జీవితమంతా ఇలా విచారిస్తూ కూర్చోవాల్సిందేనేమో గొణిగారు రత్నంగారు’’.
‘‘ఏమండీ! మీకు కోపం రాదంటే ఒక్కమాట చెబుతా. సినిమాల్లో అయితే ఉద్యోగం చిన్నదైనా, ఆస్తీపాస్తీ లేకపోయినా, అయినింటి అమ్మాయి ఆ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అలాగే భాగ్యవంతుడైన హీరో గుడిసెలోని అమ్మాయిని గుండెలకి హత్తుకొని, అరిసెలా అతుక్కుపోయి, వర్ణాంతర వివాహమైనా చేసేసుకుంటాడు. నిజ జీవితంలో ఆస్తి, అందం, అంతస్తు, కులం, మతం, అన్నీ అందరికీ కావాల్సిందే. ఇలానే చూసుకుంటూ, ఊహించుకుంటూ కాలం గడిపేస్తుంటే వయసాగుతుందా? ఏళ్ళు పైబడవా? అప్పుడు రెండో సంబంధం వాళ్ళు కూడా ఇష్టపడరు. గొంతెమ్మ కోర్కెలతో ఎవరికివారు చెట్టెక్కి కూర్చుంటే, పెళ్లిళ్ళు ఎలా కుదురుతాయ్. ఆడపెళ్లివాళ్ళూ అట్టాగే తగలడ్డారు. మగపెళ్లివాళ్ళూ ఇట్టాగే తగలడ్డారు. తల్లిదండ్రులూ పిల్లలకు నచ్చచెప్పాలి. పిల్లలూ సర్దుకుపోవాలి. పూర్తిగా కాకపోయినా, కొంతలో కొంత. అలాంటివాళ్ళకు మాత్రమే పెళ్ళిళ్ళు అవుతున్నాయ్. మిగతా వాళ్ళ తాలూకు సంబంధాలన్నీ పనికిరాని సంబంధాలుగా పడి వున్నయ్. ఈ సంబంధాలు కుదుర్చుకునే విషయంలో, వధూవరుల తాలూకు వారిద్దరూ దొందూ దొందుగానే వున్నారు. ఇలాంటి వాళ్ళందరకూ ‘శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రద్దు’ కాక మరేవౌతుంది. అందుకే దేవుడు కూడా వీళ్ళకు సంబంధాలు చూడలేక, తన కల్యాణం మటుకు తను చేసుకుంటున్నాడు. ఇంతకన్నా నేను ఎవరికి ఏం చెప్పలేను. క్షమించాలి అంటూ రత్నంగారి ముఖంవైపు కూడా చూడకుండా చకచకా వెళ్లిపోయారు పాపయ్యగారు కదలబోతున్న ఆ సింహాద్రిని ఎక్కే హడావుడిలో. అయోమయంగా అడుగులు వేస్తూ ముందుకు కదిలారు బరువెక్కిన గుండెతో రత్నంగారు.

షణ్ముఖశ్రీ కథలు8897853339