వినమరుగైన

తృణకంకణము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-రాయప్రోలు సుబ్బారావు
అంతకుముందు ఆధునిక విధానానికి త్రోవ తీసినవారు అనూరుప్రాయులు. ఈ సూర్యాలోకంవల్ల సాహిత్యసీమలో నూతన రుచి వ్యాపించి, కనులు మిరుమిట్లు కొలిపింది. కొంతమంది నేత్రపటలాలు నీరయిపోయినవి. తరువాత కవి కుమారులు కొంతమంది ఈ నూతన ద్యుతిలో స్నపితులై సాహిత్య సీమలో కాంతులీనే కావ్య దీపికలు పెట్టినారు. అంతకంతకు నూతన మార్గము దీపావళీ విరాజమానమై రాజమార్గమైంది’’. ఇంతటి మహిమకలది కాబట్టే తృణకంకణం అనేక విశ్వవిద్యాలయా ల్లో పలు పర్యాయాలు పాఠ్యగ్రంథంగా ఎన్నికైంది. రాయప్రోలు అభినవ కవితాచార్యునిగా అర్చితుడు.
‘‘మధుమయ ఫణితీనాం/ మార్గదర్శీ మహర్షీ’’
తృణకంకణంలో కథ నామామాత్రం. అంగోపాంగాలు విస్తరించవు. పూర్వోత్తరాలు కూడా అంతగా కథితాలు కావు. మాటల మధ్యలో సహృదయులకు స్ఫురిస్తాయి. ఈ లిరిక్కుల అధికాధికంగా అనురాగమే ఇతివృత్తం. కార్యకలాపం కంటే పాత్రల భావన, చేష్టావిలాసం, నర్మసల్లాపం విశేషంగా తరంగితం.అందుచేత బాహిరంకన్న అంతరం, వాచ్యం కన్న వ్యంగ్యం తృణకంకణంలోని ప్రధాన వైఖరి.
ఈ చిన్ని కృతిలో మన పూర్వ కావ్యాల్లో లాగా అనురాగం, సంభోగ పరిణామం పొందరు. విషయేంద్రియ భుక్తం కాని, భావాత్మకమైన స్నేహయోగం పరిమళిస్తుంది. దీనే్న రాయప్రోలువారు అమలినశృంగారమని సంకేతించారు. ఈ పద కల్పనను కొంతమంది పరిహసించారు. మలిన శృంగారమంటూ వేరే వున్నదా? అని ప్రశ్నించారు. ఇది మానసిక వ్యభిచారం కాదా అని సంశయించారు. ఎవరి సంస్కారం వారిది.
శుచీ, రుచీ, వినయం, వివేకం, చదువు, సంధ్య, సంప్రదాయం, సదాచారం గల కుటుంబాల్లో పుట్టి, అదుపు ఆజ్ఞలో పెరిగినతరుణ వయస్కులిద్దరు ఋణకంకణ కావ్యంలోని పాత్రలు. ఆడబిడ్డకు పెండ్లి అయింది. సంసార సంవృత్త సంప్రీత. ఆ జనన సహవాసంతోకలిసిమెలసి అనువర్తించిన ఆప్తమిత్రుడు, మనోరథ విఘాత విభ్రాంతుడు. పరిణయ విముఖుడు. తన స్నేహితుని దుస్థితికి ఆమె మనఃక్లేశం పొందింది. అందువల్ల తనా వయస్యుణ్ణి ఆవహించిన విరోధాభాసాన్ని ఆపాకరించి, మిత్రునిపట్ల తన సుహృద్ధర్మం నిర్వర్తించటానికి సమకట్టింది.
తన స్నేహితుని సాశ్రూక్తులు సానుతాపంతో ఆలకించింది. అతని ఆననం, వాల్ క్రీగన్నులతో చూచీచూడని చందాన చూచింది. నిగూఢ ప్రేమలీలా వినూతనభంగీ పరిపాటి తేటపడేటట్లు ఆ తన్వంగి శాంతశ్రుతితో ఏమంటున్నదో శ్రద్ధగావినండి! ‘‘మిత్రా! ప్రేమబందాలు తెంపితే తెగేవి కావు. అందులోనూ అస్ఖలిత ప్రణయానురక్తి, చిరతపశ్శుద్ధి చేతగాని దొరకదు. విషయ వాంఛలతో హృదయం కల్మషం కావించవాకు’’ తన్మయమైన అర్థమానుష దశే కృతార్థం.
కలసినయంత మాత్రమున
కాదు సుమీ చెలికార, మంతరం
బుల నతుకంగ జాలిన
యపూర్వపు ‘లంకెయో ఏనహవౌ, తద
స్ఖలిత సమస్త సాధనము
జ్ఞాన విదగ్ధుల మార్గసూత్ర, మే
వలతినినైనా ప్రేమ పరిపాకము
లిట్టులె యన్వయించెడిన్
పరమ ధర్మార్థమైన దాంపత్య భక్త
స్తన్య మోహనమైన వాత్సల్యసక్తి
సాక్షి మాత్ర సుందరమైన సఖ్యరక్తి
అందు ఆదిమమగు ప్రేమయందె ముక్తి
గువ్వ జంటలు, వలపుతోను, తల్లీబిడ్డలు వాత్సల్యంతోను, మిత్రులు కలుషరహిత సత్ప్రణయ కాంక్షామేళనంతోను మెలగటంలేదా? ఎందుకు వికార భావాలతో కృశిస్తున్నావు? నీ వంటి వానికీ ప్రవర్తనం ఉచితమేనా? అంతరంగాల్లో పెనవేసుకొన్న ప్రణయం మాసిపోయేది కాదు. ప్రేమ కలిపినా, విడదీసినా నిమిత్తమాత్రమే. కామానికి అన్నీ సంకెళ్లే. ప్రమ స్వేచ్ఛామయం.

-ఇంకా ఉంది
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-కీ.శే.ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తం