వీరాజీయం

అందరికీ కావాలి కంచం, మంచం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హ్యాపీగా తినడానికి కంచం, ఆనక హాయిగా నిద్దరోడానికి మంచం అందరికీ కావాలి. అంచేత అప్పనంగా మంచం దొరికితే ఎవడు వదులుకుంటాడు? పైగా, అందరినీ (గ్రామీణ) దేహాతీ- ఆడియన్స్‌ని కొట్టుకొచ్చారు కాంగ్రెస్ వాళ్లు. అంటే రైతులు కావాలిగదా!
నరేంద్రమోదీగారు- ‘చాయ్ పే చర్చా’అంటేనే జనం ఎగబడ్డారు. మరి ‘మంచం మీద చర్చా’అంటే జనాలు యింకా సంతోషిస్తారు- అన్న బ్రిల్లియంట్ ఐడియా చినబాబుగారి సన్నిహితుడైన ప్రశాంత్ కిషోర్‌గారికి వచ్చింది.
ఐడియా మంచిదే గానీ, జనం అపార్థం చేసుకున్నారు. నులక మంచాలయితేనేం? అవే అసలు మంచాలు. ఉత్తరాది కల్చర్‌లో భాగం- రాహుల్‌గాంధీ అట్టహాసంగా ఉత్తరప్రదేశ్‌లోని ‘దెవోరియానుంచి ఢిల్లీకి’- అంటూ బ్రహ్మాండమైన కిసాన్ యాత్రను ప్లాన్ చేసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీకి అది ‘మంచాలు పోయాయ్ బాబూ!’ అన్న యాత్రగా మారిపోయింది.
మామూలుగా సభలకు చాపలు వేస్తారు. టార్పాలిన్ వేస్తారు. జంబుఖానాలు వేస్తారు. ఇంకా వుంటే కుర్చీలు వేస్తారు. గానీ చినబాబు మంచాలు వేయించాడు. రాహుల్‌గాంధీ లేచి నిలబడుతూనే- నరేంద్రమోదీ పైనా, నరేంద్రమోదీ ధరించిన అత్యంత ఖరీదైన సూటు మీదా దండయాత్ర మొదలెట్టాడు.
‘రుణాలు మాఫీ చేయిస్తాను. కరెంట్ సగం రేటుకే యిప్పిస్తాను’- అన్న అసలు వరాల మూట అప్పుడు జ్ఞాపకం వచ్చింది కాబోలు- రైతుకీ, పేదవాడికీ అందవలసిన డబ్బును వాళ్లకి యిప్పించేదాకా నిద్రపోను’’- అంటున్నాడు నాయకుడు మైకులో- క్రింద కొత్త మంచాలు వేశారు. వాటిమీద కూర్చున్న జనాలకి వెంటనే నిద్ర జ్ఞాపకం వచ్చింది. అక్కడ లడ్డూలిచ్చారు. వాటర్ బాటిల్స్ కూడా సప్లయ్ చేశారు.
ఇక మంచాలు దొరికాయ్. అసలు నులక మంచాలకి ఉత్తరాది గ్రామాలలోనే కాదు మనవేపు కూడా పల్లె పట్టుకుపోతే, ఎన్నో ఉపయోగాలున్నట్లు తెలుస్తుంది. గుమ్మాల ముందు మంచాలు వేసుకుని పిచ్చాపాటీ మొదలుకొని యితర ముఖ్యమయిన కార్యక్రమాల దాకా పెద్దలు నిర్ణయిస్తూ వుంటారు. ‘ఖటియా’ లేదా ‘ఖాట్’అంటే మంచం- దైనందిన జీవితంలో పగలూ, రాత్రీ కూడా ఎంతో ఉపయోగంగా వుంటుంది.
హిందీ బయస్కోపులు యిప్పుడు తెలివిమీరిపోయాయి. కానీ, కేవలం ఓ నులకమంచం పెట్టుకుని హీరో దేవానంద్ హేమ్మాలినీ లాంటి వాళ్లతో రంజైన రొమాన్స్ సీనులు లాగించేసేవాళ్లు పూర్వం సూక్ష్మంలో మోక్షం. మంచం అడ్డం పెట్టుకుని, దానిమీద వోణీ పడేస్తే, పల్లెటూళ్లల్లో ఆడకూతూరు స్నానం చేస్తోంది, లేదా దుస్తులు మార్చుకుంటోంది కాబోలుననుకొని, అటువెళ్లేవారు కాదు పెద్దలు. హీరో, హీరోయిన్ల మధ్య మంచం అడ్డం పెట్టుకున్నారూ అంటే, సీను పండాల్సిందే. పైగా, నులక మంచం స్పెషాలిటీ ఏమిటీ అంటే- ‘ఖట్‌మల్’- అంటే ‘నల్లి’.
- ‘‘ఓయ్ నల్లిబుల్లీ! తాపీగా లోపలికి పోవమ్మా... మా హీరోయిన్ బజ్జొందీ’’- అంటూ, యస్.డి.బర్మన్‌గారు కంపోజ్ చేసిన పాట విన్నారుగా?’’ అరె...వో ఖట్‌మల్... ధీరెసె జానా కటియన్ మేఁ.... ఓ ఖట్‌మల్!’’అన్న పాట (1975 ఛుపారుస్తుం)కి కిశోర్ కంఠంతో దేవానంద్ ఎంతో గొప్పగా ఏక్ట్ చేశాడు.
ఒక్క నులక మంచం వుంటే చాలు. ఎండ ఎక్కడ వుంటే అక్కడికి తీసుకుపోయి మనం ఉప్పులూ, పప్పులూ ఊరగాయలూ గట్రా ఎండబెట్టుకోవచ్చును. ఓ మంచం వుంటే, దానిమీద మిఠాయికొట్టు పెట్టుకోవచ్చును. ఇలా ఇండియన్ కల్చర్‌లో అంతర్భాగం అయిన ‘ఖాట్’ (మంచం)ని ర్యాలీకి వూతంగా పెట్టుకున్న చినబాబు 2500 కిలోమీటర్ల సుదీర్ఘ యాత్రని తలపెట్టడం- దాన్ని సాగించడం కూడా ఒక స్ఫూర్తిదాయకం అయిన వింతే!
దారిలో దేవాలయాల్ని, దర్గాలను, బాబాల ఆశ్రమాల్ని దర్శిస్తూ యిలా సెక్యులర్ భారత్ రీతుల్ని అమలుచేస్తూ, అజయ్‌ఘడ్ చేరుకున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడికి- ములాయంసింగ్‌గారి ‘‘యిలాకా’’లో మాత్రం నరేంద్రమోదీకి బదులు సైకిలు జ్ఞాపకం వచ్చింది.
రాహుల్‌గాంధీగారు దారంట వారంట- మంచం దుకాణాలు, చిరుతిళ్లు తినేస్తున్నాడు. దళితుల యింట్లో ‘రోటీ’తిని, అక్కడే వో కునుకు తీస్తున్నాడు. ‘మంచం’ సింబల్‌ని మరిచిపోకూడదు మనం. ప్రశంసించాలి వీలైతే...
ఐతే, సైకిలెక్కే ఛాన్స్‌లేదు యువరాజుకి. అది ‘ములాయం మార్కు’.
వెనుకటికి వాళ్ల బామ్మ (ఇందిరమ్మ) దుర్గమ గ్రామాలకు ఏనుగునెక్కి వెళ్లి ప్రచారం చేసింది. అలాగ, శ్రీమతి ఇందిరాగాంధీలాగా ఏనుగులనెక్కి ‘రోడ్‌షో’ చేద్దామా అంటే, అసలు ఏనుగులన్నింటినీ నిజం అయినా, బొమ్మలయినా- మొత్తం అన్నింటినీ లాగేసుకుంది మాయావతీ బెహన్‌జీ. సో... అదీ లాభం లేదు. పోనీ గుఱ్ఱాలయితే? లల్లూప్రసాద్ సంతతి వారు మంత్రులయినాకా కూడా గుర్రాల్ని వాడుతున్నారు- పెట్రోలు పొదుపుట!-
ఏంటి సాధనం? లారీలు, ట్రక్కులు యివెక్కాలి యింక. ‘రోడ్‌షో సారు’ లేచేసరికి సభలోని ‘పలంగ్’లు ఎత్తుకుని జనాలు లంఘిస్తున్నారు. ‘‘ఎనిమిదివేల కొత్త మంచాలు- కిసాన్ మేళాకి అర్పితం అయేయి, మొ ర్రో’’మంటున్నారు కార్యకర్తలు.’’ మంచాలొదిలేయండి బాబులూ!... అమ్మలూ! మరో సభకి యివే పర్చాలి మేము’’అంటూ వెంటబడుతూంటే- ‘‘వెళ్లెళ్లవో! సైకిళ్లు, కుట్టుమిషన్లు, మిక్సీలు, టెలివిజన్‌లు, హీటర్లు- అన్నీ యిచ్చేసే పార్టీలున్నాయ్. బేరం కుదిరిందో, రుూ మంచాలు వదిలేస్తాం’’అంటున్నారు మహిళామణులు. ఔరా!
పైగా- ‘రుణమాఫీ’కి రశీదులేవీ? ‘‘చిట్టీ’’మీద హామీ యివ్వండంటూ అడిగిందో రైతు యిల్లాలు. ఐనా చినబాబు దర్గాలో చద్దర్‌లు, గుళ్లో టెంకాయలూ పట్టుకుని 2017 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఉత్తర భారతాన్ని ఏలుకుంటుంది అన్న ఆశలో వున్నాడు. యు.పి.లో గెలిస్తే- దేశానే్న మార్చేస్తాం’’-అంటూ మడమ తిప్పకుండా ముందుకి సాగిపోతున్నారు శ్రీ రాహుల్‌గాంధీ... కూడా గులాంనబీగారు కూడా వున్నారు. వేళకి యిన్ని సమోసాలు కచోడీలు, చాయ్‌లు దొరికేలాగా మ్యానేజ్ చేస్తున్నాడు. కనుక మంచం యాత్ర అలా దొర్లుకుపోతోంది.
రెండు కోట్ల గడపల్ని ఎంచుకున్నది కాంగ్రెస్. రెం డున్న లక్షల వాలంటీర్లు యింటింటికీ పోయి, తలుపు కొడతారు. రైతు సంక్షేమం మీద లెక్చర్లిస్తారు. ‘‘వోట్ దేవ్‌నా! మీరే అనగా వోటర్లే మా దేవుళ్లూ’’- అంటారు దీనంగా...
మళ్లీ సైకిల్, జట్కా వగైరాలు ఎక్కరాదు. అదో చిక్కు. ఇంటింటికీ - వెనకటి రోజుల్లో పిలుపుకు వచ్చి- ‘చిక్కసం’ పోసేవారు. అలాగా, ‘‘మంచాలేమయినా గు మ్మాల ముందు దింపుతాడేమో మన ఛోటా సర్కార్’’అని చూస్తున్నారు యు.పి. వోటర్లు!-
ఇన్‌స్పయిట్ ఆఫ్ ‘కాట్’ నోస్లీపెటాల్!!