వీరాజీయం

సబ్‌కో ‘సన్మతి’.. సమ్మతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంచపాండవులలో- భీమార్జున నకులసహదేవుల లాగ -బుద్ధిగా అలా గా కూర్చుంటే -ధర్మరాజులాగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నిరంజన్ గోగోయ్ వేయి పేజీలకు మించిన -తీర్పును -భారతీ యుల ఎద జల్లిన పన్నీరులాగా -చదివి పండిత పామర జనరంజనం చేశారు. ఏకగ్రీవం గా వెలువడిన సర్వజన మనోవికాసమయిన ఈ తీర్పు ముఖ్యాంశాలు వింటున్న ఆబాలగోపాలంమొహాల్లో ఒక వెలుగు, ఒక భరోసా ద్యోతకమయ్యాయి. మన దేశ సర్వోన్నత న్యాయ స్థాన ధర్మాసనం వెలువరించిన -ఈ నికార్సయిన తీర్పు స్వతంత్ర భారత చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం. అద్వానీ మహాశయుడు రథయాత్ర విజయవంతంగా ముగిసిన తరువాత, రథం దిగిపోయిన -కురువృద్ధయోధుడిలా - నా జన్మ తరించింది అన్నాడు. ఒకసారి నన్ను గిల్లు -అంటూ ఒక తాతగారు మనవడిని పిలిచి -అబ్బాఅంటూ స్పందించి -జయహో అంటూ అంతలో మనవడిని కౌగలించుకున్నాడు- భేషజం, సంకోచం, నామోషీ లాంటి వికారా లుకొందరిలో కలిగినా, అందరిలో ఒక ఆనందాతిరేకమయిన ఝలక్ దాచినా దాగకుండా విరిసింది. చరిత్రలో నవీన భారత జీవన స్రవంతిలో-సబ్‌కో సన్మతి- కలిగి అందరిలో సమ్మతి జేగంటలై మ్రోగింది.
అయదుగురు న్యాయమూర్తులు ఒక్క మాటగా ఒక్క బాటగా నిర్ద్వంద్వంగా వెలువరచిన సహస్రాధిక పుట వివరణలో -అయిదు ముఖ్య అంశాలు - అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామమందిరం కోసం అప్పగించాలి. - కేంద్ర ప్రభుత్వం 3 నెలల్లోగా అయోధ్య ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలి. ఆలయ నిర్మాణ బాధ్యత ఆ ట్రస్ట్‌కు ఇవ్వాలి. సున్నీ వక్ఫ్‌బోర్డుకు మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం కేటాయించాలి. మసీదు నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు సున్నీ వక్ఫ్‌బోర్డుకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.
2010లో అలహాబాదు హైకోర్టు తీర్పులో మూడు ముక్కలు చేయబడ్డ వివాదగ్రస్త ఆల యభూమికి ఇప్పుడు చిన్నా భిన్నమయ్యే ముప్పు తప్పింది. ఆనాటి తీర్పు మీద వెలువడ్డ అప్పీళ్లను ఆమూలాగ్రం పరిశీలించి, పరిశోధించి రాజ్యంగం-న్యాయస్థానం రెండిటినీ సదరు పరిశోధనలతో మేళవించి -పిండిన సత్యాన్ని -ఒక చేతి అయిదువేళ్లు గట్టిగా పట్టుకొని అందించినట్లు ప్రకటించిన ఆ అయిడుగురి పేర్లను ఓ సారి చెప్పుకున్దాము. చీఫ్‌జస్టిస్ గోగోయ్ నాయకుడు. ఆయన 17నవంబరు నాడు పదవీ విరమణ చేస్తున్నాడు. అందుకనే ప్రతిరోజూ 40 రోజులు పొద్దుపోయే దాకా కేసు విచారణ కొనసాగించిన దొడ్డమనిషి . ఇక ఎస్.ఎ.బాబ్డే కాబోయే సుప్రీం చీఫ్ జిస్టిస్. మిగతావారు జస్టస్ డి.వైచంద్రచూడ్,అశోక్ భూషణ్, ఎస్. అబ్దుల్ నజీర్. రామ్ లల్లా ,నిర్మోహి అఖడా ,సున్నీ వక్ఫ్ బోర్డు అప్పీల్ చేశాయి. ఇది రామజన్మభూమి- ఇక్కడ బాలరాముడే అధిష్ఠాన దేవుడు- రామ్ లాల్లా గుడి ఇది-రేపు ఇది మరో మడతపేచీ కాకుండా పెద్దలు జాగ్రత్త పడాలి. యు.పీ. ముఖ్యమంత్రి యోగీ ఆకాశమంత ఎత్తు రాముడు విగ్రహం పెట్టాలనే ప్రమాదం వున్నది.. శాశ్వతంగా అది రామజన్మ భూమి. అక్కడ మూడు మాసాలలోగా ఒక ట్రస్ట్ ను ఏర్పాటుచేసి గుడి కట్టే మహోన్నత ఘట్టం జేగీయమానంగా -ఆవిష్కరింప బడాలి అన్నది సుప్రీం ఆదేశం. లేకపోతె ఏటవుద్దేటి? -వేళాకోళంగా అడిగాడో అప్పలరాజు-కోర్టు ఉల్లంఘన కేసు ‘‘అవుద్ది‘‘ అన్నాడు మరో అప్పలాచార్యులు.
సరే , ఇప్పుడ ఈ మహా పవిత్ర అయోధ్య నగరం- సయోధ్యా నగరంగా అందరి నోట కొనియాడబడుతున్నది- కావున -దాని సమీపంలోనే -మనోహర కళాఖండంగా నవీన మసీదును ఏకంగా అయిదుఎకరాల పక్కా జాగాలో సరయు నదిని గ్రీట్ చేస్తూ ఉంటుంది. ఈ యజ్ఞంలో భాగస్వాములై అహర్నిశలు కృషి చేసిన సంస్థలు -ఇప్పడీ ట్రస్ట్ లో భాగస్వాములవుతారు. ఈ సందర్భంలో ఎటువంటి వివాదం రాకుండా ధర్మాసనం రాజ్యాగం లోని ఆర్టికిల్ 142 ని వినియోగిమ్చుకొన్నది. దీని బలం మీదే -ముస్లిములకి పరిహారంగా -స్థలాన్ని ఇవ్వమని ఆదేశించింది. నిర్మోహి అఖాడాకి ట్రస్టులో చోటు ఇవ్వమని ఆదేశించింది. మన న్యాయచరిత్రలో 142ని వినియోగించడం ఇది రెండోసారి. కట్టడం ఏదైనా అది అక్రమమయినదైనా -సక్రమమైనాదైనా, దానిని కూల్చివేయడం తప్పు- అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అందుకే ,ఉభయతారకంగా మందిర్ మసీదు వెలుస్తాయి. దూర్ హటో -ఏ దునియవాలో .... మందిర్ మసీదు హమారాహై సయోధ్యా హమారా హై ... అంటూ సరయూ తీరంలో -యుగళగానం వినబడుతుంది.. ఇదీ సుప్రీం తీర్పు తరువాత పల్లవించిన -ఆశావహ దృశ్యం.
హిందువులకు 2.77 ఎకరాలేనా? మసీదుకి అయిదు ఎకరాలా ? సుభానలా లఅన్నాడో రహీమ్ భాయ్.. ‘‘తంతే బూరెల గంప లోపడ్డట్లే అయ్యింది...’’అన్నాడు రామ్‌లఖన్ భాయ్... ఎదో కథచెబుతారే?.. కర్రకి కత్తి వచ్చే -కత్తికి డోలు వచ్చే డోలుకి పిల్ల వచ్చే అన్నట్లు -దొరికన జాగాని సద్వినియోగం చేసుకోవాలనే అందరూ అనుకుంటున్నారు- యిదేదో చారిటీ -మాకెందుకు? అంటున్న కొంచెం మంది పేచీకోరులున్నారు- వాళ్ళని ఇగ్నోర్ చెయ్యాలి- అవ్వ పేరే ముసలమ్మా అని ఈ స్థలం మంజూరు న్యాయం చెయ్యడంలోభాగమే-ఇక ఇప్పుడు గెలిచింది రామ్‌లల్లా-సాక్షాత్తు ఆ బాలరా ముడే కేసులో ఒక కక్షిదారు. రాముడి తరఫున ప్రతినిధిగా పదేళ్లకుపైగా కోర్టు చుట్టూ తిరిగిన రామ్ లాల్లా -పిటిషన్దారు త్రిలోక్‌నాథ్ పాండే ధన్యుడు. కోట్లాది మంది హిందువులలో ననే్న రామచంద్ర ప్రభూ ఎన్నుకోవడం సంతోషం అంటూ మురిసిపోయాడు. రామ్‌లల్లా తరఫున వాదించిన లాయరు వైద్యనాథన్ ఇది న్యాయవ్యవస్థ గెలుపు అన్నాడు. దేవుళ్ళకు ఆస్తిపాస్తులు మన చట్టం పరిధిలోనే వున్నాయి. కొత్త కాదు. కొన్ని ముఖ్యమైన అంశాలు -కోర్టువారు శసభిషలు లేకుండా చెప్పారు-బాబ్రీ మసీడు ఒక ఖాళీ స్థలంలో నిర్మించినది కాదు అయితే అక్కడున్న ఒక నిర్మాణాన్ని కూల్చి వేసి మసీదు కట్టారా? అన్నది నిర్ధారణ కాలేదు-కాకపోతేఅక్కడి శిథిలాలు అది ఇస్లామిక్ నిర్మాణం కాదని ఆరికిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక నిర్ధారించింది.పైగా ఆ స్థలంలో 1528- 1856 మధ్య నమాజులు జరిగిన ఆధారాలు లేవు. ధర్మాసనం ఫ్రెంచ్ ఇంగ్లీష్ ఉర్దూ ఫార్సీ టర్కిష్ భాషలు సంస్కృతం గ్రంథాలు సహా లెక్కకు మించిన గ్రంథాలను, దస్తావేజులను పరిశోధించి న తరువాతనే -తీర్పుకి సిద్ధమైయింది. ఇది న్యాయ చరిత్రలోనే ఒక మైలురాయి. తీర్పులో మసీదు కూల్చివేత కేసు ప్రస్తావన తేలేదు. అది తప్పేనని వ్యాఖ్యానించారు. ఆ కేసు మూసివేస్తారా? లేదా? అన్నది మీమాంస.
అద్వానీ రథయాత్ర ముగిసింది, కలనేరవేరింది కాని.. కేసు నుంచి ఆయనకీ, ఉమాభారతి తదితరులకు విముక్తి ఎప్పుడు లభిస్తుంది?. అది వేరే విషయం. ఇప్పుడు అయోధ్య తీర్పులో ఇరవై నాలుగు సార్లు -వారు వాడిన సెక్యులర్ అన్న మాట సార్ధకమయింది. రివ్యూ పిటిషన్ కి కూడా అవకాశం లేదంటున్నారు-అంటే పక్కా ఏకగ్రీవం, ముక్తకంఠం ఈ మహోన్నత తీర్పు.. దేశంలో రామరాజ్యం రావాలి అంటూ మహాత్మా గాంధీ నుంచి గల్లీ పౌరుడి దాకా కోరుతున్న దేశం ఇది .రాముడు ఇక్కడ -ఆరువేల సంవత్సరాలుగా మహోన్నత ప్రతీక (ఐకాన్)-దోషవిముక్తమయింది. ఆ ప్రతీకకి రామ య్యతండ్రి ప్రఖ్యాతి. అసేతుహిమవన్నగమూ జయహో! రాముడికి తన జన్మస్థలంలోనే గుడి లేదన్న అపవాదు తొలగిపోయింది.
హ్యాట్సాఫ్ టూ సుప్రీం కోర్టు బెంచ్.. ఫర్ ల్యాండ్‌మార్క్ వెర్డిక్ట్!

-వీరాజీ veeraji.columnist@gmail.com 92900 99512