వీరాజీయం

నారసంచులలో.. శ్రీవారి ‘మనోహరం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ ఘుమ ఘుమ - ఆ దివ్య పరిమళం - మరెక్కడా దొరకదు.. అందుకే ఒకప్పుడు వెంకన్న లడ్డూని - ‘మనోహరం’ అని ముద్దుగా పిలిచే వారట! అవును.. మనోహరమే.. దాని అలౌకిక పరిమళం -మరే ప్రసాదానికి ఉండదు. అందులో తాజా నెయ్యి వెయ్యడానికే -దేవస్థానం వంద కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది! తిరుపతికి పోతునప్పుడు -రైలయినా బస్సయినా -గొప్ప బరువుగా కదుల్తుంది... అవును... దాని నిండా -కొన్ని కోట్లు సంపాదించగల -తల నీలాలుంటాయి.. వస్తున్నప్పుడు -వేరే చెప్పాలా? తెలుగు నుడికారంలో -తిరుక్షవరం అన్నది గొప్ప విలువైన మాట. గుండును నిమిరి చూచుకుంటూ - మధ్య మధ్య ఉందా? లేదా? అని తడుముకుంటూ -వస్తారు. కాని , వస్తూ వస్తూ ఇంకా ఏమి తెచ్చుకుంటారు? .. గుండులాంటి గుండ్రని -శ్రీవారి లడ్డుండలను అపురూపంగా భక్తులు తెచ్చుకుంటారు. దుడ్డు వేసికోనాలి -దుడ్డు అంటే డబ్బు. లడ్డు అంటే ఎంత దుడ్డు వేసినా -కొండవాడి సమక్షంలో తప్ప -ఇంకెక్కడా .. లభించనిది.. శ్రీవారి లడ్డూ మాత్రమే.
మేం ఆర్జిత సేవ టిక్కెట్టు కొనటం ఎందుకు?. ఇన్ని లడ్డూలు అని లెక్కపెట్ట్టి మరీ ఇస్తారు. మన అవసరాలు ఆత్మీయతలు లాంటి వాటినిబట్టి -్ఫల్ లడ్డూ తెచ్చి ఇస్తాం. లేదా నలుగురికి తెలియడం అవసరం కదా? చిన్న పిసరు గోరుతో గిచ్చి అయినా పెడతాము. లడ్డూ మాత్రం మస్ట్.
నీ గుండు లబ్బీపేట గుండా? చిక్కడపల్లి గుండా? అంటే పోల్చి ఎవ్వరూ చెప్పలేరేమో గాని.. శ్రీవారి లడ్డు రుచిని -పచిని -కిడ్స్ నుంచి సీనియర్ సిటిజన్స్ దాకా అంతా పట్టేసుకుంటారు. అంచేత శ్రీవారి బ్రహ్మోత్సవాలలో వొళళు హూనం చేసుకుని - తిరిగి ఇంటికి రావడం ఎంత ముఖ్యమో .. వడ వగైరా ప్రసాదాలు తేవడం కన్నా - ప్లాస్టిక్ సంచీలో - వెంకన్న బొమ్మలను భద్రంగా కొని తెచ్చుకోవడం మనకి అలవాటు. కానీ కొంచెం రోజుల్లో ఆ అలవాటు పొరపాటుగా మారిపోతుంది.
ప్లాస్టిక్ వాడకానికి ఉద్వాసన చెప్పే ఉద్యమంలో ... వడ్డికాసులవాడు కూడా చెయ్యి అందించే ఏర్పాట్లు ఇప్పుడు జరిగాయి. ఒక చెయ్యి వె య్యదలచుకున్నాడు గోవిందుడు. అల్యూమినియం పూతగల జనపనార సంచులు తయారుచేసి లడ్డూలను అందులో పెట్టి భక్తులకు అందించే ఏర్పాట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వారు గత ఆదివారం నుంచి చేస్తున్నారు. అయితే రోజుకి మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షల దాకా చిన్న సైజు, పెద్ద సైజు లడ్డులు వినిమయమయ్యే అతి సంపన్న పుణ్యక్షేత్రం తిరుపతికి అవసరమైన్నని అల్యూమినియం ఫాయిల్ లామినేటేడ్ నారసంచులు సరఫరా చేయడం అనుకున్నంత సులువు కాదు. కాని ప్రస్తుతానికి కాగితం అట్టపెట్టెలు కూడా విక్రయిస్తున్నారు. అట్ట పెట్టెల ధర మూడు రూపాయలు నుంచి పది రూపాయల దాకా పెట్టేరు -కాకపోతే నారా సంచుల ధర బాగా ఎక్కువ పెట్టేశారని కొత్తగా గుండు ప్లస్ లడ్డూ నార సంచీతో దిగిన స్టూడెంట్ ఒకడు ఆవేశపడ్డాడు.
నారసంచులమీద మొగ్గు చూపుతున్న భక్తులు వాటి ధరలు లడ్డూలను తలదనే్నవిగా ఉన్నా యంటున్నారు. ఒక్కో నారసంచీ సైజును బట్టి పాతిక నుంచి యాభై ఐదు రూపాయాల దాకా పెట్టడం -టీటీడీ వారి వ్యాపారదృష్టికే నిదర్శనం తప్ప -ఆధ్యాత్మిక దృష్టికి -సామాజిక భాధ్యతకి ఉదాహరణ కాదని ఓ సాఫ్ట్‌వేర్ అమ్మడు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతానికి అట్టపెట్టలకే డిమాండ్ కనడుతోందని యాత్రికులు చెబుతున్నారు. నిజమే, కాని నార సంచుల పేటెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న - కంపెనీలు రెండూ కూడా -మాకు గిట్టుబాటు ధర చాలా తక్కువగా ఉన్నదని వాదిస్తున్నాయ. జ్యూట్ బ్యాగుల అమ్మకాల నిర్వాహకులు -చెప్పిన దాన్ని బట్టి ఈ పాటికే మూడు లక్షల నార బ్యాగులు అమ్ముడైపోయాయి. అంటే ఒక లక్ష మీటర్ల అల్యూమినం లామిమేటేడ్ నారవస్త్రం ఖర్చు అయ్యింది. ఈ లోగా , యభైఒక్క మైక్రాన్ పోలిథిన్ బ్యాగులు కూడా దొరుకుతున్నాయి కనుక భక్తులు -కంగారు పడక్కర లేదని -అధికారులు ఓదార్పు సందేశాలు ఇస్తున్నారు. అదీ అర్థం చేసులోవాల్సిన మాటే.
రోజుకో డెబ్భై వేల బ్యాగులు కొండమీదకి అందాలి అంటే మజాకా కాదు కాని -్భక్తుల మీద ‘‘్భరం’’ వెయ్యడం తగదు అని ఓ బామ్మగారు కోప్పడ్డది. వెంకన్నకు సొమ్ములు తక్కువా? సంచులను కొంతనష్టం భరించి సప్లయి చేసి ఆ నష్టాన్ని శ్రీవారి ఖాతాలో వేస్తె తప్పేమిటి? అని చాలామంది ‘మిడిల్ క్లాస్ జనాల’ సణుగుడు వినవస్తోంది. పైగా దేవస్థానం ట్రస్టు కూడా ఈ సంచుల ఉత్పత్తి సంస్థలతో పాటు భాగస్వామ్య జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఆదిత్య బిర్లా గ్రూపు కంపెనీ సంచుల తయారీ భాధ్యతల్ని నెత్తిన వేసుకున్నది. నారసంచులు తయారీ ఒక కుటీర పరిశ్రమగా తిరుపతి ప్రాంత వాసులకు, పరిసరాల ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అధికారుల ఉవాచ.
ఓ అయిదొందల మంది స్కిల్డ్ వర్కర్లకి ఇది కొంగు బంగారం అయ్యిందని తిరుమలకు చెందిన ఒక న్యూస్ కంట్రిబ్యూటర్ స్కూపు. హిండాల్కో కంపెనీ మంచి హుషారు చూపెడుతోందని అభిజ్ఞావర్గాల భోగట్టా. ఈ నారసంచీల కి అవసరమయిన నారవస్త్రం -ఏడాదికి యాభై లక్షల మీటర్ల దాకా ఉత్పత్తి చేసే ఏర్పాట్లు రెడీ అయ్యాయని అధికారవర్గాల ప్రకటన. అంటే ఏడాదికి ఒక కోటి నుంచి కోటిన్నర దాకా శ్రీవారి ప్రసాదం కవర్లు తయారు అవుతాయి.. నా గపూరు దగ్గర ఉన్నది వీళ్ళ కర్మాగారం. అసలు ఈ ఉత్పత్తి లో భీముడి వాటా -ఏడుకొండలవాడికే కావాలి- దేశంలో ఉన్న మరో పది దేవాలయాల్లో -కూడా ప్లాస్టిక్‌ని తరిమేసే ఉద్యమం మొదయింది.
నిజంగా ఇండియాలో నార పరిశ్రమ ఇవాల్టిది కాదన్నాడు అయోధ్య రామారావు ఒకడు. ‘‘అసలు శ్రీరామచంద్రుడు అలనాడు పితృవాక్య పరిపాలన కోసం ఏమి దుస్తులు ధరించి దండకారణ్యం వనములకు సీతాలక్ష్మణ సమేతుడై ఏగెను’’? నారచీర కడితే స్నానం చెయ్యకుండానే మడి కట్టుకున్నంత గ్రేట్... కాకపోతే నార దుస్తుల్ని- అదే జానకి వల్లభుడు ధరించినట్లు చెప్పబడ్డ నార ఉడుపులను ఏల చీనీ చీనాంబరములు.. అన్నారు. బాబ్బాబూ గట్టిగా అనకయ్యా బాబూ. అర్జంట్ గా చైనావాడు - శ్రీలక్ష్మి భూలక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి రంగు రంగుల లడ్డూ సంచీలను తెచ్చి మార్కెట్‌లో డంప్ చేస్తాడు.. అన్నాడో రాజకీయ టీవీ చర్చా కోవిదుడు. ఏది ఏమైనా సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామీ ప్లాస్టిక్ రహిత ఇండియాని సృష్టించాలని పూను కున్నాడంటే, మోదీదే క్రెడిట్ అన్నాడో భాజపా ఫ్యాన్. ఐ ప్రొటెస్ట్ అన్నాడు కాంగ్రెస్ అభిమాని.. కాని -ఆ ఇద్దరికీ ఉన్న కామన్ ఫ్రెండు ఒకడు గొప్పగా ఇలా పట్టుకుని ఓ లడ్డూల నార సంచీని ప్రదర్శిస్తూ.. వచ్చి- ఇదె చూడుడు.. ఇదె మ్రొక్కుడు అంటూ ఘాటు వివాదానికి తెరదించాడు. అయితే సదరు భక్తుడు -వెంటనే ప్రసాదం పంపిణీ చేయ్యనన్నాడు. మా ఇంటి డ్రాయింగు రూముకుకి సాయంకాలం వచ్చేయండి.. అందరం చూసి తరించాక లడ్డూ ప్రసాద వితరణ మహోత్సవం జరుగునహో..! అంటూ మడి లడ్డూల సంచీ ని దాచేస్తూ..
ఈస్ట్ ఆర్ వెస్ట్ బాలాజీ లడ్డూ ఈజ్ ది మోస్ట్ మస్ట్!

-వీరాజీ veeraji.columnist@gmail.com 92900 99512