వీరాజీయం

ఉల్లి భారతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తంజావూరు జిల్లాలోని ఒక మొబైల్ షాపు యజమాని కస్టమర్లను ఆనందోత్సాహాలకు గురిచేశాడు. ఒక స్మార్ట్ ఫోన్ కొంటే కిలో ఉల్లిపాయలు ఉచితం అని ఆఫర్ ప్రకటించారు ఎస్‌టీఆర్ మొబైల్ షాపువారు. ఆశ్చర్యంగా ఉందా? ఇది వార్తే . ఉల్లిపాయల మీద జోకు కాదు. స్మార్ట్ఫును కొంటె హెడ్‌ఫోన్స్ ఉచితం... అంటారు లేదా ఒక మెమరీ కార్డు ఇస్తాము అంటారు. కాని గ్రేడ్ వన్ ఆనియన్స్ ఫ్రీ అని ప్రకటించాడా షాప్ యజమాని. ఆఫర్ వల్ల తన అమ్మకాలు అమాంతం ఐదు రెట్లు పెరిగాయని సదరు షాపు యజమాని చెప్పాడు. తమిళనాడులోని డెల్టా ప్రాంతమైన తంజావూరు జిల్లాలోని పట్టుకొట్టాయ్ వాచ్‌టవర్ దగ్గర ఉంది ఈ మొబైల్ షాప్. ఈ దుకాణంలో గత కొన్ని రోజులుగా- ఉచిత ఉల్లిపాయ...ఆఫర్‌తో మొబైల్ ఫోన్ల అమ్మకం అయిదురెట్లు పెరిగింది అని మిస్టర్ శ్రావణ్ కుమార్ విలేఖరులకు చెప్పాడు. ఆవేదనను వ్యక్తం చేయటం, జనాలతో పంచుకోడం మాత్రమే మా ధ్యేయం ఇందులో మాకు మిగిలే బంగారమేమీ లేదు.. ఈ ఆఫర్ ఉద్దేశం...అని యజమాని శ్రావణకుమార్ చెప్పాడు. ఉల్లిపాయల ధరలు కిలో 200 రూపాయలకు ఎగబాకాయని ఆయన ఉటంకించారు. మెమొరీ కార్డు కూడా అదే ధరకు లభిస్తుంది. కానీ ఇప్పుడు ప్రజలకు.. మెమొరీ కార్డు, హెడ్‌ఫోన్ల కన్నా ఉల్లిపాయలు ఎక్కువ అవసరం. అందుకే మేం ఈ ఆఫర్ ప్రారంభించాం...రెండు ఫోన్లు అమ్మే చోట అయిదు ఫోన్లు అమ్ముడు పోయాయి.. అని అంటున్నాడు.
తమిళనాడు వ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు కిలో 200 రూపాయలకు చేరాయి. ఒక్క తమిళనాడు మాత్రమేనా? అసలు దేశానికి కావాల్సిన ఉలిని ఎక్కువగా పండించి సరఫరా చేసే కర్ణాటకలో - ఒక్క బెంగళూరు మహానగరంలో ఉల్లిపాయ బంగారమైపోయింది. పైగా ఇది తినే బంగారం. తమ ముఖ్యమంత్రి యడ్యురప్పకి ఉల్లిపాయల దండ వెయ్యాలని షిమోగా విద్యార్థిని ప్రపోసల్ పెట్టింది. ఏటా పండే పంట ఈ ఏడాది లేదు- లేకపోతె ఇంట కటకటా లేకపోను అంటున్నారు మన పవిత్ర భారత దేశంలో. ఏటా కోటి యాభై లక్షల టన్నుల ఉల్లిపాయలు సాంబారులోకి సమోసాలోకి మాత్రమేనా? బిర్యాని లోకి గ్రేడ్ వన్ ఆనియన్స్ వుండాలి. చూడండి గొప్ప తమాషా -ఇప్పుడు పొలిటికల్ వార్తలలో హాట్ హాట్ గా వున్నా రెండు రాష్ట్రాలు మహారాష్ట్ర -కర్నాటక లలోనే ఉల్లిపాయలు పుష్కలం -కాని , అక్కడే ఉల్లికి కరువు ఏర్పడిపోయింది. బై ది బై -గ్రేడ్ వన్ అనగా మహారాష్ట్ర ఉల్లిపాయ లేనట. తరువాతి గ్రేడు-కన్నడ దేశానిదే. ఉల్లిపెసరట్టుకి ట్రేడు మార్కు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశం -ఇప్పుడందరూ -సమోసాలే ఆరగిస్తున్నారు అనుకోండి. సమోసాలే తింటున్నారు అంటే ఇవాళ రేపు -క్యూలో నిలబెడుతున్నారు. మనిషికి ఒక సమోసా -మాత్రమే అన్న దుకాణాలున్నాయి -ఏదీ.. మన ఉల్లిపాయలు ? థర్డ్ గ్రేడ్ రకం అని అంటారుట. కాని అవే ఇవాళ దుఖపెట్టేస్తున్నాయి. ఉల్ల్లిపాయని తరిగితే వచ్చేవి కూడా కన్నీళ్ళే కాని అవి కష్టార్జితమైన ఆనందభాష్ఫములు మాత్రమే- ఇప్పుడు -అది పేపరు కాగితం లాగ అతి బలహీనంగా వున్న ఆంధ్ర అప్పొజిషన్ చేతిలో -ఒక వెపన్ .. అనగా ఆయుధామైపోయింది. నిన్నటి ముఖ్యమంత్రి నేటి స్థితిలో -ఉల్లిపాయలు దండలు తానె ధరించి -తాను శ్రమించిన
అమరావతి పట్టణమున అసెంబ్లీ ముందు -ప్రదర్శనలకు దిగవలసిన మహర్దశ ఒకటి పట్టింది. అయ్యా చంద్రబాబూ గారూ .. మీరు హెరిటేజ్‌లో కిలో రెండువందలకి -ఉల్లిపాయలు అమ్ముతూ - మమ్మల్ని వుల్లిపాయల దండలతో కొట్టాలని చూస్తున్నారా? -అని కర్ణుడు మీదకి నాగాస్త్రం సంధించిన అర్జుని వోలె -జగన్మోహనుడు -మేము ఈజిప్టు టర్కీ ఉల్లిపాయలు సైతం సేకరించి రైతు బజార్లో కిలో పాతికరూపాయలకే ఇస్తున్నాము అనికూడా బెదరించాడు రాజశేఖర్ రెడ్డి తనయుడు. కాని ఇక్కడో రహస్యం బయట పెట్టాడు -మాజీ చంద్రుడు హెరిటేజ్ మాది కాదు, అమ్మేసుకున్నాము -అన్నాడు మాజీ కింగ్ మేకరు అయిన బాబుగారు. .
అవతల -తెలంగాణలో అవసరమైతే ఉద్యానవనాలలో ఉల్లి నారు పోసేస్తాము అంటున్నారు ఏలినవారు. హెరిటేజి మాది అని రుజువు చేస్తే -రాజీనామా చేసేస్తా నని - మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి కూడా ముఖ్య మంత్రిగా పనిచేసిన -మాజీ ముఖ్యమంత్రి -ప్రస్తుతం నారాలకే పరిమితమైన చంద్రబాబు నాయుడు గారు.
ఇదియిట్లుండగా, మరో పార్టీ వుంది. ఉన్నాను అని లేచి నిలబడే ప్రయత్నంలో -అదే హిస్టారిక్ అన్నాడు ఒకయంగ్ మాన్.. కాంగ్రెస్సు పార్టీ -సోనియా మాత పుట్టినరోజు కూడా క్యాన్సిల్ చేసుకున్నా -ఆ పార్టీ నేత -వి హెచ్ దిల్లీకి పోయి -అక్కడ తాత్కాలిక ప్రెసిడెంటు సోనియా గాంధీగారి పుట్టిన రోజు సందర్భంగా -ఒక బ్రహ్మాండమయిన ఉల్లి ఐడియాని ప్రేల్చాడు. ఉల్లిపాయల్ని సేకరించి- ఇదేమి మామూలు వ్యవహారం కాదు.. -ఒక వంద కుటుంబాలకి -పంచిపెట్టి పేపర్లలో ఉల్లి వార్తల ప్రక్కన చోటు కొట్టేశాడు. ఉల్లి భారతంలో -రసవత్తర ఘట్టాలు ఇటువంటివి చెబితే శానా వున్నాయి . వింటే ఓ ఉల్లిపాయ పకోడీ తినిపిస్తావా? అనడిగింది ఓ గాళ్ ఫ్రెండు..
సృష్టికి అంతటికి మొండి ఘటం మానవుడు. ఉల్లిపాయలు టర్కీ నుంచో ఈజిప్టు నుంచో- దిగడే లోగా బోలెడు -కార్టూన్లు -బోలెడు చిత్ర విచిత్ర వార్తలు ఏడుపు కనులకు ఓదార్పుగా -పేపర్లలో -టీవీలలో సోష మీడియాలో వీరవిహరం చేస్తున్నాయి- మొండిఘటం మానవుడు అగ్ని పర్వతాలు పగిలినా -వీడు కన్నీళ్ళతో ఆర్పుతాడు- గాలీ వానా వస్తే కొట్టు కొచ్చిన గొడ్డూ గోదాసొంతమని ప్రకటించి కులుకుతాడు అన్నట్లు -ఉల్లి లోటును -సెన్స్ ఆఫ్ హ్యుమోర్తో తట్టుకుంటున్నాడు. ఓ కిలో ఉల్లిపాయలు కూడా తీసుకు రండి-మీరు సకుటుంబంగా వస్తే -మీ కుటుంబంలో ఒకరికి ఫుల్ మీల్స్ ఫ్రీ అని ఓ హోటలు బోర్డు పెట్టిందిట. ఉల్లి లేని సాంబారు మాత్రమే-అని మరో భోజనశాల వారి ప్రకటన. ఇట్లా దేశం మొత్తం ఆబాలగోపాలం ఘాటెక్కిన ఉల్లి భారతంలో -ఉల్లి లేని లోటుని ద్ధైర్యంగా ఎదుర్కుంటున్నారు.
సెంట్రల్ గవర్నమెంటు కూడా -తక్షణం ఎగుమతులు నిషేధిస్తూ -ఆదివారం అయినప్పటికీ ఉత్తర్వులు జారే చేసింది.. అసలు ఓ రెండువారాల క్రితమే -ఎగుమతి రేటుని క్వింటాల్‌కి 850 డాలర్లకు పెంచేసింది. టర్కీ అయినా ఈజిప్టు -ఉల్లిపాయలు పంపించవలసిందే గాని -మనం ఎగుమతి చేయం. శ్రీలంక బంగ్లదేశ్‌లు ఈపాటికే ఇండియన్ ఆనియన్ లేనిదే మేము బ్రతకజాలం -దయచేసి నిషేధం ఎత్తేయండి అని గగ్గోలు మొదలెట్టాయి. ఉలిపాయలు నిల్వలు చేసి కాపాడటం కష్టం -అయినా బోలెడన్నీ నిర్బంధాలు తాజాగా విధించింది మోదీ గవర్నమెంటు. కేంద్రం 56,700 మిల్లియన్ టన్నుల బఫర్- అత్యవసర నిల్వలు పెట్టి అడిగిన రాష్ట్రాలకు -తగుమాత్రం అంద చేస్తున్నది. అటువంటి రాష్ట్రాలలోజ గన్మోహనరెడ్డి రాష్టమ్రొక్కటి- కిలో ఉల్లిపాయల కోసం క్యూలో చావుకష్టాలు పడా? అంటే మరి పాతిక రూపాయలకే కిలో ఉల్లి రత్నాలు కావాలంటే తప్పాదు అంటున్నార్ ఏపీ సర్కారు వారు .. ఇక ఉల్లిపాయలు ఎలాగో తంటాలు పడి దాచిపెట్టేవారిపై -దాడులు మొదలేడుతోంది కేంద్ర గవర్నమెంటు. బోలెడంత విదేశీ ద్రవ్యం ఆర్జిస్తున్నది ఉల్లి తల్లి.
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదు- అందుకే మన సామెతలు, సాహిత్యం కూడా ఉల్లి ఘాటుకు పరిమళ ద్రవ్య స్టేటస్ ఇచ్చి గౌరవిస్తున్నాయి- ఎగుమతులు ఆపినా చాలవు అంటాడు ఇండియన్ నాన్‌వెజ్ భోజనప్రియుడు. టమాటోలు లేకపోయినా ఇలాగే తిరుగుబాటు చేసేవారు భోజన ప్రియులు. హైదరాబాదులో ప్యాజ్ న్నమాట ప్యార్ అనగా ప్రేమ అన్న మాటకి పర్యాయ పదంట . ప్యాజ్ అనగా ఆనియన్. ఎవరయినాసరే -వంద క్వింటాళ్ళ కన్నా ఎక్కువ నిల్వ ఉంచుకుంటే.. నోక్కేస్తారు- వాడే పక్షం మర్చంట్ అయినా -నో మెర్సీ అనగా పలుకు బడి చెల్లదు- ఇవతల ఉల్లి కష్టాలు జనవరి నెలాఖరు దాకా జనాలు -్భరించాలి- అప్పో సప్పో -చేసి కిలో రెండు వందల దాకా పెట్టి కొనుకోవాలి.. ఇంతకీ -ఏ షాపులోనైనా చిల్లర లేదు అన్టా డనుకోండి -ఓ రెండు పెద్దసైజు ఉల్లిపాయలు పడేయండి అని అడగాలి .. అందుకే వేదభూమి భారతంలో -ఆది నుంచి ఉల్లి పాయల వాడకం మీద ఆంక్షలు విధించి నిల్వలు కాపాడే వారు . శనివారం తినకూడదు .....
తద్దినాలకి, వ్రతాలకి ఉల్లిపాయల్ని తీసి దూరంగా దాచేయ్యాలి- ఒకప్పుడు దేశం లో గంగా భాగీరథీ సమానురాలయిన మహిళలు ఉల్లిపాయని వాసనా కూడా చూడరాదన్నారు. అట్లా , బోలేడు ఉల్లి పాయలను ఆదా చేసే వారు . కానీ రోజులు మారియి. ఉల్లిపాయల నిల్వలు మాత్రం -పెరగటం లేదు. క్రిస్మస్ తాతకి పిల్లలు ఇండెంటు పెట్టుకుంటున్నారు- న మాంగే పిజ్జా-- చాక్లేట్స్ మాంగే ఆనియన్స్ తాత -అని కోరస్‌గా అవతల పాడుతున్నార్- వినండి .
బై... బారో... ఆర్ స్టీల్... ఆనియన్స్ లివ్ లాంగ్...!

-వీరాజీ veeraji.columnist@gmail.com 92900 99512