వీరాజీయం

రోజురోజుకూ మరింత మోజు.. ‘కిల్ఫీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సెల్ఫీ’ అన్నమాట కూడా ‘టాక్సీ’ అన్న మాటలాగే ప్రపంచ వ్యాప్త భాషలన్నింటా చోటుచేసుకుంది. అసలు మొబైల్ ఫోన్‌లు వున్నదే సెల్ఫీలు నొక్కుకుందుకీ, అలా నొక్కుకుంటూ ప్రాణాలమీదికి తెచ్చుకోవడం కోసం మాత్రమే అవి- అని జనాల నమ్మకం. దానికో ముద్దుపేరు కూడా పెట్టారు కొంతమంది ఔత్సాహితులు. ‘కిల్‌ఫీ’ట!
‘కిల్ఫీ’ అంటే చావచంపిగాని వదలిపెట్టని ‘హాబీ’ అని వార్తల్లోకి ఏ రోజు అయినా తొంగి చూస్తే అందరికీ అర్థమయిపోతుంది. వారంగా వార్తలు చూస్తే ఇంకా బాగా అర్థం అయిపోతుంది-
ఈ నెల రెండో తారీఖున ముంబాయి ఆసుపత్రిలో పాము కాటుకి ఇరవై ఏళ్ల కుర్రాడు- పేరు సోమంత్ మహత్రే- మృత్యువుతో పోరాడలేక వోడిపోయాడు. అతని ప్రాణం తీసింది, అతని సెల్ఫీ సరదాయే!..
ఈ యువకుడికి ఫేస్‌బుక్ అకౌంట్ వుంది. ఈ మాయదారి అకౌంట్ రకరకాల వింతలు చేయిస్తూంటుంది మన చేత. సోమంత్‌కి పాముల్ని పట్టుకోవడం, వాటిని ఆడించడం అంటే గొప్ప సరదా. ఇతని టైమ్‌లైన్ నిండా రుూ పాములతో అతనాడే సరసాల బొమ్మలే వుంటాయి. ఒక భయంకరమైన త్రాచుతో చెలగాటం సాగించి దాన్ని పట్టుకున్నాడు. దాన్ని ముద్దుపెట్టుకుంటూ సెల్ఫీ దిగాడు. దాన్ని ఫేస్‌బుక్‌లో పెట్టి ‘లైకు’లు, ‘శభాష్’లూ కొట్టేయ్యాలిగా మరి?
ఐతే, ఆ త్రాచుపాముకి మనవాడి హాబీ నచ్చలేదు. అయినా, బదులివ్వకపోతే బాగోదు అని మనవాణ్ని కోరలు దించి ఓ ముద్దు- అది చాలాదా? అన్నట్లు ఛాతీమీద మరో ముద్దు ‘కాటు’ వేసింది. ఇదంతా అతను సెల్ఫీ తీసుకోవడం కోసం దాన్నట్టే ఓ చేత బట్టుకొని రెండో చేత ‘స్మార్ట్ఫోన్’ పట్టుకొని సెల్ఫీ తీసుకుంటూ వుండగా జరిగింది! పాము జారిపోయింది. కానీ సోమంత్ మాత్రం ఆసుపత్రి పాలైనాడు. అతని పాలిట అతని ‘సర్ప సెల్ఫీ’ ఒక ‘కిల్‌ఫీ’గా మారింది.
పాముల్ని పట్టినా, అడవి పులుల్ని వేటాడినా వాటితో సెల్ఫీ సరసాలాడటానికి కాదు- అని ఎవరు చెబుతారు ఈ తరానికి? అయితే ఎవరు మాత్రం ‘‘ఒరేయ్! పులి నోట్లో బుర్రపెడుతూ ఓ సెల్ఫీ కొట్టుకోరా!’’ అని చెప్తారా? సెల్ఫీలతో పాపులర్ అయిన ప్రజానాయకుల శ్రీమాన్ మోదీగానీ, బారెక్ ఒబామాగారు గానీ ‘సెల్ఫీలు మీ ఆడపిల్లల్తో దిగండి. ఆత్మీయులతో, ఫ్రెండ్స్‌తో అదీ సురక్షితంగా వున్న యింట్లోనో, కొండమీద గుడి ప్రాంగణంలోనో సెల్ఫీలు కొట్టుకోండి అన్నారు. అంతే. ఆనక వాటిని చూపెట్టి అడిగినవాడికీ, అడగనివాడికీ కూడా లేని కోరమీసాలు మెలివేయండి’’- అని సూచిస్తారేగానీ, ‘‘ఒరేయ్! ‘జూ’లో దూరి, పులి తోక పట్టి లాగుతూ సెల్ఫీ కొట్టుకురారా, నీకు బిర్యానీ పార్టీ యిస్తాను’’ లాంటి ప్రగల్భాలూ ప్రామిస్‌లూ చెయ్యమని ఎవ్వరూ చెప్పరు కదా?
‘‘ఈ సెల్ఫీని ‘కిల్ఫీ’ అన్న ముద్దుపేరెట్టుకున్న యువజనంలో సాహసోపేత దుర్మరణాలు చదివినాక కూడా జనాలకి దీనిమీద మోజు చావటంలేదు’’ అని ఒక బామ్మగారు వాపోయింది.
‘‘నీ కాలంలో వైఫైలూ, సెల్ఫీలు లేవు. నీ సాహసం అంతా దొడ్లో ఆవు పాలు పితకడం దాకానే రోజులు మారేయి బామ్మా?’’ అంటుంది మనుమరాలు. బైదిబై రుూ సెల్ఫీ మరణాలు మన పవిత్ర భారత దేశంలోనే చాలా ఎక్కువ అని గణాంకాలు గణ గణమంటున్నాయి. ఐదు నెలలు తిరిగేలోగా మన సోమంత్ లాంటి సర్పప్రియులు- నాగుపాముల పడగల క్రింద దూరి సెల్ఫీలు కొట్టుకుంటూ ‘నాగ’లోకమో ‘నాక’లోకమో చేరిపోయి తల్లిదండ్రులకు రుూ భూమీద ఒక నరకయాతనను బోలిన దుఃఖాన్ని వదిలివెడుతున్నారు.
ఈ ఏడాది మొదట్లోనే రైలుబండీ వస్తూంటే దానికడ్డంగా నిలబడి సెల్ఫీలు దిగుతూ- పచ్చడయిపోయి రికార్డుకెక్కిన నలుగురు యువకులు- ఒకడు కోయంబత్తూరులో, మరొకడు బెంగాల్‌లో, తతిమ్మా యిద్దరూ న్యూఢిల్లీలో- హైదరాబాద్ దగ్గరి కొత్వాల్‌గూడా మైనింగ్ ఏరియాలో మరో యిద్దరు సెల్ఫీ ప్రియులు నీటి వాత పడ్డారు.
‘‘పిక్‌నిక్‌లకీ, విహారయాత్రలకీ పిల్లల్ని ఎత్తుకుపోడం’’ అంటే (తీసుకొనిపోడం) పై ప్రాణాలు పైనే ఎగిరిపోతున్నాయ్’’ అన్నదొక బడిపంతులమ్మ. కానీ ఆ టీచర్లతోనే రుూ కుర్రాళ్లు కాసేపటికి కలివిడిగా జలపాతానికి ఎదురు రుూదుతున్నట్లు ఫొటోలు దిగుతారు- రుూ కాలం యువతరం అంటే మజాకా? కాదు తడాఖా!
ఇంటర్నెట్ పిచ్చోళ్లు, సెల్ఫీ వ్యామోహిత సాహసికులు అని నిత్యం చెప్పుకుని దుఃఖించడంకన్నా జనాన్ని డైవర్ట్ చెయ్యడం బెటర్.. చట్టబద్ధమయిన ఆంక్షలు పెట్టడం- జనాకర్షణ గల రాజకీయ నాయకులు, సెలబ్రిటీస్- వీటిని నిరసించి, నీరసింపజేయడం చాలా అవసరం. పర్వతాలెక్కడం సాహసమే గానీ పర్వత శిఖరంమీద వ్రేలాడుతూ సెల్ఫీ దిగడం అన్నది దుస్సాహసం-
‘‘పర్యాటకులు చాలామంది కేవలం సెల్ఫీలకోసమే మా రాష్ట్రానికి వస్తారన్నది’’ కేరళ గవర్నమెంట్. అంచేత బ్యాన్ అంటే సారీ! మా ఆదాయం ‘్ఢం’ అంటుందని భయం.
ఒక ఢిల్లీ సంస్థ, మరొక అంతర్జాతీయ సంస్థా కలిసి సర్వే చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆఖరికి- లిబర్టీ విగ్రహం దగ్గర, ఐఫిల్ టవర్ కటకటాల మీదా వ్రేలాడి సెల్ఫీలు దిగి చచ్చిపోయిన సాహసుల్ని సైతం లెక్కేసుకున్నా కూడా- ఇండియాలో గత రెండున్నర సంవత్సరాలలో ‘కిల్ఫీ’కి బలైపోయిన వారి సంఖ్య మిగతా లోకంకన్నా ‘రెట్టింపు’- ఇండియా దటీజ్ భారత్‌లోనే వున్నది.
అసలు టీవీ నొక్కండి. ప్రపంచంలో యింకేవీ లేనట్లు మొబైల్ ప్రకటనలే కుమ్మేస్తాయ్. కేవలం రొమాన్సింగ్ కోసం- సెల్ఫీలు కొట్టుకోవడం కోసం మాత్రమే యిన్ని రకాల స్మార్ట్ ఫోన్‌లు, సెల్‌ఫోన్లు తయారవుతున్నాయి అన్న భ్రమ కలిగిస్తాయి- రుూ ‘యాడ్’లు. రోజురోజుకీ వెఱ్ఱితలలు వేస్తున్న రుూ ‘రంగు రంగు రంగేళీ’ ప్రకటనలుమీద మొట్టికాయలు కావాలి. మోదీగారు చెప్పినట్లు సెల్‌ఫోన్‌లు క్యాష్‌లెస్ సొసైటీకి తరుణోపాయాలు. ఆన్‌లైన్‌లోకి జనాల్ని మార్చండి రుూ ప్రకటనల్ని.
హై.బా పాతబస్తీలో చార్‌మినార్ మరో సెల్ఫీ ఆకర్షణ. అక్కడ రోడ్డుమీద ట్రాఫిక్ చిక్కులు పడ్డ దారంలాగా వుంటుంది. చక్రాల బండ్లు మ్రింగేసిన జాగాయే రోడ్డు అంతా. ఈమధ్యలో దూరి సెల్ఫీలు దిగుతూంటారు.
‘‘చార్మినార్ కూలిపోద్దా, ఏంటి?’’ అంటూ ధైర్యంగా నవ్విందో అందాల బొమ్మ. ‘‘చార్‌మినార్ కూలదుగానీ కారు, బస్సు, మొబైక్ లాంటివి నీ మీదకెక్కి మట్టేస్తాయ్’’ అని చెప్పాడో పోలీసు.
‘‘అక్కడ సెల్ఫీలు బ్యాన్ చెయ్యాలి’’ అన్నదో యిల్లాలు. సెల్ఫీగాళ్ళు వాహన చోదకుల పాలిట స్పీడు బ్రేకర్‌లైపోయి- ఒక్కోసారి వాళ్లని బోల్తా కొట్టిస్తున్నారు అని సరదాగా అటుపోయే లోకల్స్‌కి కూడా తెల్సు. ఆమధ్య ముంబాయిలో కొన్ని జంక్షన్‌లలో సెల్ఫీలకి ‘దేవిడీమన్నా’ విధించారు. జంట నగరాలలో పర్యాటక కేంద్రాలే కాదు చౌరస్తాలు కూడా సెల్ఫీగాళ్లంటే వొణుకుతున్నాయి.
బెటర్ రెగ్యులేట్ దెమ్ హియర్ అండ్ నౌ!
*