వీరాజీయం

అక్కడ ‘స్పీడ్ బ్రేకర్’లుండాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యు ట్యూబ్ రెండువైపులా ‘వాడి’గల కత్తి. ‘యూట్యూబ్- వైరల్’- ఈ మాటలు అరిగిపోయినంత యిదిగా నిత్యం వినబడుతూంటాయ్. కానీ, రుూ ట్యూబ్ విశేషాలు నిత్య నూతనాలు. గట్టిగా చెప్పాలీ అంటే నిత్య దారుణాలు. అది ‘‘వైరల్’’అయిపోయింది- అంటే, చూస్తేచాలు జన్మ కలుషితమైపోతుంది. చూస్తే చాలు భయం, గగుర్పాటు- రక్తనాళాల్లో జలతరంగిణి వాయిస్తుంది’- అనిపిస్తుంది. ‘నమో’గారు ‘అరచేతిలో బ్యాంకింగ్’ యిచ్చిన తరువాత సదరు అమూల్య అనుభవంతోపాటే మరికొన్ని లక్షల లేక కోట్లమందికి అరచేతిలో యూట్యూబ్- నిత్య పారాయణకు వీలుగా అమరిపోతోంది-
‘‘హావ్ టు కాపీ యిన్ ఎగ్జామ్స్?’’ అనడగండి- గూగుల్‌గారు మీకు కావలసినన్ని యుట్యూబ్‌లు సప్లయ్‌చేస్తారు. ఆమాటకొస్తే మీ పిల్లవాడి కన్నీ యివేకాదు- ఎన్నో మీరు కనీవినీ ఎరుగని అభ్యంతరకర, అశ్లీల, అపసవ్య, విపరీత వీడియోలు- మీ స్మార్ట్ఫోన్‌లోనుంచి- మీ కనులు గప్పి- చూసేస్తూంటారు పిల్లలు. దాని సందర్భం ఒకటి ఎందుకొచ్చిందీ అంటే- అవధరింపుడు..
మన అత్యున్నత న్యాయస్థానం- రుూ బుధవారం నాడు ఒక సీరియస్ డౌట్‌ను బయటపెట్టింది. పైగా, ఇద్దరు అనుభవజ్ఞులైన సుప్రీం న్యాయమూర్తులు- ఒక ‘్ధర్మాసనం’గా కూర్చుని, ఈ ప్రశ్నవేశారు. నేరుగా గూగుల్‌ని ఉద్దేశించిన ప్రశ్న ఇది. ‘‘అత్యంత హేయమైన అశ్లీలమైన సెక్సు, హింస వగైరా దృశ్యాలు ‘యూ ట్యూబ్’లో కెక్కిపోయి, అత్యధిక సంఖ్యాకుల్ని భ్రష్టుపట్టించడం, బద్నాం చెయ్యడం- పైగా దుర్మార్గుల్ని చెయ్యడం లాంటివి జరిగిపోతున్నాయి కదా? ఇటువంటి ప్రమాదకరమైన చెత్తని ‘యు’లోకి ఎక్కకుండా లేదా వెబ్‌సైట్లలోకి ప్రవేశించకుండా నిలవరించే మార్గమేదీ గూగుల్ దగ్గర లేదా?’’అని అడిగారు పెద్దలు.
ఎందుకంటే చెత్త వీడియోల ఎగుమతికి ఇంటర్‌నెట్ సర్వీసుని సరఫరాచేసేది గూగుల్ సంస్థయే కదా? కనుక ధర్మాసనం ముందుకు వచ్చిన ఒక కేసును గూగుల్ ఇండియా సంస్థ తరఫున వాదించటానికి వచ్చిన, ఆ సంస్థ న్యాయవాది అభిషేక్ మనుసంఘ్వీని- అమాయకంగానైనా సూటిగా ప్రశ్నించింది- ధర్మాసనం. దానికి, ఆ గడుసు లాయర్ టక్కున (గూగుల్ తరఫున) జవాబు చెబుతూ- ‘‘యువరానర్! గూగుల్ యిటువంటి వ్యవహారాల్లో బేషరతుగా సహకరిస్తుంది. అలా చెయ్యడానికి సిద్ధంగాకూడా వుంది’’- ‘అన్నాడు’. ‘‘అయితే’’-అంటూ సంఘ్వీ కొనసాగించాడు తన సన్నాయి నొక్కులను.- కాకపోతే రుూ అభ్యంతర చెత్తని సదరు గవర్నమెంటు తరఫున గానీ, అటువంటి బాధ్యతాయుతమైన సంస్థ- అంటే న్యాయస్థానాలు గానీ ‘రిపోర్టు’ చెయ్యాలి. అప్పుడు మావాళ్లు దాని గురించి తరచిచూసి- ముప్ఫయిఆరు గంటల వ్యవధిలోగా, ఒక నిర్ణయానికొస్తారు’’ అంటూ పూర్తిచేశాడు.
అంటే, వాళ్లంతటవాళ్లు తమ చేతుల్తో రుూ పుణ్య (పాప?) కార్యం చెయ్యరన్నమాట. అవును మరి! రుూ అభ్యంతర సంఘవ్యతిరేక వీడియోల ‘యు ట్యూబ్’మీద, ప్రతీ అంశానికీ ముందు ఓ ప్రకటన వుంటుంది. లేదా యింకా ఎక్కువ ప్రకటనలుంటాయి. పాటలు, పద్యాలు, శ్రుతులు వగైరా అయితే మధ్యలో పాట ఆగుతుంది. పాట ఆగిందా? అంటే- ‘యాడ్స్’ తగుల్కున్నదన్నమాటే.
అంచేత ‘యూట్యూబ్‌లో- ఒక సినిమా నటి మీద, ఆమె సొంత కారులో అత్యాచారం చేస్తున్నట్లు వీడియో అప్‌లోడ్ అవుతుంది- సాధారణంగా. అది వైరల్ అయిపోతేనే దానికి ‘‘అప్‌లోడ్ వేల్యూ’ ఎక్కువగా వుంటుంది. కానీ సోషల్ మీడియా మీద ఎందరికో (కొందరికే కాదు అని అర్థం) డోకులు, వాంతులు, కోపోద్రిక్త ఉన్మాదం లాంటివి కలిగించే విపరీత, విపర్యయ, సెక్సువైపరీత్య సరుకు వున్న వీడియోలను ‘వడగట్టడానికి’ అంటే ఫిల్టర్ చెయ్యడానికి గవర్నమెంట్ ఓ ‘నోడల్ ఏజెన్సీ’ పెట్టే ప్రయత్నం చేస్తుందని కూడా సుప్రీంకోర్టువారికి లోగడ గవర్నమెంటు సమాచారం పంపింది.
ఐతే, అదెప్పటికి తేలేనూ? ‘గూగుల్’, ‘మైక్రోసాఫ్ట్’ ‘యాహూ’, ‘ఫేస్‌బుక్’వగైరాలు పరమ చెత్త, అశ్లీల వీడియోలమీద ఆంక్షలు పెట్టలేవా? అంటూ, పోయినేడాది డిసెంబర్ 5న. వొక కేసు సందర్భంగా, ఉచ్చతమ న్యాయస్థానం అడిగింది. ఎక్కడో చీమలు దూరని చిట్టడవులలో లేదా - అతి గోప్యమయిన పడక గదులలోనూ సంభవించే- సంఘవిద్రోహకర ఆలోచనలను, చేష్టలను ప్రోత్సహించే దృశ్యాలను కళ్లకుగట్టినట్లు చూపెట్టేసే ‘యుట్యూబ్ వీడియోలు’ ఎలా తయారు అవుతున్నాయి?
ఉదాహరణకి, ‘‘శశికళ జయలలితమ్మను కొట్టి, నేల మీదకు త్రోసేసినట్లు వైరల్ అయిపోయిన వీడియోనే తీసుకోండి.. అదెలా సంభవం? పోనీ, అదప్పుడే విడుదలై వైరల్ అయిపోతే, కథ యింత దారుణంగా సాగేది కాదుకదా?’’అంటూ ఓ ఇల్లాలు ప్రశ్నించింది. అవును! కోర్టువారికి యిటువంటి వీడియోలు ‘స్యూమోటో’ (వాళ్లంతవాళ్లే) కేసుగా నమోదుచేసి విచారిస్తారుగా? ఉదాహరణకి, పోయినేడాది హైదరాబాద్‌నుంచి ఓ ‘సంఘ సేవకుడు’ అభంశుభం ఎరుగని పసివాళ్ల అశ్లీల వీడియోలను సప్లయ్ చేస్తున్నట్లు కనుగొని- ఒక ఎన్.జి.ఓ. (ప్రజాహిత సంస్థ) నేరుగా, ఓ రెండు సదరు వీడియోలను- పెన్‌డ్రయివ్‌లో పెట్టి చీఫ్ జెస్టిస్‌గారికే ‘టపా’లో పంపించేస్తే- దాంతో తీగ లాగబడి, డొంకంతా కదిలింది. ఐతే, కోర్టులలో జరిగేది ‘విచారణ’మాత్రమే. ‘నివారణోద్యమం’కాదు. చాలా టైము పట్టేస్తుంది. ఈలోగా యూట్యూబులలోకి ఎక్కిపోయి- ఉచితంగా, ఉదారంగా ‘హియర్ దేర్ అండ్ ఎవ్విరివేర్’- వైరల్ అయిపోతున్న జాడ్యాన్ని ఎలా అరికట్టాలి? ఓ కాలేజి అబ్బాయి- (బుద్ధిశాలి బూర్లగంప అన్నమాట)- అన్నాడు. ‘‘చట్టంచెయ్యాలి గవర్నమెంట్’’ అని-
ఔనా? చట్టాలు, చట్రాలు- వీటికున్న పవర్ ఎంత? ముంతకి కనులు, చెవులు వుండవన్నట్లుంటుంది. అసలు ‘యుట్యూబ్’లోకి ఎక్కించడానికి ఎవడుపడితే వాడు- ఏదిపడితే అది- అప్ లోడింగ్‌కి- నియమం, నిబంధనం, లిమిట్, లిస్టూ ల్లాంటివేమీ లేవా? ‘‘స్వచ్ఛ్భారత్ అభియాన్’’లాగా- స్వచ్ఛ యూట్యూబ్- అభియాన్ మొదలుపెట్టమని మోదీ సారుని అడగాలండీ’’- అన్నాడు- కరాటే పేరిట పిల్లలకి ఏవేవో స్టంటు విన్యాసాలు నేర్పిస్తూ- నాలుగురాళ్లు ఆర్జించుకుంటున్న ఓ ‘‘అపర బ్రూస్‌లీ!’’-
‘‘పిచ్చివాడా! ఇది ఒకటీ ఇంటర్నేషనల్ ఇస్స్యూ. రెండూ, స్వచ్ఛ్భారత్ ఉద్యమంకోసం మనం టాక్సు కడుతున్నాం. ఇక అప్పుడు యుట్యూబ్ సర్వీస్ టాక్సుని (చూసిన వాడిమీదా?!) పడే ప్రమాదముంది. అంచేత యుట్యూబ్‌లోకి అప్‌లోడ్ చెయ్యడానికి పూనుకున్నవాడి చిరునామా, అడ్డా, వృత్తి, వ్యాపారం వగైరాముందు పోస్ట్ చేస్తేనే- అప్‌లోడింగ్‌కి అనుమతివ్వాలి. ఇక లోగడ - టెలిఫోన్ నెంబర్ యిస్తేనే వీడియోలు అప్‌లోడ్ అయ్యేవి. కాని, ‘యాడ్’ల వ్యామోహంలో యిప్పుడు- అడ్డగోలుగా, ఏదైనా అప్‌లోడ్‌కి అర్హమే!
అవును పాపం! యూట్యూబ్‌లోకి రోజుకి 65వేల వీడియోలు (అన్నీ సక్సేషనల్, వైరల్ కావుగానీ) అప్‌లోడవుతున్నాయని, అధికారిక సమాచారం. కాకపోతే ఏవేవో రూల్సున్నాయి. గానీ, గేట్లు బార్లా తెరిచిపెట్టి- ‘‘లోనికి రారాదు’’-అన్నట్లున్న బోర్డుని, లోపలికొచ్చేశాక చూపెట్టినట్లు- ఆ రూల్స్‌అన్నీ శుద్ధ వేస్ట్. కాబట్టి యూట్యూబ్‌లోకి ‘ఇన్‌సెస్టు’, పెరవర్టెడ్, వయొలెన్స్ వగైరా- డోసు ఎక్కువగావున్న వీడియోలను సోషల్ మీడియాలోకి డౌన్‌లోడ్ చేయడం దగ్గర స్పీడు బ్రేకర్లను పెట్టాలి. దీనికి మహిళాలోకం నిద్దుర లేవాలి. ఉదాహరణకి శని దేవాలయంనుంచీ శబరిమలైదాకా ప్రవేశానికి- తృప్తిదేశాయ్ వంటి సాహస యువతులు ఉద్యమిస్తున్నారే- వాళ్లకీ వైరల్ వ్యాధిని అరికట్టే ఉద్యమం ఓ లెక్కలోకి రాదు- తలుచుకుంటే- అంటోందొక సీనియర్ ‘సిటిజనమ్మ’!
‘లెట్ దేర్ బి మోర్ స్పీడ్ బ్రేకర్స్ ఫర్ అప్‌లోడింగ్!’ *