వీరాజీయం

ఊరకుక్కలను పెంచండి! ధన్యులు కండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుక్కలయందు ఊరకుక్కలు వేరయా? అన్నాడు కవి-ఇంటింటి కుక్కలు ఇల్లు వదిలి రావు. ఊర కుక్కలు వీధి వదిలిపోవు. హైదరాబాదు జంట నగరాల్లో కుక్కలు సామూహిక జీవులు. చౌరస్తా అయినా ట్రై జంక్షన్ అయినా గుంపులుగా తిరుగాడుతాయి-మిగతా సిటీలలో కూడా అవి అటులే తిరుగుచుండునని అందరికీ తెలిసినా-మహానగరం కుక్కలు స్పెషల్-ఆసుపత్రులలో ఊర కుక్కల బెడద. ఇదే వార్తల యందు నిత్యమూ నూతనము ఔనా? ఓ! మనిషీ నువ్వు నిన్ను, నా సిటీఫ్రెండు దోమనీ ఏమీ చేయలేవు అన్నట్టు ఆసుపత్రినుంచి పురిటి బిడ్డని ఎత్తుకుపోయి లేదా బడికి పోయే పిల్లల్ని వెంచబడి కరిచేసో వార్తలకి ఎక్కుతూ ఉంటాయి. పొద్దునే్న ‘మార్నింగ్ వాక్’ (అంటే ఈవ్నింగు కాదు అని అర్ధం)కి వెళ్తే-వాకర్స్‌తోపాటు శునక్ సందడి కూడా బోలెడు కనబడుతుంది. ఎవరిచేతనైనా బెత్తం ఉన్నదీ అంటే-ఆ బెత్తం బట్టిన చేతి వెనుక గానీ మ ఉందుగాని ఓ శ్వాన రాజము-దర్శనమిస్తుంది. దాన్నిచూసి దాని యజమాని లేదా యజమానురాలు ఎంత సంపన్నులో మనమ్ కొంచెం అనుభవముంటే తెలుస్కోగలము. ఎవరి కుక్క వారికి ముద్దు, కాకపోతే పక్కవాడికి మాత్రం అల్లెర్జీ. కుక్కలకి రేటు పెరుగుతోందే గాని తగ్గదు-ఒక జాతి కుక్క-అది ఆడ కుక్క అయితే మేలు-యజమానికి ఏడాదికి రెండుసార్లు పిల్లలనిపెట్టి బోలెడు బేరాలు తెచ్చిపెడుతు వుంటుంది.
ఓ కుక్క పనె్నండు నుంచి పదిహేను సంవత్సరాలు బతికి ఇంట్లో అయితే యజమానికి అతని ఇంటి వాచ్‌మెన్‌కి కూడా తోక ఊపుతూ స్నేహాన్ని ఇచ్చును. ఈ సంగతి ఇవాళ పొద్దునే్న వార్తలలో ఫ్రముఖంగా తెలిసింది. ‘వీధి కుక్కలనీ...ఊర కుక్కలని...మమ్ము తక్కువ చెయ్యకూ ఆడకుక్కనస్సలు కించపరచకూ’ అంటూ ఓ డాగ్ లవర్-అతని కుక్కని చూసి పక్కకి భయంగా తప్పుకున్న మా వాడిని సినిమా పాట స్టైల్లో హెచ్చరించాడు. ఏటా కుక్క ఓ ఈతకి ఆరునుంచి పనె్నండు పిల్లల్ని పెడుతుందని పోయిన శుక్రవారం అధికారికంగా పత్రికా విలేఖరుల్కి వెటర్నరీ శాఖల అధికారులే వివరించారు. ఈ విధంగా ఓ పబ్లిక్కు శునకము జీవన కాల సాఫల్యం నాలుగు వేలకి తక్కువ కాకుండా సంతానాన్ని మానవాళికి ప్రసాదిస్తుందని వెల్లడి చేసారు. ప్రైవేటు కుక్కల సంతానం లెక్కలు ఇందులో చేర్చబడలేదని అనుకోవాలి. పైగా ఇది కుక్కలకి సీజనుట.
ఔను, వీధి వెంట కుక్కలను ఓ కంట గమనిస్తూ, పోతూవుంటే గ్రామాల్ వెంబడి కోడిపెట్టలు చిన్ని చిన్ని పిల్లల్ని (కోడిపిల్లలనే సుమా)ని వెంటేసుకుని సందడి చేస్తున్నట్టు ఇక్కడ వీధుల వెంట కుక్కపిల్లలు-ఇంచక్కా ముద్దులు ఒలుకుతూ గంపలోనుంచి ఒలకబోసిన పండ్లలాగే కనబడుతాయి. మనం ఏమారి వున్నామంటే మన వెంట పడతాయి. మనిషికి ఆది కాలం అదే భారత కాలంనుంచి కూడా కుక్క ‘కంపెనియన్’ అని అందరికీ తెలుసు. ధర్మరాజుతో స్వర్గానికి వెళ్లినదెవరు? ద్రౌపదా? కాదు. అదిసరే ప్రస్తుతం సిటీ కుక్కలను దత్తత స్వీకారం అందరూ ప్రోత్సహించాలంటూ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ వారు కోరుతున్నారు. దీనికి ఓ ప్రోసెస్సు ఉంది. పోయిన ఏప్రిల్‌లో ‘ఇంటికోనేస్తం’గా ఊరకుక్కని ఒకదానిని అధికారికంగా దత్తత తీసుకోమన్న ఉద్యమం వారు మొదలుపెట్టారు. అనవసరంగా వేలకి వేలుపెట్టి విదేశీ జాతి కుక్కల్ని కొని వాటికి సగం నెల ఆదాయం పెట్టి పోషించుతారు? ఊరికే దొరికిన కుక్కపిల్లని మేము దానికి వ్యాధినిరోధక సూదిమందులు ఇచ్చి మరీ దత్తత ఇస్తాము తీసుకోండి-అని ప్రచారం చేస్తూ నగరంలో లోగడ తెరిచిన ఐదు కుక్క దత్తత కేంద్రాల ఫ్రగతికి నూరురోజులు నిండిన సందర్భంగా సిటీ వెట్ కమిషనర్ గమనించగా వందరోజుల్లో వెయ్యి వీధికుక్క పిల్లల్ని-ప్రేమగా ఉచితంగా దత్తత స్వీకరించారట. వేలకి వేలు తగలేసి జాతి కుక్కలంటూ విదేశీ శునకములను కొనకండి-మన కుక్కలనే ఆదరించండి అంటున్నారు. వెయ్యి కుక్కలనగి ‘మా ఇంటి నేస్తం’ పేరిట తీసుకుపోయిన వారినిన ఈ సమావేశం అభినందించాలి మరి. ఇవి గాలికి ధూళికి పుట్టి చెత్తకుప్పల మీద వృద్ధి చెంది ఉంటాయి కనుక వీటిలో రోగ నిరోధక శక్తి , మన వెదర్ని సదా ఇష్టపడతాయి. ఏమిపెట్టినా తింటాయి. వీటికోసం ఖరీదైన తిండి కొనక్కర్లేదు. ఏమి మనం పెట్టినా తింటాయి తోక వూపుతాయి. మేనకా గాంధీ గారు పప్పువొన్నం పెడతారుటండి!
మరి ఎందుకనీ విదేశీ మోజు? సిట్ స్టాండ్ అంటూ ఇంగ్లీషు మాట్లాడనక్కరలేదు. సీజర్ రోజర్‌లని పేర్లు అక్కరలేదు. రారా రాజా అన్నా రావోయ్ హీరో అన్నా బంతీ చామంతీ అన్నా పలుకుతాయి. నాన్నగారిని లేపు ఆఫీసుకువేళ అని అంటేఅనో-లేదా అమ్మని లాక్కురా నాన్న రామంటున్నాడని అఅంటే ఇంచక్కా కుంయ్ కుంయ్ మంటూ చెప్పిన మాట వింటాయి. తెలుగు సీరియల్సు కూడా టీవీ ఆన్ చేస్తే చూస్తాయి.’’ మాఇంటి నేస్తం అని తెలుగులో గొప్పగా చెప్పుకోవచ్చు. కాని, ‘మమీ! ఇది రోడ్డు సరుకు అని చెప్పకు మమీ’ అన్నదో డాగ్ లవర్. దీన్కి నామర్దా. పాకిస్తాన్‌నుంచో చైనా నుంచో పోనీ బంగ్లాదేశ్‌నుంచో తెచ్చాము అని చెబుతాలే అన్నది తల్లి/సెకులరిజం. పరదేశ సహనం లాంటివి కుక్కల ద్వారా నేర్పుతామన్నాడు నాన్న. బాగానే ఉంది. కానీ వాకింగ్‌కి డాగ్‌తో రోజూ వెళ్లే తాతగారికి మాత్రం భయమే పొద్దునే్న ఈ అడాప్ట్ డాగ్ కొంచెం పెద్ద కర్ర చేత బట్టుకునే ఆయన ఓయు కాంపస్‌కి నడిపించుకు వెళ్తాడు. అక్కడ కుక్కలు దండులుగా మార్నింగ్ పర్యటనలు చేస్తుంటాయి. ఈ కుక్క (పిల్ల)మూలాల్ని పసిగట్టి ( కుక్కలకి పసిగట్టుట దేనితోనైనా నేర్పవచ్చట. కుక్క బిస్కట్టులు, కుక్క బర్గర్లు అక్కరలేదట) తిరిగి ఆ కుక్కల క్లబ్బులోకి పారిపోతే.? ఇంతకీ వేయి కుక్కలు స్వదేశీ నేస్తాలుగా అడాప్ట్ అయ్యిసరే, వూళ్లో ఎన్ని కుక్కలున్నాయి? ముందు, పెంపకానికి పోయిన కుక్కల వివరములు ప్రెస్సు వారికి అందిన సమాచారం ప్రకారం పదివందలు అన్నారు కదా? బాగుంది కానీ నగరంలో ‘కుక్క్భా’ ఆరు లక్షలు ఉన్నదపి. పట్టుకుని జాగ్రత్తగా వాటికి యాన్టీరేబిస్ సూదిమందులు కుటుంబ నిరోధక శస్త్ర చికిత్సలు గట్రా చేసి తిరిగి భద్రంగా ఏ పేట కుక్కల్ని ఆ పేట వీధుల్లో వదిలెయ్యాలి. పైగా పగలు ఈ పని చేస్తే స్థానికులు కర్రపుచ్చుకుంటారు. అంచేత రెండో కంటికి తెలియకుండా-మా తల్లులారా మీ పుణ్యముంటుంది మొరగకండే అంటూ బతిమాలి వదిలెయ్యాలి. దారి తెలియకుండా భద్రపడాలి. కుక్కలకి అంతర్జాతీయక రక్షణ ఉంది. దానిని కొట్టరాదు, చంపరాదు. మన పక్కింటి కుక్క మొరిగితే మన పోస్టుమ్యాను,పాలబ్బాయి మనింటికి రారు. పైగా ఆ ఇంటి ఇల్లాలు ‘ఏమండోయ్. మా కుక్క అరుస్తోంది దాని గొంతుపోవాలా ఏందీ? ఎవరో వచ్చారు చూడండి అంటూ తాను అరుస్తుంది. ఏమీ అనకూడదు ఎందుకంటే కుక్కస్టేటస్‌కి స్పెషల్ ప్రొటెక్షన్ ఇండియన్ గవర్నమెంటు చట్ట్భరితంగా ఇస్తోంది మరి. కాకపోతే ఇంటి ప్రతిష్ట పరువు గల కుక్క కూడా మనకి ఇష్టంలేని పక్కింటి వాచ్‌మెన్ మిగిలిన ముక్క చెక్కపెట్టేసి తిని వాడికి తోక ఊపుతుందని మా ఇంటికి పాత పేపర్లు కొనడానికి వచ్చిన ఐరన్ అన్కుల్ చెప్పాడు.
మైండ్ యు డాగ్ కేన్ బైట్ యు- యు కాంట్ రెసిప్రోకేట్!
*

veeraji.columnist@gmail.com