వీరాజీయం

తడిపొడి వెలుగుల నీరస దీపావళి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోడ్లన్నీ గండ్లమయం కాగా, ప్రజాజీవితం ముఖ్యంగా రైతు బతుకు కడగండ్ల పాలైంది. తొందరగా వచ్చేసింది దివ్య నవ్య భవ్య దీపావళి అంటూ ప్రధాన మంత్రి దగ్గరనుంచి పాపాయిల దాకా మురిసిపోయిన దీపావళి చప్పుళ్లు లేని పండుగ అయిపోతోంది. రాజధాని ఢిల్లీలో అస్సలు టపాసులు అమ్మరాదు అన్నది సుప్రీంకోర్టు. అయ్యా! బాబూ! మాకు ఉన్నది ఒకటే పండుగ-అని ఆమ్ ఆద్మీ మొత్తుకున్నా-చీపురు పట్టి వచ్చావుగా-అదే నీకు ప్రాప్తి అన్నట్టు- ‘‘బాణాసంచా భగావ్, ఢిల్లీ బచావ్’’ అన్నది దేశంలోని అతి పెద్ద న్యాయస్థానం. పాపం, పంజాబ్ హర్యానాల హైకోర్టులే నయం-రాత్రి ఆరున్నరనుంచి తొమ్మిదిన్నర దాకా మాత్రం బాంబులు కాల్చుకోండి ఆనక టీవీలుచూస్తూ ఆనందించండి అన్నాయి. కావాలంటే, చప్పుళ్లు-చప్పట్లోయ్ తాళాలోయ్ అంటూ భజన చెయ్యండి. పొల్యూషన్ భూతం మీరు టపాకాయల కాలిస్తే-కాకర పువ్వొత్తులు వెలిగిస్తే-ద్విగుణీకృతమై-లోకహాని చేస్తుంది-పైగా, చీనా వాడు సప్లై చేసే టపాసులు బందు అయితే శత్రువు వ్యాపారాన్ని కూడా దెబ్బ తీసినట్టు వుంటుంది అని పెద్దాళ్లు అంటూ వుంటే- పిల్లలు నాకు ‘‘ఆటం బాంబులు కావాలి-లక్ష్మి ఔట్లు కావాలి’’ అని మారాం చేస్తున్నారు- హూకేర్స్ దెమ్? మహారాష్టల్రో ముందే బాలథాకరే వార్నింగిచ్చాడు. అందుచేత, ముంబై స్టార్ దీపావళి సాగుతుందేమో/కాని దక్షిణాదిన రెండు మహానగరాలున్నాయి-‘‘ఐటిలో నేనే గొప్ప అంటే నేనే గొప్ప’’ని జబ్బలు చరుచ్కుంటూ...కాని వాన దేముడు ఈ రెండు నగరాలలోను తడాఖా చూపించాడు ఉరుములు మెరుపులు ప్రక్కవాయిద్యాలుగా చేసుకొని మరీ ఎడాపెడా వానలు కుండపోతగా కురిపించేశాడు జనాల భరతం పట్టేడు-ఏడాదంతా పడాల్సిన వానలో ముప్పాతిక వంతు ముందే అడ్వాన్సుగా ఇచ్చేసి-కర్నాటక తెలంగాణాల రైతుని కూడ కంట తడి పెట్టించాడు. అదేమిటో, ఇంద్రుడికి బదులు ఇంద్రజిత్తు రథం తోలినట్లు-శరదృతువు మొత్తాన్ని కబళించేసింది పాడు వర్షం! ఈ వానలతో తెలంగాణ చెరువులు నిండేయి బాగుంది కాని పత్తిపంటలు మునిగాయట. మేడలు మిద్దెలు ములిగి మూలుగుతున్నాయి. ఏ రోడ్డు చూసినా-సగం కొరికి వదిలిపెట్టిన మొక్కజొన్న కండెలాగ- కోరుకుపోయి గుంతలు- గోతులు వెక్కిరిస్తున్నాయి బెదిరిస్తున్నాయ్-గుంతలను తప్పించుకుందామని చూస్తే-మనుషుల్ని ముట్టేస్తున్నాయి నాలుగు చక్రాల శకటాలు. కొంచెం లేట్ అయినా మోదీజీ హయాం గదా ‘మేమో’ తగులుతుందుమోనన్నట్టు రోజూ సాయంకాలం ఒకే టైముకి వర్షధార సర్వజనుల దారికి అడ్డంగా పడిపోతోంది. చాపకింద నీరు లాగా కాదు నీళ్లకింద పాములాగ ప్రమాదం- పొంచి ఉండడంతో, పాదచారులకన్నా శకట చోదకులే హడలి చస్తున్నారు-‘బెంగ’లూరులో నేషనల్ హైవే మీద పడ్డ ఒక పెద్ద వాన గుంతకు ఇద్దరు స్ర్తిలు బలి అయిపోయారు. ఓ వృద్ధ దంపతులు స్కూటర్ మీద పోతూ ఎదురుగుండా నోరు తెరుచుకుని మొసలిలాగ వున్న వాన-బిలాన్ని తప్పించుకోబోయారు-పక్కనుంచి వచ్చిన ట్రక్కు ముట్టేసింది. అలాగే వెనక సీటు మీద కూర్చున్న యువతి స్కూటరు గోతిలో పడకుండా తప్పించే ప్రయత్నంలో- మోటారు శకటం కిందికి పడిపోయింది-జనం వాన ధాటికి రోడ్డు గోతుల ఇక్కట్లకి మధ్య నలిగిపోతూ విసిగి పోరాటానికి దిగారు. ఇవి మృత్యుదేవత గహ్వారాలు అంటూ బంగలూరులో శవయాత్రలు జరిపి ప్రొటెస్టులు చేసారు. విషయం ముఖ్యమంత్రి దాకా పోయింది. ననే్నం చెయ్యమంటారు? ప్రమాదాల్లో మరణించిన వారికి రోడ్డుస్థితితో సంబంధం ఉండదు-అయినా వానలు తగ్గాక కాని పూడ్చలేము కదా? అన్నాడు. బంగలూరులో 2007 తర్వాత ఇంత పెద్ద కుంభ వృష్టి సంభవించలేదు. నెల రోజులైంది కబ్మన్ పార్కు సెంటర్లో ఓ చెరువంత వాన గొయ్యి ఏర్పడి జనాల్ని బాధపెడుతోంది. నంజుండా స్వామీ అనే ఆర్ట్ డైరక్టర్- ఆ గోతినే ఒక కొలనులాగా చేసి అందులో ఒక జల కన్యని ప్రవేశపెట్టాడు. ఒక అందాల మోడల్ జలకన్యగా వాన కొలనులో కూర్చున్నది. దీనికి ఖర్చు ఆరువేల అయిందట అంతా అతనే భరించాడు. గుంతలున్న చోట మృత్యు గుహలే ఇవిగో అని రోడ్డుమీద రంగు బొమ్మలు గీశాడు- బొమ్మలు వేసి అందరి దృష్టిని అటు మరిల్చిన ఆర్టిస్టు శ్రమ ఫలించింది. పదిహేను రోజుల్లో రోడ్లు నున్నగా గోతులు లేకుండా చేయాలని సిఎంగారు ఆదేశించారు.
మేడలు గోడలు నానిపోయి కూలిపోతున్నాయి. వాటికింద కొందరు సజీవ సమాధి అయిపోతున్నారు. ఏటా రెండు లక్షల అదనపు శకటాలు మోటరు కార్లు ఎక్కువ అదనం అయిపోతున్న నగరంలో రోడ్లకు అస్థికలు వేస్తూను- పైపై పూతగా కంకర వేస్తేను ఆగే వేగమా? ఇది? ముందుగా మూడువారాల ముందుగా దీపావళి ముసురు విడ్డూరమే- ముసురేమిటి ఇది ముంపుకాని, ఏ గల్లీ చూసినా మురుగు నీరు వాననీరు ముచ్చట్లు ఆడుకుంటున్నాయి. పోయినసారి వానల తరువాత, రిపేరుల కోసం తీసిన గోతులు పుండుమీద కారం జల్లినట్టు హింస పెడుతున్నాయి. అయినా, మొండిఘట సిటిజనుడు-టిఫిన్ సెంటర్లు తిండి చిల్లర దుకాణాలు దెబ్బతిన్నా ఆన్‌లైన్ కొనుగోలు శక్తి ప్రదర్శిస్తున్నాడు. పరపతి కార్డులుండగా దిగులెందుకు? -ఇంటి పట్టున వుండే - దుస్తులు, నగలు, వంట ఇంటి భోగ పరికరాలు వగైరా లాగించేస్తున్నాడు. వెనుకటి రోజుల్లో పిల్లకాయలు తాళం చెవి దొరికినా చాలు-దానికో మేకు లింకు ఎత్తి ఓ రోలూ రోకలి ధాం ధాంలు దంచేస్తూ వుండేవాళ్లు. ఎండ లేకపోతే సురేకారం ఎండదు రజను మెత్తబడిపోతుంది లాంటి వర్రీలు ఉండేవి ఇస్కూలు పిల్లకాయలకి. సొంతంగా చిచ్చుబుడ్లు కూరి రోజుకోసారి మచ్చులు వెలిగించాలీ- కాని, ఆ దీపావళి ముచ్చట్లు అటకెక్కేసాయి-మొబైల్ పక్కన పెడితే గదా? ఏదైనా చెయ్యడం? మందు విందు ఓకే-మండుగుండుదే సమస్య అయిపోయింది. శ్రీరాముడు అయోధ్యకి వచ్చేటప్పుడు చిమ్మచీకటి. మరి అమావాస్యకదూ? పుష్పక్ విమానం రావణాసురుడిది. రాముడు లంక దాకా పాదయాత్రలు చేసినవాడుగా... అంచేత అయోధ్య జనులంత ఇంటికో దీపం లేదా రెండు చొప్పున దీపాలు వెలిగించి స్వాగతం చెప్పారు. ఇది రంగురంగుల మాయాలోకం అందుకని చమురుతో పని లేని దీప తోరణాలు కట్టేస్తారు. పుర జనులు ఘనులు. అమావాస్య సంగతి లేదు కానీ పత్రికలనిండా ధన త్రయోదశి బంగారం సింగారం ప్రకటనలే-ఈ కాలంలో ప్రకటనకర్తలు కూడా ఇంగ్లీషు మీడియం అంటే పడి చస్తున్నారు-ఒక ఆంగ్ల దినపత్రికా రాజము నలభై రంగుల హంగుల ప్రకటనలతో-విచ్చేసింది ముందే. అందులో అంతటా దుస్తులు నగలు భోగ పరికరాలు తప్ప టపాసులు మతాబులు డాబు లేదు. చేతిలో తడి వుంటే-్ధనత్రయోదశి ఏమిటి? బంగారం పాడ్యమి నుంచి రత్నాల చతుర్దశి దాకా సుపెర్మాల్స్‌కి పోయే ఓపిక ఉన్న రోజులివి- వానొస్తే రైతుకి పల్లెటూరు బైతుకి బెంగ-తలమ్ముకున్న బ్రతుకులు నిత్యం రోడ్డున పడకపోతే - బండి సాగాడు. రోడ్డంటే ఇవాళ మహానగరాల్లో జనం గుండెల్లో మందుగుండు చప్పులు సుళ్లు తిరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇవాళ దస్త్రం పూజకి దీపావళి ముఖ్యం - పెట్టుబడికి రాబడి రాని రోజులు అంటూ వాళ్లు పన్నుల దేముడు మోదీజీని తలుచుకుని - దస్త్రం ముందు లక్ష్మికి దండం పెట్టబోతున్నారు. పిల్లకాయలు కొత్త గేమ్సు ఈ దీపావళికి ఏమేమి విడుదల అవుతాయి అని అంతర్జాలంలో గాలిస్తున్నారు. దీపాలు వెలిగే చీకట్లు చెదిరే లాంటి పాటలు మోటుగా వున్నాయి- స్విచ్ నొక్కితే అన్నీ రంగులే అనుకుంటున్న పట్నవాసికి-రైతు కష్టం- నేతపనివాడి కష్టం ఎలా తెలుస్తాయి. కబుర్లు చెప్పుకుంటే చాలు-కొత్త సినిమా టికెట్లు బుక్ చేసుకుంటేనే చాలు-పండగ కళ వచ్చేస్తున్న ఈ రోజుల్లో కూడా ఇలా వానలు ఎడతెరిపిలేకుండా కురిసిపోయి, తరులకు తలంట్లు పోసేసి తటాకాలు నింపేసి-అంతటితో ఆగక-చెట్లను కూల్చేసి, తటాక జలాల్ని కొంపలలోకి తోలేస్తూ వుంటే గొప్ప చిరాకుగా ఉంటుంది అంకుల్ అన్నదో కాలేజీ భామ. హైదరాబాద్లో మొత్తం పదివేల వాన గోతులు- రెండు వేల దాకా కూలిపోతున్న- లేదా బెదిరిస్తున్న భవనాలు ఉన్నాయట. వాటిని ఏమిచేద్దాం? వానలు వెలిసేయిగా...‘బాద్మె దేఖేంగే’ అంటే వాయిదా వేద్దాం అని తాత్పర్యం. నాళాల మహానగరం హైదరాబాదు-ఎనిమిది నిరంతర కుళ్లు స్రవంతులవి-వాటిలో కూడా జనాలు ఇండ్లు కట్టేసుకుంటే? వానలు కురవాలి వరి చేలు పండాలి బుడుగో పాటలకి కాలం చెల్లింది. వానలు కురవ్వొద్దు మా రోడ్లకు నాళాలకు గండి కొట్టి పాడు చెయ్యవద్దు అంటూ పాడుతున్నాడు సాధారణ నగరవాసి. నగరంలో వాన ఈసారి నరక యాతన అయిపోయింది-అన్నది ఏక వాక్య తీర్మానం. దీపావళి సందడి గురువారం నాటికి గజ్జకడుతుందేమో చూద్దాం!
-వెట్ వెదర్ అండ్ వార్మ్ గ్రీటింగ్స్ గాట్ టు గో టుగెదర్!

veeraji.columnist@gmail.com