వీరాజీయం

ఇది భారతీయ క్రికెట్ నామ సంవత్సరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ని 2016 సంవత్సరానికి అత్యుత్తమ క్రికెటర్‌గా నిర్ణయించిన ఐ.సి.సి. ‘సోబర్స్ అవార్డ్’ను ప్రకటించింది. ఐ.సి.సి. టెస్ట్‌టీమ్‌లో ఇండియా నుంచి అతనొక్కడికే చోటు దొరికింది. 2016లో మన క్రికెట్‌కి ఇది గొప్ప వజ్ర కిరీటం. కొహ్లీ సేన జేగీయమానంగా ఇంగ్లాండ్‌పై సిరీస్ గెల్చుకుంది. ‘‘ఓహో!’ అనిపించేలా వుంది మన టెస్ట్ క్రికెట్ టీమ్! ఇంతకన్నా ఏమీ అడగలేం. దేశానికి నూతన సంవత్సర కానుకగా- ‘నెం.1 గద’, టాప్ ర్యాంక్ కిరీటం అన్నీ ఇచ్చారు మన క్రికెట్ వీరులు. అనుమానం అక్కరలేదు. ఇది మనకి ‘టెస్ట్ క్రికెట్ నామ సంవత్సరమే’. విదేశీయ కోచ్ పీడ మన టీమ్‌కీ, గాళ్‌ఫ్రెండ్ సందడి విరాట్‌కీ తటస్థపడక పోవడంతో- మన జట్టుకి మూడు బంతులు- ఆరు పరుగులుగా- వరుస విజయాలు- కథ అంతా జయభేరీ నాదమే అయిపోయింది.
అంతర్జాతీయ క్రికెట్ రంగంలో రికార్డుల తరువాత రికార్డులు- మన కుర్రాళ్లు భగ్నం చేసేస్తూ- చివరికి అరివీర భయంకరులై సరికొత్త రికార్డులు ఊపుతూ- 2017కి తాషామార్ఫాలు మ్రోగిస్తూ స్వాగతం చెబుతున్నారు. తాజా పరిణామాలు చూస్తే- మన స్పిన్ మాంత్రికుడు- ఐ.సి.సి. క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా- ఐ.సి.సి. పీఠాధిపత్యాన్ని సాధించాడు. టాప్ ర్యాంకర్ టెస్ట్‌బౌలర్‌గా, ఆల్‌రౌండర్‌గా 612 పరుగులు, 72 వికెట్‌లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఎనిమిదిసార్లు ఐదేసి లేదా అంతకన్నా ఎక్కువ వికెట్‌లను పడగొట్టిన వీరుడిగా- అతనొక్కడే ఐ.సి.సి. టెస్ట్ టీమ్‌లో చోటు సంపాదించాడు. అలాగే నెంబర్ వన్ టీమ్ ర్యాంకు ‘గద’ను పట్టుకొని ఇంగ్లాండ్ జట్టుమీదికి కొదమ సింహంలా లంఘించిన కొహ్లీ ది విరాట్- ఐ.సి.సి. వన్ డే ఇంటర్నేషనల్ టీమ్‌కి క్యాప్టెన్సీని సాధించాడు. మన టెస్ట్ టీమ్ క్రికెట్ చరిత్రలోనే- ఇంతవరకూ అరుదైన టీమ్‌వర్క్‌ని ప్రదర్శించారు.
టాస్ గెల్వకపోతే గెలుపు కష్టం. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి జట్టు నాలుగువందలకు పైగా రన్స్ చేస్తే విజయం సంశయాత్మకం లాంటి సూత్రాలు పటాపంచలయిపోయాయి. మొట్టమొదటి టెస్ట్ ‘డ్రా’ ఐనా, తతిమ్మా నాలుగు టెస్ట్‌ల్లో- అందులో రెండు మైగాడ్! ఇన్నింగ్స్ ఓటములు- కుక్‌గారు టీము పప్పుల్ని- ఏ దశలోనూ ఉడికించలేకపోయాడు. గత 23 సంవత్సరాల కాలంలో ఎన్నడూ చూడని అమోఘ విజయం కొహ్లీ సేన ప్రత్యర్థి జట్టునుంచి నిర్దాక్షిణ్యంగా లాక్కుంది. కొత్త కుర్రాడు కరుణ్‌నాయర్- వీరేంద్ర సెహ్వగ్ టెస్ట్ ట్రిపుల్ సెంచరీ రికార్డులో- ఒక దాన్ని అజేయంగా నిలబడి లాక్కున్నాడు. ఒక టెస్ట్‌మ్యాచ్‌లో ఒక్కటి తక్కువ రెండొందలు ఓ కొత్త కుర్రాడు బాదేస్తే- మూడొందలు ఉతికిన తర్వాత కూడా- బ్యాట్‌ని ఝుళిపించసాగాడు కరుణ్ నాయర్.
చివరి పోటీలో అశ్విన్ మంత్రం పారకపోయినా- ‘నేనున్నాను’ అంటూ మీసాల రాయుడు జడేజా రంగంలో అతనికి తోడుగా దిగి- ఇంగ్లండ్ టీమ్‌ని మట్టికరిపించాడు. ‘ఇదంతా ఒక కల’ అన్నట్లుగా సాగింది. ఇంగ్లీష్ టీమ్- ‘బతుకు జీవుడా’ అంటూ క్రిస్‌మస్ సంబరాలు చేసుకుని, మళ్లీ వస్తాం అంటూ విమానం ఎక్కేసింది. ఈసారి విరాట్ అన్నిరకాల క్రికెట్‌లనూ ప్రస్తుతం ‘‘బస్తీమేఁ సవాల్’’ అంటూ- క్రికెట్ లోకమంతా యిటువేపు- మనవేపు చూసేలా చేశాడీ యువ క్యాప్టెన్. ‘‘్థంక్‌గాడ్- గాళ్ ఫ్రెండ్ గ్రహణం వదిలింది’. సోలాంగ్ చెప్పేశాడు గనుక సరిపోయింది’’ అన్నారంతా. కాకపోతే 2015లో దక్షిణ ఆఫ్రికా మీద మన టీమ్ సిరీస్ గెల్చుకుంటే- క్రికెట్ కంట్రోల్ బోర్డ్- రెండు కోట్ల రూపాయల బోనస్ ప్రకటించింది. కానీ సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ఈసారి పణం పలకలేదు. వెనుకటి రోజుల్లో- 1974లో ఓసారి ఇద్దరు భారతీయులు- బిషన్‌సింగ్ బేడీ, బి.చంద్రశేఖర్‌లు - నెంబర్ వన్, నెంబర్ టూగా నిలిచారు. ఇప్పుడు అశ్విన్, రవీంద్రలు- అలాగే నిలిచి తల ఎగరేస్తూ జెండా వూపారు. ఈసారి వచ్చిన ఇంగ్లీష్ టీము మరీ చచ్చుటీము కాదు. వాళ్లకీ స్పిన్నర్ రషీద్ మొయిన్‌లు బంతిని మంత్రించిన పాముల్లా విసరగలవాళ్లు వున్నారు. కుక్, రూట్ లాంటి బ్యాట్ వీరులున్నారు. కానీ, విరాట్-జగన్నాథ రథచక్రాలను ఎవ్వరూ నిలవరించలేకపోయారు.
ఒక క్యాలెండర్ సంవత్సరంలో మూడు డబుల్ సెంచరీలు బాదేసి- సగటున నూట తొమ్మిది పైచిలుకు సాధించి, విరాట్ ఇప్పుడు మైదాన దశ చేరుకున్న జీవ నదిలాగా- వ్యూహరచనలో కూడా కొత్త పుంతలు తొక్కాడు. ‘కలిసొచ్చే రోజులొస్తే- నడిచొచ్చే బిడ్డలు పుడతారు’- అన్నట్లు క్షతగాత్రులయిన స్టార్‌లు- శిఖర్ షమీ, రోహిత్ రెహానాలు మంచం ఎక్కేసినా, వారి స్థానాల్లో చాకుల్లాంటి రాహుల్ కరుణ్, జయంత్ లాంటి క్రికెటర్లు ఉత్సాహంతో ఉరకలువేస్తూ- సీనియర్ల సరసన అతికినట్లు కుదురుగా అమిరిపోయి- టీమ్‌వర్క్‌కి ఉదాహరణలుగా నిలిచారు.
కుంబ్లేకి కూడా మాటదక్కింది. కొహ్లీకి ఆట దక్కింది. వెస్టిండీస్‌లో గెలుపు మొదలు. ఇంతవరకు ఇండియన్ బ్యాట్స్‌మన్ పరుగుల వరదలు సృష్టిస్తున్నారు. బౌలింగ్‌లో రికార్డులు పగులగొట్టి-కొత్త రికార్డులు రాస్తున్నారు. ఇప్పుడు ఇంగ్లాండ్ మీద ఘన విజయంతో 2016కి గుడ్‌బై కొట్టి 2017లో చిచ్చర పిడుగుల్లాగ అడుగుపెడుతున్నారు.
ఓసారి ఫ్లాష్‌బ్యాక్ చూద్దాం. ఓం ప్రథమంగా 1932లో ఇండియన్ క్రికెట్ టీము ఇంగ్లండ్ టూర్‌కి పోయింది. ఆ తర్వాత ఇప్పటిదాకా, ఈ రెండు దేశాల మధ్య 117 టెస్ట్ పోటీలు జరిగాయి. మన దేశం 25 టెస్ట్ పోటీలను మాత్రం గెల్చుకుంది. 49 పోటీలలో సమఉజ్జీగా నిల్చింది. అలాగే సిరీస్‌లన్నీ చూస్తే మొత్తం 32 జనరంజకంగా సాగాయి. ఇంగ్లీష్ వారిదే పైచెయ్యిగా వాళ్లు 18 సిరీస్ గెల్చుకున్నారు. మనకిది పదో సిరీస్ ఘన విజయం. లోగడ 1992-’93లో అంటే- గత దశాబ్దంలో మన జట్టు- అజ్జ్భూయ్ నాయకత్వంలో 3-0 తేడాతో సిరీస్‌ని గెల్చుకుని చరిత్ర సృష్టించగా- మన విరాట్ జట్టు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాస్తూ 4-0 తేడాతో బ్రహ్మాండ విజయం సాధించి- ప్రపంచం నెవ్వెరపోయేలా చేసింది.
మన దేశానికి ‘స్పిన్ మాంత్రికుల దేశం’ అని, వినూ మన్కడ్, సుభాష్ గుప్తేల నాటినుంచీ- వెంకట్‌రాఘవన్, చంద్రశేఖర్, ప్రసన్న, బేడీ-ల దాకా ‘లెజండరీ’ ఖ్యాతి వుంది. దాన్ని తిరగేసి పడేశారు ఈసారి అశ్విన్, జడేజాలు. చెరోవేపూ వీళ్లు బేజారెత్తిస్తుండగా ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ నీళ్లల్లోనుంచి బయటపడేసిన చేప పిల్లల్లాగా అల్లాడారు. అదీ చివరి టెస్ట్‌లో రసవత్తర ఘట్టం. ఇక అశ్విన్ రవిచంద్రన్, మ్యాజిక్ స్పిన్నర్ కుంబ్లే ద గ్రేట్‌లు కోచ్‌ని కూడా మరిపించి-వరుసగా రికార్డుల మీద రికార్డులు అందుకుంటున్నారు. ‘సాగుమా! ఆగని వేగమే జీవితమూ’ అందామా..! కామెంటరీ బాక్స్‌నుంచి మన వెటరన్ క్రికెటర్లు అంతా ఓ పక్క తమ తమ రికార్డులు ధారపోతున్నాయి అనుకుంటూనే- ఈ ‘కొత్తనీటి’కి ఘన స్వాగతం పలుకుతున్నారు. ‘‘జై జై’..
దిస్ ఇయర్ కుడ్ బి నేమ్‌డ్ ఆఫ్టర్ కొహ్లీ టీమ్..!