వీరాజీయం

సామూహిక మానభంగాలూ సైబర్ నేరాలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూస్ అంటే ఏమిటి? తూర్పు పడమర ఉత్తరం దక్షిణం దిక్కుల నుంచి వచ్చే రేప్స్, ఉగ్రవాద దాడులు, రోడ్డు ప్రమాదాలు ఇవన్నీ అనుక్షణ నూతన వార్తలు. క్షణం క్షణం మారిపోతూనే వుంటుంది. ‘శీను’ కాని కొత్త మాట గ్యాంగ్ రేప్ మీడియా ...... వెనుకటి రోజుల్లో దొమీ అని ఒక మాట రాసేవాళ్ళం. పదిమంది కలిసి ఒకన్ని కర్రలతోనో కత్తులతోనో కుమ్మేసి చంపేసి పారిపోయేవారు. కేసు మీద విచారణలో ఎవరి కర్ర దెబ్బకి ప్రాణాలు వదిలాడు? అన్న మీమాంస వచ్చేది. ఫలితం ‘దొమ్మిగాళ్ల’ల్లో ఎక్కువమంది మళ్లీ కర్రసాము ప్రాక్టీసుకి పోగా, మిగిలిన కొంచెం మంది అదేదో ఘనకార్యంలాగా వెళ్ళేవారు. ఒకప్పుడు జేబుదొంగలు టాప్స్‌గా వుండేవారు- తరువాత బంగారం గొలుసులు తెంపుకుపోయే దొంగలు సామాన్యులకి ఆశ్చర్యం కలిగిస్తూ వుండేవాళ్ళు. ఇవన్నీ ఇప్పుడు చప్పని వార్తలు. వార్త అంటే మానభంగం లేదా హత్య- ఇలాంటివి జరగాలి- ఆపాటికి కాని, అరచేతిలో అనుక్షణం స్మార్ట్ ఫోనుమీద ఇలాంటి వార్తలు చూసి చూసి చర్మం సారీ కాదు మనసు మొద్దువారిపోయి జనాలకి సరిపోదు. ఓస్ ఇంతేనా? మొన్న అక్కడేమి జరిగిందో తెలుసా? ఆటోలో వస్తూన్న అమ్మాయిని అమాంతం ఎత్తుకుపోయి పట్టపగలు ‘రేప్ చేసి’ దాన్ని వీడియో కూడా తీశారుట. అదీ ఎక్కడా? సిసి కెమెరాలు ఉన్నచోటే అని చెప్పుకుంటూ వుంటారు. మానభంగం, సామూహిక మానభంగం లాంటి మాటలు కొందరికి మొరటుగా వుంటాయిట? ఏమిటండి! అలాంటి భాష వాడతారు? సింపుల్‌గా ‘రేప్’ అనండి అంటారు. అత్యాచారం, అఘాయిత్యం లాంటి మాటలకు వేరే వేరే చట్టబద్ధ నిర్వచనాలొచ్చాయి ఇప్పుడు- ఎండాకాలంలో పేపర్స్‌లో ఉష్ణోగ్రతల కాలమ్‌లాగా ఈ వార్తలకి ఓ కాలమ్ స్టాక్ హెడ్డింగు పెట్టేసి ఉంచుకోవడమేనన్నాడో లేట్ ఎడిషన్ జర్నలిస్టు. ఒకప్రక్కన దేశ రక్షణ శాఖ మంత్రి పదవి నుంచి- సైనిక విభాగాలు లాంటి ప్రత్యేక శాఖలలో కూడా మహిళామణులు రాణిస్తూ వుండగా- రెండోప్రక్కన ఢిల్లీ మొదలు పల్లెదాకా ఈ జాడ్యం చెరువులలో గుర్రపు డెక్కలాగా అల్లుకుపోతున్నది. అత్యున్నత విద్యాభ్యాసం చేస్తున్నవాళ్లు, తెల్లారగట్ల మన వీధులలో చిత్తుకాగితాలేరుకొనే వాళ్ళు ఒకే టైపు పెర్వర్ట్స్ అయిపోతే ఎట్లా? ఆడదానిమీద ఒకరకపు కక్ష సాధింపులాగా ఉంటున్నాయి కొన్ని సంఘటనలు! లేదా సులువుగా దొరికిన అవకాశంలాగా ఉన్నదీ దుష్ట్భీకర బీభత్స క్రీడ? ఇదేదో పురుషాధిక్యత ప్రతాపంగా తయారైంది. ‘సైబర్ నేరాలు’ అన్నది కొత్తమాట- వర్తమానంలో జరుగుతున్న ఈ అకృత్యానికి కూడా వర్తిస్తుంది. ఇంటర్నెట్, కంప్యూటరు, మొబైల్ ఫోను- అన్నిటినీ మించి డర్టీ వెబ్‌సైట్లు, న్యాస్టీ యూట్యూబ్- ఇవన్నీ కూడా ఇంటర్నెట్ నేరాలకి ఉచిత ప్రేరణలే. కొత్త పరికరాలే. మానభంగం, అపహరణలు వీటి విషయంలో కూడా చట్టం కాగితంమీద గట్టిగానే వుంది. కాని కోర్టుకుపోయేదాకా ఒకరకం జాప్యం, వెళ్ళాక అక్కడ మరొక అంతులేని వాయిదాల జాప్యం- ఈలోగా మానసిక క్షోభతో యువతుల నిండు జీవితాలు బలి...
మానభంగం చేసి పశ్చాత్తాపపడి ఆత్మహత్య చేసుకున్న మగాడు ఎవరైనా వున్నాడా? బరితెగించిపోయిన స్థితికి చేరిందీ దారుణకాండ. అయినా మరో కోణంలో దీన్ని చూడాలి. నేరస్థుడిని మాత్రమే గాక ఆ నేరానికి దోహదిస్తున్న అంతర్జాల మాధ్యమాల కాలుష్యం- ఇది మానసికం రోగాకారకం- పర్యావరణ కాలుష్యంలాగా సామాజిక కాలుష్యం ఒకటి కారుమబ్బులాగా ఘనీభవిస్తున్నది. ఇంటింటికీ వైఫై అన్న రాజకీయ నినాదాన్ని నిషేధ నినాదంగా మార్చాలని తల్లిదండ్రులు, మహిళా సంఘాలు ఆలోచిస్తున్నారా? వాడి రాజకీయ లబ్ది మాట ఎలా వున్నా నీ కొంపలు కూలిపోతున్నాయి? అవసరాన్ని బట్టి ఎవడి సదుపాయాలు వాడికి ఉండాలి గాని మాస్టారూ, మీరు మరీ పాత థింకర్లండీ అన్నాడో కుర్రాడు- భోపాల్‌లో పోయినవారం ఆర్‌పిఎఫ్ పోలీసు స్టేషన్‌కి సమీపంలోనే రైలు స్టేషన్ పట్టాల పక్కన వంతెన క్రిందకి ఒక విద్యార్థినిని లాక్కుపోయి ‘మారణ’ మానభంగానికి చెత్తరకం త్రాగుబోతులు వడిగట్టారంటే సామాజిక ప్రవర్తనలో సామాజిక ‘ఇంటర్నెట్’ కాలుష్యం ఎంతటి వైపరీత్యాలను సృష్టిస్తున్నదో- సాయంకాలం ఏడు గంటల ప్రాంతంలోనే ఒక యువతి ఇంటికి తిరిగి వెళ్తూ వుండగా ఇద్దరు ముష్కరులు- వాళ్ళు చెత్త కాగితాలు ఏరుకునేవాళ్ళంట! యువతిని పట్టుకుని ఎత్తుకుపోయి వంతులవారీగా మానభంగం చెయ్యడం- అది చాలక ఆమెను చెట్టుకి కట్టేసి ఒకడు గుట్కా తెచ్చుకోవడానికి పోయి మరో ఇద్దరిని తీసుకునిరావడం- ఇలా వాళ్ళు టీలకి, గుట్కాలకి పోతూ- వస్తూ వంతులవారీగా ఆ యువతిని హింసించి- మెడ పిసికి బెదిరించి వెళ్లిపోయాక, ఆమె ఎలాగో బలం కూడగట్టుకొని ప్లాట్‌ఫాంమీదకిపోయి స్టేషన్‌కి పోయి ఫిర్యాదు చేయబోతే పోలీసులు ‘‘ఎంటమ్మోవ్? సినిమా కథలు చెపుతున్నావా? నఖరాలా? ఎల్లెల్లు’’ అంటూ పరాభవించారట. బిఎస్సీ డిగ్రీ తీసుకుని ఐఎఎస్ పరీక్షలు రాయడంకోసం సిద్ధమవుతున్న ఆ అమ్మాయి కోచింగ్ సెంటరుకి పోయి తిరిగి ఇంటికి చేరుకుంటున్న సమయంలో ఈ నలుగురు - రైళ్లు, బస్సులు తిరిగే సందడి గోల గల చోట ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు అంటే ఏమనాలి? అసలే మధ్యప్రదేశ్ దేశం మొత్తంమీద రేప్‌లకి చెడ్డ పేరు పడ్డ రాష్ట్రం. ఈ యువతి రోజూ ఇంటికి బస్సులోనే వచ్చేదిట. వాళ్ళ అమ్మా నాన్నా రైల్వే పోలీసు శాఖలోనే ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ ‘అలగాజనం’ కోవకి చెందిన నేరమనస్కులు - చెత్త వెధవల చేతిలో ఓడిపోయింది. వాళ్ళు పోలీసులే గనుక ఆ పిల్ల తల్లీ దండ్రీ ఆ పరిసరాలలోకి పోయి అటూ ఇటూ పర్యవేక్షించగా గ్యాంగ్‌లోని ఇద్దరు అక్కడే ఏదో ఘనకార్యం చేసినట్లు తిరుగుతూ గుట్కాలు సేవిస్తూ కనబడ్డారు. వెంటబడి నేర చరితుల్ని పట్టుకుని పోలీసులకి అప్పజెప్పినా ఆ రైల్వే పోలీసులు ఆ నేరం జరిగిన జాగా మాది కాదు, హబీబ్ గంజ్ స్టేషన్‌కి పొమ్మన్నారట. చివరికి పోలీసులు కేసు రాసుకోక తప్పలేదు. ఈ నలుగురు దొరికారు కాని పోలీసులు సస్పెండ్ అయ్యారు. కానీ వీళ్ళు బయటికి చెత్తలు, చిత్తు కాగితాలు ఏరుకునేవాళ్ళలాగే నటిస్తూ వున్నా నేరస్థులుగా మీసం మెలివేస్తున్నవారేనట. అందులో ఒకడు హత్య కేసులో కూడా ముద్దాయి. ఆమె వంటిమీద గల నగలు, సెల్‌ఫోన్, దుస్తులు కూడా దోచుకున్నారు. ఈ ఘోరం, దీనిపట్ల పోలీసుల ఉదాసీనత అన్నీ చివరికి ముఖ్యమంత్రి దాకా వెళ్లాయి. దర్యాప్తు మొదలైంది కానీ బయటపడని కేసులెన్నో. ధైర్యసాహసాలు గల కాబోయే పోలీసు లేదా రెవిన్యూ ఆఫీసరుగా కాబోయే యువతికే దిక్కులేదు. తట్టుకుని నిలిచి దుండగుల మీద పోరాటానికి దిగింది ఆమె. కానీ ఆగస్టు నెలలో ఇలాగే ఇంటర్మీడియెట్ చదువుకుంటున్న యువతిని- ఆమె తోటి విద్యార్థులే మోటారు మీద ఎత్తుకుపోయి వాళ్ళ లాడ్జిలోనే అత్యాచారం చేసి, దాన్ని వీడియో తీసి ఎవరికైనా చెప్పావంటే ఈ వీడియో వైరల్ చేసేస్తాం అని బెదిరించసాగారట. సౌపూర్ గ్రామానికి చెందిన తల్లిదండ్రులు ఆ దుర్మార్గుడి తండ్రి పెద్ద కాంట్రాక్టరు అని తెలిసి అతని దగ్గరికిపోయి అక్కడ వాళ్లు అవమానం పాలైనారు. అయినా పిల్లకు న్యాయం చెయ్యమని గ్రామ పంచాయితీని కోరారు. ఈలోగా ఆ యువతి మానసిక క్షోభ తట్టుకోలేక ఉత్తరం రాసిపెట్టి దూలానికే ఉరిపోసుకుంది. ఆ ఇద్దరి పేర్లు రాసిపెట్టి కథంతా వివరించి మరీ ఆత్మాహుతి చేసుకుంది. ఉత్తరం దాచేసి ఆ తల్లిదండ్రులు దహన క్రియ చేయబోగా పోలీసులు వచ్చారు కాని కేసు పెట్టలేదు, అరెస్టులు చెయ్యలేదు- కారణం? ఇదీ సినిమా కధలాగా జరిగింది. ‘రేప్కారు’లు డబ్బువున్నవాళ్లు కాబట్టి - అసలు ఆ ఉత్తరం ఫేక్, ఆమె రాసింది కాదు అన్నారు. దస్తూరి గుర్తింపునకి పంపించారు. ఇలాంటి ఘోరాలు ఎన్నో?
మధ్యప్రదేశ్‌లో హోంమంత్రిగారు అసెంబ్లీలో ఇచ్చిన లెక్కల ప్రకారమే- అక్కడ దామాషా రోజుకి పదకొండు మానభంగాలు జరుగుతున్నాయి. అందులో ఆరు కేసులు మైనరు బాలికలపై అత్యాచారం కేసులే. జాతీయ నేర రికార్డుల బ్యూరోవారు చేసిన సర్వే ప్రకారం దేశం మొత్తంమీద ఎక్కువగా 74 శాతం అత్యాచారాలు మధ్యప్రదేశ్‌లోనే జరుగుతున్నాయి. 2016 ఫిబ్రవరి నుంచి 2017 ఫిబ్రవరి దాకా లెక్కలు తీస్తే అత్యాచారాల సంఖ్య 4279 కాగా, అందులో 2260 మంది మైనర్లు, 248 సామూహిక మానభంగం కేసులున్నాయి. ఎటునుంచి చూసినా గవర్నమెంట్‌లు ఎంత తంటాలుపడ్డా అంతకుముందు ఏడాదికన్నా కొద్దిగా ఈ నేరాల సంఖ్య తగ్గిందేమో? అంటే ఎంతమందిని ఎవరికి అని కాపలా పెడతారు? మైండ్ సెట్ అంటూ వుంటారు మన నాయకులు. అత్యవసరమైతే డేటా కార్డు వేసుకుంటాడు ఎవడైనా. వాడికోసం రైల్వే ప్లాట్‌ఫాంమీద వైఫై ఎందుకు? జనాలు ప్లాట్‌ఫారం టిక్కెట్లు కొనుక్కుని అరచేతిలో పచ్చి బూతు వెబ్‌సైట్లు చూసి గొప్ప ప్రేరణ పొందేస్తున్నారు అన్నది పరిశీలకుల ఆవేదన. చెత్త బూతులు - మనం వందల లేదా నిజానికి వేలాది సంవత్సరాలు సంఘజీవనాన్ని మదించి త్యాగంతో సంయమనంతో ఏర్పాటుచేసుకున్న వావివరుసలు కట్టుబాట్లు, నియమ నిబంధనలు - సంఘ నియమాలు అన్నీ నాశనమైపోయి ఆబాలగోపాలం గేమ్స్ - షేమ్స్ (సైబ్ ఆటలు - అక్రమ కామక్రీడలు)కి బానిసలై సెల్ఫీలు తీసుకుని కూడా అంతర్గత దృష్టిని కోల్పోతున్నారు. వెబ్‌సైట్లు, యూ ట్యూబులు ఎంత అవసరమో అంత ప్రాణాంతక వ్యసనాలు ఇవాళ? లోపలికి చూసుకోండి! వైరల్ వైరల్ అంటూ తెగ మురిసిపోయే జనాలకి తనదాకా వస్తే తప్ప తెలియదు అన్నదో బామ్మగారు. ఇలా సైన్సు దుర్వినియోగం అరికట్టడంమీద నాయకులూ వినాయకులు - మహిళా సంఘాలు మేలుకోవాలి. ఇస్మంటి సైబర్ నేరాలలో జాతి నిర్వీర్యం గాకముందే ఇంటర్నెట్‌ని సోషల్ మీడియాని నవ్వుల పాల్జేసి ఘోర నేర.... అయ్యో ఎవరూ వినడం లేదా? అంతా బిజీగా వున్నారు, చెయ్యి ఖాళీ లేదు.. చేతుల్లో మొబైల్స్ లాక్కుంటే తిరగబడతారు. ఒక్కమాట- ఏ రోగానికైనా నేరానికైనా అది మానసికమయినా సరే పాత సామెత ఒకటి వుంది-
ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్!

veeraji.columnist@gmail.com