వీరాజీయం

జయమ్మ మృతిపై సవాలక్ష సందేహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళుల ఆరాధ్య దేవత ‘అమ్మ’ మరణానంతరం ‘చిన్నమ్మ’గా తెరపైకి వచ్చిన శశికళా నటరాజన్‌ని ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం 2,770 మంది అన్నా డిఎమ్‌కె సభ్యుల మండలి ఎదుట- ‘చిన్నమ్మలోనే మనం అమ్మను చూసుకోవాలి’ అంటూ పక్కనే వున్న- జయలలిత ఖాళీ కుర్చీని చూపించాడు. ‘పార్టీ పగ్గాలా? లేక ముఖ్యమంత్రి పదవా? లేక రెండూనా? ఏ విధంగా పార్టీనీ, రాష్ట్రాన్నీ చేజిక్కించుకోవాలి?’ అన్న తపనతో జయమ్మ ఇష్టసఖి వి.కె.శశికళ ప్రస్తుతానికి పార్టీ పగ్గాలకే మొగ్గుచూపెట్టింది. ‘బతుకుజీవుడా.. సిఎం పీఠాన్ని నాకు వదిలిపెట్టింది’ అనుకున్నాడు ‘అమ్మ’కి అత్యంత విధేయుడైన పన్నీర్.
‘పోయెస్ గార్డెన్’ కార్యాలయం మీదున్న జయమ్మ బొమ్మ- ఐదు కిలోమీటర్ల దూరం దాకా హుందాగా చూస్తూ కనబడేది. దాన్ని దింపేశారు. జయమ్మ ‘చిన్నమ్మ’కి పుష్పగుచ్ఛం అందిస్తున్న భారీ బోర్డుని భవనంపైకి ఎక్కించారు. అమ్మ పార్ధివ దేహాన్ని ఉంచిన మంచి గంధం శవపేటికను గోతిలోకి భద్రంగా దింపిన చిన్నమ్మ- అమ్మ తనకి పువ్వుల్లో పెట్టి అన్నాడిఎంకె ఆధిపత్య పీఠాన్ని అందించినట్లు మీడియాకి పోజులిచ్చింది. కానీ, అదే సమయంలో ఇద్దరు న్యాయమూర్తులున్న ‘ఖండపీఠ్’ ఒకటి జయమ్మ మరణం అనుమానాస్పదమని- అది తాపీగా చేసిన ‘హత్య’అన్న ఆరోపణలను ప్రతిధ్వనిస్తూ దాఖలయిన ‘పిల్’ మీద విచారణ మొదలెట్టింది.
జస్టిస్ వైద్యనాథన్, జస్టిస్ పార్తిబన్ ఆసీనులవుతూనే- ‘పిల్’ పెట్టుకున్న అన్నా డి.ఎమ్.కె. సభ్యుడు పి.ఏ.జోసెఫ్ పిటిషన్‌ని ఎత్తుకుని, ‘నీకే కాదయ్యా! మీడియాకి కూడా, ఆది నుంచీ బోలెడు సందేహాలున్నాయి. జయ మరణం ఎలా జరిగింది? అన్న అ నుమానం కూడా కలుగుతోంది’- అన్నారు. దీంతో, అవతల సంబరాలలో మునిగి తేలుతున్న చిన్నమ్మ గుండెల్లో రాయిపడ్డట్లయింది. వైద్యనాథన్ గారన్నారు- ‘జయలలిత మరణానంతరం, అది ఎలా జరిగింది? అన్న అనుమానం ప్రతి ఒక్కడికీ వస్తోంది. నా మట్టుక్కి నాకే ఎంతో అనుమానంగా వుంది... ఓరోజు- ‘ఆమె నడుస్తోంది’ అన్నారు. మ రో రోజు, ఆమె డిస్‌ఛార్జ్ అయి, ఆసుపత్రి నుండి వస్తుంది’ అన్నారు. మరి అంతలో ఏమయింది?’ అని.
లోగడ ఎమ్‌జిఆర్ సుస్తీ గురించి ‘వీడియో’ని విడుదల చేశారు. అలాంటిది ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా, అధికార పార్టీ అధినేత్రిగా వున్న జయలలిత ఫొటోను సైతం సెప్టెంబర్ 22 తరువాత రిలీజ్ చెయ్యలేదు. మళ్లీ డిసెంబర్ అయిదున ఆమె పార్థివ శరీర దర్శనభాగ్యం- అదీ చాలా ‘లిమిటెడ్’గా జనాలకి లభించింది. అమ్మ మరణంలో మిస్టరీ ఏమీ లేదని వాదిస్తున్న ఆడ్వొకేట్ జనరల్‌ని వారించాడు జడ్జీగారు. ‘‘అదేంటయ్యా.. బతకాలనుకోడం ప్రాథమిక హక్కు అని కదా చెబుతున్నారు. అటువంటిది కనీసం ఆమె రక్తసంబంధీకులకైనా ఆమెను చూసే అవకాశం కల్పించారా? ఇదంతా చూస్తూ వుంటే, ఆమె భౌతిక కాయాన్ని సమాధి నుంచి బయటికి తీయించాలనే అనిపిస్తున్నది’’- అని వైద్యనాథన్ రెట్టించారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా కేసుని వాదించవచ్చిన మదనగోపాలరావునుద్దేశించి- ‘ఏమయ్యా, నువ్వు అక్కడికి ఆమె చికిత్స జరిగే దగ్గరికి పోయావుకదా, ఏం చూశావో రిపోర్ట్ చేశావా? లేదు. గమ్మున వున్నావెందుకు?’ అని న్యాయమూర్తిగారన్నారు. ‘మేము కూడా పత్రికలలో చూశాం. ఆమె మాట్లాడుతోంది. మీటింగులు పెడుతోంది. సంతకాలు పెడుతోంది అంటూ వచ్చిన పత్రికల సమాచారం మేము కూడా చదివాం. కానీ అకస్మాత్తుగా, ‘ఆమె చనిపోయింది’- అన్న వార్త వచ్చింది. అందుకే ‘‘మేం’’ అడుగుతున్నాం’’- అంటే ఖండపీఠ్ న్యాయమూర్తులు అన్నమాట- ‘‘ఆమె మరణించిన తరువాత యిప్పుడు అయినా నిజం వెల్లడించబడాలి’’ అంటూ కేంద్రంలో, ప్రధాని కార్యాలయం తరఫున, సి.బి.ఐ. తరఫున, హోంశాఖ వగైరా యితర మంత్రులు తరఫున వాదించవచ్చిన అందరినీ వాదించటానికి ఆమోదిస్తూ, ‘అసలు కేంద్రం ఎందుకు నిమ్మకి నీరెత్తినట్లు వుంది?’ అని నిలదీశారు. అపోలో ఆసుపత్రికి కూడా తాఖీదు పంపించారు. పిటిషన్‌దారు ఒక రిటైర్డు సుప్రీంకోర్టు జడ్జీగారి ఆధ్వర్యంలో జయలలిత మృతి మీద దర్యాప్తు కోరుతూన్నాడు. జయలలిత భౌతిక కాయాన్ని దహనం చెయ్యకుండా, పూడ్చవలసిన అవసరం ఏమిటంటూ కూడా జడ్జీ గారు అడుగుతూ, అందరికీ ‘లకోటా’లు కొట్టి, కేసు విచారణని జనవరి తొమ్మిదికి వాయిదా వేశారు. దాని మీద ప్రతిపక్షం- అపోలో ఆసుపత్రి మెడికల్ రిపోర్టులు మొత్తం బయటపెట్టాలి అంటూ డిమాండ్ చేసింది. దానిమీదట డిఎంకె యువనేత స్టాలిన్ స్పందిస్తూ- మేం ఎప్పుడో మాజీ ముఖ్యమంత్రి జయ మరణం మీద శే్వతపత్రం అడిగాం. అసలు ఆమె మృతిని ఆసుపత్రే ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటన కూడా విడుదల చేయలేదు. కనుక అపోలో వీడియోలు, పత్రాలు- సమస్తమూ ‘పబ్లిక్’ చెయ్యాలి. హైకోర్టు ఆధ్వర్యంలోనే విచారణ జరగాలి’’- అని ప్రకటించడంతో జయమ్మ మరణం మీద జనాలలో విపరీతమయిన స్పందన మొదలైంది. అసలు జయమ్మని చూడవచ్చిన కేంద్ర నాయకులు, మంత్రులు, ప్రతిపక్ష నాయకులు అంతా అపోలో ఆసుపత్రిని సందర్శించి వెళ్లిపోయారేగానీ, ఒక్కడయినా ఆమెకు జరుగుతున్న చికిత్స మీద నివేదిక అడిగాడా? ఫార్మాలిటీ పరామర్శలు చేశారు. ఎంత ‘ఇన్‌సెన్‌టివ్ కేర్’ యూనిట్ అయినా అద్దాల గోడలోనుంచి చూడనిస్తారు. వీడియోలు ప్రదర్శిస్తారు. కానీ తమిళనాడులో ఉన్న గవర్నర్ కూడా తాత్కాలికంగా వున్న పెద్దమనిషి. కేవలం శశికళకి తప్ప యింకెవరికీ ప్రవేశం లేదు అన్నప్పుడైనా జనాలు అలజడికి దిగకపోవడం కూడా తమిళనాడు తత్త్వానికే వ్యతిరేకం. వీరపూజ, వ్యక్తి ఆరాధన, బలవన్మరణాలు- మొక్కులు- యివన్నీ చెన్నై ప్రాంతంలో టాప్‌గేర్‌లో చెలరేగుతాయి. తాపీగా, జనాలకి- అమ్మ మరణం గురించి కొంచెం కొంచెంగా అందిస్తూ- వాళ్లనంతా రాజీ స్థాయికి తెచ్చినదెవరు? జయకు సవతి అన్న సహా బంధువులున్నారు. ఎవ్వరినీ రానివ్వకుండా, అతి గోప్యంగా జరిగిన అపోలో చికిత్స- కోలుకోడానికా? లేక అంతిమ యాత్రకి సన్నద్ధం చేయడానికా? ఆనాటి సాయంకాలం- జయలలిత ఆధ్వర్యంలోని టి.వి. ఛానల్ సహా ఆమె మరణ వార్తను ఎలా ప్రకటించాయి? పైగా ‘రూమర్లు’ పుట్టించారంటూ గవర్నమెంట్ ఎంతోమందిని అరెస్ట్ చేయడం ఏమిటి? రాజులు, సంస్థానాధీశులు మరణిస్తే- లోపల నాలుగూ సర్దుకునేదాకా మృతిని ప్రకటించరు. అలాగా ప్రజావ్యవస్థ నిర్మాత, ప్రతినిధిగా ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి జయమ్మ మరణాన్ని- అర్ధరాత్రి దాకా, జనాలంతా ఏడ్చి ఏడ్చి నిద్రలోకి జారుకునేదాకా ఆలస్యం చేయడమేమిటి? అన్న ప్రశ్నలే చెలరేగాయి.
దొంగలూ దొంగలూ కలిసి వూళ్లూ వూళ్లూ పంచుకున్నారు అన్నట్లుగా- శశికళ, పన్నీల్ సెల్వన్‌లు ఈ కుట్రలో భాగస్వాములు. ముఖ్యమంత్రి పదవినీ, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవినీ ఇద్దరూ పంచేసుకున్నారు- అని తమిళనాడంతా కోడై కూస్తూన్నది. చికిత్స జరుగుతున్నప్పుడే ఒక ‘పిల్’ వేయడం జరిగింది. ‘కోర్టు’ డ్రమెటిక్‌గా తిరస్కరించింది దానిని అప్పుడు!
అందరికీ ‘అమ్మ’ గానీ- ఆమె మరణం తప్పదేమోనని అనుకుంటున్న వాళ్లకి మరో ఆలోచన వున్నది. శశికళని ఏనాడో గెంటివేసింది అమ్మ. కాని శశికళ ఆమెని ఇరకాటంలో పెట్టి తిరిగి ‘కోటలో పాగా వేసింది’. అది ఆమె గత చరిత్ర అని యివాళ నలుదెసలా అట్టుడికిపోతున్నది.
చిన్నమ్మ రొట్టి తిరిగి నేతిలో పడ్డట్లేనా? లేక ‘రిట్’ ఏదైనా విరిగిపడి, కథ మొదటికి వస్తుందా? అమ్మకి నోబుల్ పురస్కారం, మెగసెసే అవార్డు, భారతరత్న- అంటూ గోల చేస్తున్న జనాలు అమ్మ మరణంపై దర్యాప్తు చేయలంటూ అలజడి చేయడం మొదలెట్టారు ఇప్పుడు.-
‘‘ప్రోబ్ డిమాండ్ రుూజ్ రీచింగ్ క్రెసెండో!’’
*