వినదగు!

ఆత్మ.. ఇహంగా ప్రకటనం, పరంగా ప్రకాశనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గిక గీత
*
మనం మాతృగర్భ అవతారులం.. భూగర్భ జీవులం.
మన మాతృగర్భాలకు సరితూగే మాతృగర్భాలు ఈ భూగర్భంలో కోటానుకోట్లు.
ఈ భూగర్భం విశ్వగర్భంలోనిదే.. ఈ విశ్వ గర్భాన్ని పోలిన విశ్వగర్భాలు అనేకాలు.
మొత్తానికి, మాతృగర్భమైనా, భూగర్భమైనా, విశ్వగర్భమైనా ఏకగర్భమైన ఆ హిరణ్యగర్భ అంశలే...
ఆ అరూప గర్భానికి రూప అంశలే!
ఆ అరూప అంశనే మన ఆత్మ కూడా!
కాబట్టి, ఆత్మ ఇహానిదీ, పరానిదీ.
మాతృగర్భం నుండి విడివడి భూగర్భంలో చరిస్తున్నంత కాలం ఆత్మది లోయర్ నేచర్! భూగర్భాన్ని వీడి విశ్వగర్భంలో లయించినంత కాలం హయ్యర్ నేచర్!!
దేహానికి పరిమితమైనంత కాలం ఆత్మ ఇహానిదే అనిపిస్తుంటుంది. అంటే, ఆత్మవర్తనం కూడా దేహవర్తనంలా మానసిక వర్తనమే. కానీ, ఆత్మ ఈ దేహాన్ని, మనసును దాటిన తర్వాత తన పుట్టిల్లు అంటే ఆరిజిన్ ‘పర’మే అని గుర్తిస్తుంది. అయితే తన పర చిరునామా ఇహంలో ఉండగానే ‘ఎరుక’గానే ఆత్మకు తెలుస్తుంది. అలా తెలుసుకో గలగటమే ఆధ్యాత్మికంగా అడుగుపడటానికి తొలి అంకం.
మొత్తానికి, ఇహంలో ఉండగా ఆత్మ దేహాత్మగానే తన చిరునామాను ప్రకటిస్తుంది. అయితే ఆత్మ తన ఆధ్యాత్మిక ఆనవాళ్లను పసిగట్టిన తర్వాత తన శాశ్వత చిరునామాను విశ్వాత్మగానే భాసిల్ల చేసుకుంటుంది. కాబట్టి ఆత్మది ఇహంగా ప్రకటనం, పరంగా ప్రకాశం. భౌతిక బంధాల నుండి రెక్కలు విదల్చటమే ‘పరం’పరంగా ఆత్మానే్వషణ. అలా దేహం నుండి విముక్తమయ్యే ఆత్మకు లభించేది పరిపూర్ణానందం, చిదానందం.
పరానికి చెందిన ‘చిత్’ అనేది శూన్యానికి ప్రతీక... త్రిగుణాతీత తత్వానికి చిరునామా... అంటే సత్వరజస్తమో గుణాలకు అతీతమైన ఆనందం అని. ఇదే చిత్ ఇహంగా మానసికానందం.. త్రిగుణాత్మకం అంటే భౌతికంగా ఆత్మానందం అపరానందం... అహంకార జనితం. అందుకే భౌతిక సంపదల మధ్య ఆత్మది అపర ప్రకృతి అనీ, అధిభౌతిక వనరుల మధ్య ఆత్మది పర ప్రకృతి అనీ అంటుంటాం. కాబట్టి మన జీవన నాణేనికి ఒకవైపున పర ప్రకృతి మరొకవైపున అపర ప్రకృతి శాసమై ఉంటాయి. ఈ రెండు కోణాలను ఆవిష్కరించటమే కృష్ణుడు చేసిన గీతోపదేశం.
అన్నట్టు, అపర ప్రకృతిలోని మన పాంచభౌతిక దేహమంతా జ్ఞానేంద్రియ విలసితం. దైహిక ప్రయాణంలో మనం పొందే అనుభవాలన్నీ మనసు ప్రోది చేసిన జ్ఞానసంపదే. కాబట్టి ఇంద్రియ భోగమంతా మానసికానందమే! అయితే అనుభవాలనన్నింటినీ మనసులో భద్రపరచుకోక అవసర, అనవసర అనుభవాలంటూ బేరీజు వేసుకుని అనవసరాలను త్యజించగలిగితే తక్కిన అవసర అనుభవాలు ‘జ్ఞానం’గా మన భౌతిక జీవితాన్ని ఉన్నతాసనంపై కూర్చుండబెడ్తాయి. ఈ ఉన్నతాసనాన్ని చేరుకోవటానికి కావలసింది ‘నేను’ తప్ప ‘నాది’ కాదు.
* * *
జీవన యానం అంటేనే కర్మాచరణ. కరుగుతున్న ప్రతీ క్షణంలోను మనం కర్మబద్ధమయ్యే ఉంటాం.. అంటే కర్మ నిర్వహణ జరగని ఏ క్షణమూ జీవితం అనిపించుకోదు. మనలోని సత్వ రజస్తమో గుణాలకు అతీతంగా ఏ కర్మా జరగదు. అంటే, మన ఎమోషన్ ఎటువంటిదైనా దానికి బాధ్యులమూ, ఆ ఎమోషనల్ బిహేవియర్‌కు కారకులమూ మనమే. కాబట్టి, ప్రాపంచిక పారవశ్యత అనేది అపర ప్రవృత్తి జనిత కర్మజీవనమే!
ఈ ప్రాపంచిక పారవశ్యత నుండి బయటపడి పర ప్రకృతి అస్తిత్వాన్ని అనుభూతించాలంటే ఆ చిదానందాన్ని అణుమాత్రంగానైనా ఈ అపర ప్రవృత్తిలోకి దించుకోవలసిందే. ఈ అణుమాత్ర కర్మాచరణ పర ప్రవృత్తికి బీజప్రాయమే అయినా అదే అనంతంలా విస్తరిల్లుతుంది. అంటే దేహాత్మ అందుకునేది అణుమాత్ర శుద్ధ చైతన్యం, హయ్యర్ కాన్షియస్‌నెస్. అదే విశ్వాన్ని విశ్వసనీయంగా జీవాత్మ ముందు నిలుపుతుంది. అప్పుడు మన ఆత్మ నేత్రం ముందు ఈ ప్రపంచం విశ్వగర్భంలో అణుమాత్రంగానే అస్తిత్వాన్ని కలిగి ఉంటుంది. ఇదీ మన భౌతికంలోని అధిభౌతిక దర్శనం.. విశ్వదర్శనం. ఈ దర్శనం మన మనస్సుదీ కాదు, జ్ఞానానిదీ కాదు. కేవలం ఆత్మది మాత్రమే! అంటే, పాంచభౌతికం కాని శుద్ధ చైతన్య దర్శనమే విశ్వదర్శనం.
కాబట్టి కర్మాచరణ నుండి పారిపోవటం మన జీవన క్రియ కాకూడదు. దీనే్న గీత-
‘నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హ్య కర్మణః/ శరీర యాత్రాపి చ తేన ప్రసిద్ధ్యే ద కర్మణః’
దైనందిన జీవనమంటే నిత్య కర్మాచరణ. ఎటువంటి కర్మను నిర్వహించని జీవితాన్ని ఊహించలేము... అసలు, ఏ కర్మాచరణా లేని జీవితం ఉండదు. అటువంటి ప్రయత్నం చేసినా అది జీవితం అనిపించుకోదు. కాబట్టి ఈ మానవ జీవితానికి కర్మాచరణ అనేది తప్పదు. అలా కర్మబద్ధం కావటమే శ్రేష్ఠ జీవనం. కాబట్టి ఈ జీవితానికి కావలసింది కర్మలు చేయకుండటం కాదు.. ఫలాసక్తి లేని కర్మలు చేయటం.
ఇంతకీ, కార్యాచరణ ఎప్పుడు సాధ్యమవుతుందీ అంటే స్వార్థం లేనప్పుడు. ఇక్కడ స్వార్థ రాహిత్యం అంటే సృష్టి వైచిత్రి, కాలచక్ర గమనాల ఎరుకను కలిగి ఉండటం. ‘అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః’ ఆహారం నుండి అంటే పదార్థం నుండి ప్రాణికోటి, వర్షం అంటే ప్రకృతి నుండి పదార్థం... ఫలితంగా కర్మ, కర్మాచరణ ప్రాదుర్భవిస్తున్నాయంటుంది భగవద్గీత. ఈ కాలచక్ర గమన వైచిత్రిని అర్థం చేసుకోలేకపోవటం వల్లనే ఇంద్రియ భోగం అతిశయించి మానవ జీవితం వ్యర్థ జీవనం అవుతోంది.
‘ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః/ అఘాయురింద్రియా రామో మోఘం పార్థ స జీవతి’
అని పార్థునికి చేసిన కృష్ణోపదేశ సారం ఇదే!
వ్యర్థ జీవనుడికి తాను తప్ప ఇతరం ఏదీ రుచించదు.
‘యస్త్వాత్మ రతిరేవ స్యాదాత్మ తృప్తశ్చ మానవః/ ఆత్మనే్యవ చ సంతుష్టస్తస్త్య కార్యం న విద్యతే’
ఇక్కడ, ‘ఆత్మ రతిరేవ’ అంటే తనపైనే అనురక్తి కలిగి ఉండటం, ‘ఆత్మ తృప్తశ్చ’ అంటే తనకు మించిన తృప్తి మరొకటి లేకుండటం, ‘ఆత్మనే్యవచ సంతుష్టస్త’ అంటే తన తోటిదే సంతోషం - మొత్తానికి ‘తాను’ తప్ప ప్రీతికరమైంది మరొకటి లేదంటే అది స్వార్థ పరత్వానికి పరాకాష్ట అనే అర్థం. మనం తరచు వాడే ‘సెల్ఫిష్ అర్థమూ ఇదే! ఇటువంటి మానవ జీవితానికి ‘కార్యం విద్యతే’ కర్మాచరణ అనేది కాగడా పట్టి వెతికినా కనిపించదు.. అంటే, ఫలాసక్తి లేని కర్మాచరణ ఇటువంటి జీవులకు సాధ్యం కాదు.
* * *
ఫలాసక్తి లేని కర్మ చేయటమే కర్మయోగం. యోగ సాధనలో తలమున్కలైనవారు కర్మయోగులు.. కర్మయోగులకు వలసింది చిత్తశుద్ధి.. ఉండవలసింది చిత్తశుద్ధి. ఇటువంటి యోగిపుంగవుల జీవనం నైష్కర్మ్య జీవనం. ఇక్కడ నైష్కర్మ్య జీవనం అంటే కర్మాచరణలో తానే కర్తనని విర్రవీగక ‘అకర్త’గా కర్మాచరణలో ముందుండటం.. అలాగే చేస్తున్న కర్మను కూడా ‘అకర్మ’గానే పరిగణించటం.
కర్మ పాంచభౌతికంగానే జరుగుతుంది. దేహాత్మ ఈ కర్మాచరణలో సాక్షీభూతంగా ఉంటుంది. కారణం దేహాత్మది అపర ప్రకృతి కాబట్టి. ఈ దేహాన్ని వీడితేనే ఈ అపర ప్రకృతి నుండి వైదొలగితేనే - ఆత్మ విశ్వావరణను ఆవహించి పర ప్రకృతిగా నాసిల్లేది. సోల్ ‘సెల్ఫ్’ నుండి ‘స్పిరిట్’గా పరిణమించటం అంటే ఇదే!
ఆత్మ వ్యక్తీకరణకు పాంచభౌతిక తత్వం, అష్టవిధ ప్రకృతి అవసరం. వీటి మధ్య చరిస్తున్నంత కాలం ఆత్మ మానసికంగానే వ్యవహరిస్తుంటుంది కాబట్టి ఈ అపర ప్రకృతిలో చరించే ఆత్మది మనం అధమ ప్రకృతి, లోయర్ నేచర్ అని అంటున్నాం. ఇక్కడ అధమం అంటే పనికిరానిదని కాదు, తక్కువ స్థాయిదని అర్థం. ఎప్పుడైతే మనం అధమ ప్రకృతి అని అంటున్నామో ఉత్కృష్ట ప్రకృతి, హయ్యర్ నేచర్ అనేది మరొకటుందనే! అదే పర ప్రకృతి.
పర ప్రకృతి భాగస్వామ్యం విశ్వగర్భంలో. కాబట్టి మన ఆత్మకున్న పర ప్రకృతిది విశ్వగర్భమైతే, అపర ప్రకృతిది భూగర్భం. మాతృగర్భం. అంటే భూలోకంలో మన ఆత్మది భౌతిక ఆచ్ఛాదన అయితే విశ్వాంతరాళంలో అదే ఆత్మది అధిభౌతిక ఆచ్ఛాదన.
ఆత్మది భౌతికంగా రూపం అభౌతికంగా అరూపం. రూపంగానైనా, అరూపంగానైనా ఆత్మ అగోచరమే అయినప్పటికీ వ్యక్తమవుతూనే ఉంటుంది. గిక తేజస్సతో.

-డాక్టర్ వాసిలి వసంతకువార్ 93939 33946